E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా కోరికను తీర్చిన బాలు.. సుశీల ఎంట్రీతో ప్రభావతికి షాక్.. సత్యం ఎమోషనల్..

Gundeninda GudiGantalu Today episode: మీనా కోరికను తీర్చిన బాలు.. సుశీల ఎంట్రీతో ప్రభావతికి షాక్.. సత్యం ఎమోషనల్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అన్నది చెప్తుంది.. మీనాని అనకుండా అసలు ఉండలేవా వదిన అని కామాక్షి ప్రభావతికి గడ్డి పెడుతుంది.. నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది.. ఈ పూలు అమ్ముకునేది నన్ను నా ఇంట్లోనే ఉండనివ్వకుండా చేస్తుంది అని ప్రభావతి మీనా పై ఘోరంగా నిందలు వేస్తుంది.. ఇక బాలు సెకండ్ హ్యాండ్ లో మరొక కారు కొనాలని రాజేష్ ని తీసుకొని షో రూమ్ కి వెళ్తాడు. కార్లను చెక్ చేసిన బాలు మీ నాకు ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. ఇద్దరు కలిసి సెలెక్ట్ చేస్తారు కానీ మీనా ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం కొనకపోవడమే మంచిది అని అంటుంది.. అత్తయ్య మామయ్య ఎడమొహం పెడ మొహం లాగా ఉంటే మనం కారు కొంటే వాళ్ళు ఏమనుకుంటారు. మన స్వార్థం మనం చూసుకున్నామని అనుకుంటారు. అందుకే వాళ్ళు కలిసిన తర్వాత మనం కారు కొందాం అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అని మీనా అంటుంది. మీ నా మాటను బాలు వింటాడు. శృతి పురిటి నొప్పుల గురించి భయపడుతూ ఉంటుంది. రోహిణి చెప్పిన క్లాస్ తో అనుమానం మొదలవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. డబ్బింగ్ స్టూడియోలో పురిటి నొప్పుల గురించి డబ్బింగ్ చెప్పి వచ్చిన శృతి నిజంగానే ఇంత నొప్పి ఉంటుందా చాలా భయంగా ఉంది అంటూ టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది. మీనా అమ్మవడం మరో జన్మని పెద్ద క్లాసులు పీకుతుంది. ఇక రోహిణి మాత్రం తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బయటపెట్టి అడ్డంగా దొరికిపోతుంది. బిడ్డను కనేంతవరకు ఎన్ని నొప్పులు పడాలో అన్ని నొప్పులు పడతారు. చాలా పెయిన్ ఫుల్ గా రోహిణి చెప్పడం విన్న శృతి మీనా ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏదో ఆ నొప్పులని భరించి బిడ్డను తన్నట్లు అలా చెప్తున్నావేంటి అని మీన అడుగుతుంది.. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది రోహిణి.. కాస్త ఉంటే కచ్చితంగా నా బిడ్డ గురించి బయటపడేదేమో అని రోహిణి టెన్షన్ పడుతుంది.

Advertisement

సత్యం ఎవరు చెప్పినా వినడం లేదు అని మీనా బాలు అనుకుంటారు. బాలు మాత్రం ఎవరు చెప్తే వింటారో నాకు తెలుసు అని వెళ్లి ఊరి నుంచి సుశీలను తీసుకొని వస్తాడు. ఇంట్లో ఇంత జరుగుతున్న సరే నేను మీకు గుర్తుకు రావడం లేదా అని సుశీల బాలు పై సీరియస్ అవుతుంది. నీ పుట్టినరోజు వేడుకను ఎంతో సంతోషంగా చేసామో ఆ వెంటనే ఇలాంటి విషయం చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేక బామ్మ మేము ఏమీ చెప్పలేదు అని బాలు అంటాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దర్నీ కలిపే బాధ్యత తీసుకోవాలి అని బాలు అనగానే అది నేను చూసుకుంటాను నాకు వదిలేయరా అని సుశీల అంటుంది. సుశీల ఇంట్లోకి అడుగుపెట్టగానే మీనా ఎదురుగా వస్తుంది. ఇంట్లోకి అలా అడుగుపెట్టగానే మంచి శకునం ఎదురయింది. నా మనవరాలు ఎదురుగా వచ్చింది అంతా నాకు మంచి జరుగుతుంది అని సుశీల మీనా పై ప్రశంసలు కురిపిస్తుంది.

