BigTV English

OTT Movie : సినిమా చరిత్రలోనే అత్యంత భయంకరమైన మూవీ… తీసిన డైరెక్టర్ మిస్సింగ్… బేబీ ఫేస్ సైకో కిల్లర్ కిరాతకం

OTT Movie : సినిమా చరిత్రలోనే అత్యంత భయంకరమైన మూవీ… తీసిన డైరెక్టర్ మిస్సింగ్… బేబీ ఫేస్ సైకో కిల్లర్ కిరాతకం

OTT Movie : హారర్ అభిమానులకు అబ్బురపరిచిన ఒక హాలీవుడ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భయంకరమైన సన్నివేశాలతో ఈ సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ పక్కాగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం ట్విస్టులే ఉంటాయి. ఒక నిషేధించిన సినిమాని రీ షూట్ చేయాలనే ఒక యువకుడితో ఈ స్టోరీ మొదలవుతుంది. ఆ తరువాత ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

టైలర్ ఒక ఫిల్మ్ స్టూడెంట్. 1980లలో నిషేధించబడిన ‘ది హిల్స్ రన్ రెడ్’ అనే వివాదాస్పద హారర్ చిత్రంపై మక్కువ చూపిస్తాడు. ఈ షూటింగ్ సమయంలో, ఈ సినిమా దర్శకుడు విల్సన్ వైలర్ కాన్కానన్ అదృశ్యమైపోతాడు. ఈ ఫిల్మ్ కాపీలు కూడా లేకపోవడంతో టైలర్ దాని గురించి డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకుంటాడు. అతను తన గర్ల్‌ఫ్రెండ్ సెరీనా, స్నేహితుడు లాలో, కాన్కానన్ కూతురు అలెక్సాతో కలిసి సినిమా షూటింగ్ జరిగిన అడవుల్లో లొకేషన్‌కు వెళ్తాడు. ఈ అడవుల్లోకి వెళ్ళిన తరువాత అక్కడ వీళ్ళు స్థానికుల చేత బంధించబడతారు. కానీ సినిమాలోని భయంకరమైన బేబీఫేస్ మాస్క్ ధరించిన కిల్లర్ వారిని రక్షిస్తాడు. ఆపై మళ్ళీ వారిని వేటాడటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు బేబీఫేస్ వీళ్ళపై దాడి చేస్తాడు. టైలర్‌ స్పృహతప్పుతుంది. సెరీనా అక్కడినుంచి పారిపోతుంది. అలెక్సాను అతను పట్టుకుంటాడు.


టైలర్ మేల్కొన్నప్పుడు, తనను వీల్‌చైర్‌కు కట్టివేసి ఉన్నట్లు గ్రహిస్తాడు. ఇక్కడ ఈ సినిమా గురించి అసలు రహస్యం బయటపడుతుంది. 20 ఏళ్ల క్రితం కాన్కానన్ నటులను నిజంగా చంపి, సినిమాలోని మరణ సన్నివేశాలను రియల్‌గా చిత్రీకరించాడు. అందుకే సినిమా నిషేధించబడింది. ఒక షాకింగ్ ట్విస్ట్‌లో, బేబీఫేస్ అలెక్సా, కాన్కానన్ ల మధ్య అనైతిక సంబంధం నుండి జన్మించిన వారి కొడుకు అని తెలుస్తుంది. ఇక స్టోరీ ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది. క్లైమాక్స్ వరకూ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇక వీళ్ళంతా ఆ ముసుగు మనిషి చేతిలో బలవుతారా ? అక్కడి నుంచి బయటపడతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసితెలుసుకోండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘ది హిల్స్ రన్ రెడ్’ (The hills run red) 2009లో విడుదలైన అమెరికన్ స్లాషర్ హారర్ చిత్రం. డేవ్ పార్కర్ దర్శకత్వంలో, సోఫీ మాంక్ (అలెక్సా), టాడ్ హిల్గెన్‌బ్రింక్ (టైలర్), విలియం సాడ్లర్ (విల్సన్ వైలర్ కాన్కానన్), జానెట్ మాంట్‌గోమెరీ (సెరీనా), అలెక్స్ వైండ్‌హామ్ (లాలో) నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫండాంగో ఎట్ హోమ్‌లో అందుబాటులో ఉంది. IMDbలో 5.4/10 రేటింగ్ ను పొందింది.

Read Also : అమ్మమ్మ చావుతో అంతులేని వింత సంఘటనలు… ఫ్యామిలీని ఆటాడించే అతీంద్రీయ శక్తి… కల్లోనూ వెంటాడే కథ

Related News

Police Police OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన థ్రిల్లర్ కామెడీ సీరీస్.. ఎప్పుడు, ఎక్కడంటే?

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ 6 తప్పక చూడాల్సిందే మరి..!

OTT Movie : సిస్టర్ వేషం వేసి మరో మహిళ భర్తతో… టబు అరాచకం చూడాల్సిందే భయ్యా… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : బంగారంలాంటి భార్య ఉండగా మరో అబ్బాయితో… వాడిచ్చే ట్విస్టుకు గుండె గుభేల్… బెస్ట్ సైకలాజికల్ హర్రర్ మూవీ

OTT Movie : ఊరిని వల్లకాడుగా మార్చే పిల్లలు… పడుకున్న దెయ్యాన్ని లేపి దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

Big Stories

×