Actress Haritha : బుల్లితెరపై ఒకప్పుడు వరుస సీరియల్స్ చేస్తూ ఫేమస్ అయిన వాళ్ళు ఈ మధ్య కొందరు స్క్రీన్ మీద కనిపించలేదు. అయితే వాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గొప్పగా నటించే వాళ్ళు ఇలా దూరం అవడానికి కారణాలేంటని చాలామంది అభిమానులు ఆలోచిస్తుంటారు. మరి కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో బుల్లితెర ఫేమస్ యాక్టర్ హరిత జాకీ కూడా ఒకరు. ఈమె డాన్సర్, నటి, హీరోయిన్ కూడా.. ఈమధ్య స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో అమ్మ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.. అయితే తాజాగా ఈమె ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె తన బాడీ షేవింగ్ గురించి బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాడీ షేమింగ్ తో టార్చర్..
బుల్లితెర ఫేమస్ యాక్టర్ హరిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె దాదాపు 80 కి పైగా సీరియస్లలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ముద్దమందారం లో అమ్మ క్యారెక్టర్ లో నటించిన ఈమె ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్టిని సంపాదించుకుంది. తాజాగా ఆమె తన పర్సనల్ లైఫ్, కెరీర్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నాకు బెస్ట్ అంటే ఎవరు లేరు. అంతగా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మా అన్నయ్య చెల్లి, ఇప్పుడు నా హస్బెండ్ జాకి, నా కూతురు వీళ్లే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే నాకు ప్రపంచం అని ఆమె అన్నారు. మునిగిపోయేదాన్ని. దాంతో పిల్లలను చూసుకునేందుకు కొంతకాలంపాటు పనిమనుషులను పెట్టాను.. కొన్నిసార్లు పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళను అని హరిత జాకి అన్నారు.
నేను చిన్నప్పటి నుంచి బాగా బొద్దుగా ఉండేదాన్ని. దాంతో అందరూ నన్ను చెప్పిగా ఉన్నావంటూ చాలా ముద్దు చేసేవారు. ఇక పెళ్లయ్యాక బాబు పుట్టిన తర్వాత కంప్లీట్ గా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాము. మా అన్నయ్య నన్ను బండ అని పిలిచేవాడు. ఇక పాప పుట్టినప్పుడు చాలా బరువు పెరిగిపోయా.. 98 కిలోలకు చేరాను. నేను లావుగా ఉండటంతో చాలామంది బాడీ షేమింగ్ చేసేవారు. దాదాపు 15 ఏళ్ల పాటు నేను అవమానాలని ఎదుర్కొన్నాను. డైటింగ్ చేశాను. ఇప్పుడు బరువు తగ్గిన తర్వాత అనేవాళ్లే లేరు అంటూ ఆమె లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ రుద్రాణికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అస్సలు నమ్మలేరు..
సినిమా టు సీరియల్ జర్నీ..
ఒకప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న హీరోయిన్ సైతం ఇప్పుడు సీరియల్స్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఈమె కూడా గతంలో సినిమాలు చేసి బిజీ హీరోయిన్ అయింది.. సింగన్న మూవీలో హీరోయిన్‌గా చేశా.. చీకటి సూర్యులు సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించా.. సీరియల్స్ ఆపేస్తే మంచి హీరోయిన్ అవుతావని ఆర్.నారాయణమూర్తి చెప్పారు. అప్పట్లో నేను అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు ఆయన మాట వినుంటే ఇప్పుడు నా రేంజ్ వేరేలా ఉండేది అంటూ ఆమె అంటున్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అవుతున్న వారిలో హరిత జాకీ కూడా ఒకరు.