ఏమే నీకు కూడా నేను పరాయిదాన్ని అయిపోయానా.. నువ్వు కూడా నా దగ్గర ఈ విషయాన్ని దాయాలని చూసావా అని చూసి ఇలా మీనా ను అడుగుతుంది. మీనా మాత్రం లేదు అమ్మమ్మ నువ్వు పుట్టిన రోజు జరుపుకొని ఎంతో సంతోషాన్ని నీతో తీసుకొని వెళ్లావు. అప్పుడే ఇలా జరిగింది అని చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేకే మేము చెప్పలేదు అని అంటుంది. మీరు పెద్ద సాహసమే చేశారులే ఇప్పటికైనా నాకు చెప్పారు లేదంటే చెప్పేవాళ్ళు కాదేమో అని సుశీల అనుకుంటుంది. మీరు లోపలికి వచ్చి తీరిగ్గా కూర్చొని మాట్లాడండి అని మీన అంటుంది.. సుశీల ఇంట్లోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది.

Advertisement

ఏంటి ఇంట్లో ఎవరూ లేరా ఎక్కడికి వెళ్లారు నేను వచ్చాను అన్న సంగతి కూడా తెలియదా వీళ్ళకి అని సుశీల అందరిని కేకలు వేసి అరుస్తుంది. ప్రభావతిని పిలవగానే ప్రభావతి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి అత్తయ్య గారు అప్పుడే వచ్చారు అని అంటుంది. ఇది నా కొడుకు ఇల్లు నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను ఏ నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతుంది. నాకేమీ అభ్యంతరం లేదు అత్తయ్య గారు మొన్నే వచ్చారు కదా మళ్లీ వారంకే రావడంతో మీరు ఇలా తిరిగితే మీ ఆరోగ్యం ఏమవుతుందని అడిగాను అంతే.. ఇంట్లో చేసిందంతా చేసి ఇంక నువ్వు మాట్లాడుతున్నావు అని ప్రభావతికి చుక్కలు చూపిస్తుంది సుశీల.

నువ్వు ఇప్పటికీ ఆ మనోజ్ ని వెనకేసుకుని వస్తున్నావు చూడు అదే నాకు ఇంకా కోపంగా ఉంది అని సుశీల ప్రభావతి పై సీరియస్ అవుతుంది. వాడేదో బిజినెస్ లో లాస్ అయ్యాడు అందుకే ఇవ్వాల్సి వచ్చింది అని ప్రభావతి అంటుంది. ఇప్పటికైనా అలా చేయడం మానుకోమని సలహా ఇస్తుంది. ఈ విషయాలు అన్నింటి గురించి మీన సుశీలతో చెప్పింది అని ప్రభావతి సీరియస్ గా చూస్తుంది. ఏంటి దాని వంక చూస్తున్నావ్ అని సుశీల అడుగుతుంది. నీ గురించి నువ్వు చేసిన ఘనకార్యాల గురించి అదేమీ నాకు చెప్పలేదు. నేనే చెప్పాను అని బాలు అంటాడు.

Also Read: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ నటీనటులు.. ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు..?

నేను వచ్చి ఇంత సేపైనా సత్యం ఇంకా కనిపించలేదు ఏంటి ఎక్కడున్నాడు వాడు అని అడుగుతుంది. ఆయన పైన ఉన్నాడు అని ప్రభావతి అంటుంది. అయితే వెళ్లి పిలువు అని సుశీల అనగానే బాలు వీళ్ళిద్దరికీ ఇప్పుడు మాట లేవు కదా బామ్మ అని అంటాడు. నా కొడుకు దగ్గరికి నేనే వెళ్తాను అని సుశీల పైకి వెళ్తుంది. సత్యం సుశీలను చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇంట్లో ఇంత జరుగుతున్నా నువ్వు నాకు చెప్పలేదు నీకు ఈ అమ్మ అంటే ఇంతేనా అభిమానం ఉండేది అని సుశీల అడుగుతుంది. సత్యం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అమ్మా అని అంటాడు. ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి సత్యం సుశీలకు చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సత్యం ప్రభావతులు కలిసిపోతారా? చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×