E-Paper
Advertisement

OTT Movie : మర్డర్ కేసులో మతిపోగొట్టే ఇన్వెస్టిగేషన్… మిస్టరీ అంతా ఆ పర్సులోనే… ఓటీటీలోకి మమ్ముట్టి థ్రిల్లర్

OTT Movie : మర్డర్ కేసులో మతిపోగొట్టే ఇన్వెస్టిగేషన్… మిస్టరీ అంతా ఆ పర్సులోనే… ఓటీటీలోకి మమ్ముట్టి థ్రిల్లర్
Advertisement

OTT Movie : మలయాళ సినిమాలకు ఓటీటీలో యమ క్రేజ్ ఉంది. అందులోనూ థ్రిల్లర్లను వదిలి పెట్టకుండా చూస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు స్టార్ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో రిలీజైన 10 నెలల తర్వాత ఈ మూవీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పర్ ఏమిటి ? ఏ ఓటీటీలో వస్తుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’. ఈ సినిమా డిసెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 2025 జనవరి 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మిత భట్ లీడ్ రోల్స్ లో నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మమ్ముట్టి సొంత బ్యానర్ లో నిర్మించారు.

Advertisement

Read Also : చాలా దేశాలలో నిషేధించిన మూవీ… ఇలాంటి సినిమాను జీవితంలో చూసి ఉండరు

స్టోరీ ఏమిటంటే

డొమినిక్ అనే పోలీస్ ఆఫీసర్, కళ్లు రంగులు చూడలేని సమస్య వల్ల ఒక కేసులో తప్పు చేసి జాబ్ పోగొట్టుకున్నాడు. భార్య డివోర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఒక అద్దె ఇంట్లో ఉంటాడు. అతని అసిస్టెంట్ విక్కీతో కలిసి చిన్న చిన్న కేసులు తీసుకుంటాడు. ఒక రోజు ఇంటి ఓనర్ కి హాస్పిటల్‌లో ఒక మహిళ పర్స్ దొరుకుతుంది. ఈ పర్స్ యజమానురాల్ని ఫైండ్ చేస్తే, రెంట్ మాఫ్ చేస్తా అని డొమినిక్‌ని అడుగుతుంది. డొమినిక్ మొదట సింపుల్ కేస్ అని అనుకుని మొదలెడతాడు. పర్స్‌లో ID కార్డ్, ఫోటోలు, క్యాష్, కీస్ ఉంటాయి. ID ప్రకారం పేరు పూజ అని, ఆమె మిస్సింగ్ అని తెలుస్తుంది. డొమినిక్ విక్కీతో కలిసి హాస్పిటల్ CCTV చూస్తాడు, నందిత ఫ్రెండ్స్‌ని క్వశ్చన్ చేస్తాడు.

Advertisement

ఈ ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని షాకింగ్ ట్విస్ట్లు వస్తాయి. ఇది సింపుల్ కేస్ కాదు అని తెలుస్తుంది. ఇంకా ఎంక్వైరీ చేస్తుంటే పూజ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. చివరకు పూజను హత్య చేసినట్లు తెలుస్తుంది. దీంతో డొమినిక్ షాక్ అవుతాడు. ఇక స్టోరీ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. చివరికి పూజను హత్య చేసింది ఎవరు? కార్తీక్ ఏమయ్యాడు? ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×