Gundeninda GudiGantalu Today episode February 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు బయటకు వెళ్లి తన ఫ్రెండ్స్ ని డబ్బులు కావాలని అడుగుతారు. వాళ్లు నువ్వు ఇస్తానని చెప్పావు కదరా మరి ఒక మాట వాడికి ముందే చెప్పి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా అని అంటారు.. అయినా మాటిచ్చే ముందు రా ఆలోచించాలి కదా అని బాలుని అక్కడ వాళ్ళు కూడా అనడంతో.. నేను రాజేష్ కి హెల్ప్ చేయాలని అనుకున్నాను.. అంతే తప్ప తప్పేమీ చేయలేదు కదా అని బాలు అంటాడు.. మన దగ్గర ఉంది కదా అని మనం వేరే వాళ్ళకి ఇస్తే ఆ తర్వాత మనకి ఇవ్వడానికి ఎవరూ ఉండరు. మనము ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తే భార్యలు మాత్రం మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారు మీనా చెప్పింది కూడా నిజమే కదా అని బాలు ఫ్రెండ్ చెప్తాడు.
పెళ్లయిన తర్వాత ఫ్రెండ్స్ అందర్నీ వదిలేసాను ఇప్పుడు నాకు అన్ని మా ఆవిడే అని బాలు ఫ్రెండ్ అనడంతో నేను అలా కాదురా.. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాను అని బాలు అంటాడు.. ఎలాగైనా సరే రాజేష్ కి లక్ష రూపాయలు ఇవ్వాలి అని బాలు ఫిక్స్ అవుతాడు.. రోహిణికి విద్య కాల్ చేసి ఆ ఇంటి ఓనరు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలని అంటున్నాడు మరి ఏం చేయమంటావు అని అడుగుతుంది.. అయితే ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు ఉంటే కష్టం అని మాట్లాడుతూ ఉంటుంది.. రోహిణి చేసిన మోసం గురించి విద్య గుర్తు చేస్తుంది.. తర్వాత రోహిణి ఫోన్ మాట్లాడుతూ దుబాయిలో బిజినెస్ స్టార్ట్ చేశాడు అని అంటుంది.. అనుష్క గొడవ పడి మరి రోహిణి లక్ష రూపాయలు ని తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత మీనా రాజేష్ దగ్గరికి వెళ్లి డబ్బులు గురించి చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తన ఫ్రెండ్స్ తో రాజేష్ ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.. మీన రావడంతో ఏమైనా అమ్మాయిలా వచ్చావు మీరిద్దరేమైనా గొడవపడ్డారా అని అడుగుతాడు.. నేను మీకు ఒక సొంత చెల్లెలు లాగా మాట్లాడుతున్నాను అన్నయ్య మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఆయన డబ్బులు ఇస్తానని మీకు చెప్పాడు కదా.. మీరు అప్పు ఇవ్వడానికి మళ్లీ చాలా కష్టపడాలి ఇది మీరు ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్తాడు.. బాలు రాజేష్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫంక్షన్ కోసం ఏర్పాట్లు అని జరుగుతున్నాయా? నువ్వు డబ్బులు కావాలని అడిగావు కదరా ఇదిగో డబ్బులు అని బాలు ఇస్తాడు.. అది చూసిన రాజేష్ షాక్ అవుతాడు. ఇప్పుడు నాకు ఈ డబ్బులు వద్దురా అని బాలుతో రాజేష్ అంటాడు. నిన్ననే కదరా డబ్బులు కావాలి అని అడిగావు ఇప్పుడెందుకు వద్దు అని అంటున్నావు అని బాలు అంటాడు.
ఇప్పుడు వాడు వద్దు అని అంటున్నాడు కదరా.. ఇప్పుడు బలవంతంగా వాడికి ఇవ్వడం ఎందుకు అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నా సరే.. బాలు మాత్రం ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు.. రోహిణి అడిగిన లక్ష రూపాయలు ని మనోజ్ ఇస్తానని ఒప్పుకుంటాడు.. ఇక షో రూమ్ కి విద్య వచ్చి ఏడుస్తూ ఉండడం చూసిన రోహిణి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది.. మా అమ్మకి ఏదో కడుపులో గడ్డ లేసిందంటే ఆపరేషన్ చేయాలంట 75000 కావాలి అని రోహిణిని విద్య అడగడం మనోజ్ చూస్తాడు.. అయితే ఏమైంది అని అడిగితే రోహిణి వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంతా 75000 కావాలంట అని చెప్పగానే మనోజ్ జాలి హృదయంతో ఆ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.
మీ అమ్మకి ఆపరేషన్ అన్నావు కదా మనం డబ్బులు ఇస్తాడంట తీసుకో.. మనం మీ ఊరికి వెళ్లి మీ అమ్మకి ఆపరేషన్ చేపిద్దామని అంటుంది రోహిణి.. నువ్వేం బాధపడకే మనోజ్ డబ్బులు ఇవ్వగానే హాస్పిటల్ అది కట్టేసేయ్ అని రోహిణి బయటకు వెళ్ళిన తర్వాత అంటుంది.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక్కసారిగా నవ్వుకుంటారు. నీ నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఎంత బాగా యాక్ట్ చేసావో తెలుసా..? కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు నీ నటన చూస్తే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనిపిస్తుంది పాపం మనోజ్ అని రోహిణి అంటుంది.. అవును నిజమే నీకు ఇలాంటి బకరా ఇంకెప్పుడూ దొరకడు కదా అని విద్య రోహిణి ఇద్దరు కలిసి మనోజ్ ని దారుణంగా మోసం చేసి డబ్బులు గుంజుతారు..
ఇక ఆ తర్వాత రాజేష్ ని బలవంతంగా అడిగి ఏమైందో తెలుసుకుంటాడు బాలు. మీనా డబ్బులు గురించి నాకు మంచిగానే చెప్పింది రా అందుకే నాకు వద్దు అని రాజేష్ అంటాడు.. అనుకున్నాను తన డబ్బులేమీ ఇవ్వలేదు కదా నేను ఇస్తున్నాను తీసుకొని బాలు బలవంతంగా రాజేష్ కి లక్ష రూపాయలు ఇచ్చి వస్తాడు. ఇక తర్వాత మీ నాని పైకి తీసుకుని వెళ్లి బాలు సీరియస్ గా మాట్లాడుతాడు.. నువ్వు రాజేష్ దగ్గరికి ఎందుకు వెళ్లావు కొంచమైనా నీకు ఉందా అని అడుగుతాడు.. వాళ్ళ అమ్మ నాన్న కోసమే కదా వాడు డబ్బులు అడిగాడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు.. నేను రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బులు అవి. నీకు ఇవ్వడానికి ఏంటి అంత ఇబ్బంది అని బాలు మీనా తో కోపంగా మాట్లాడుతాడు..
వీళ్ళ మాటలు విన్న ప్రభావతి పైకి వచ్చి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతుంది.. వాడు సంపాదించి ఇచ్చిన డబ్బులను వాడికి ఇవ్వడానికి నీకేంటి అంతా మాయరోగం అని మీనాన్ని తిడుతూ మాట్లాడుతుంది ప్రభావతి. మీరు డబ్బులని వాళ్లకి వీళ్ళకి ఇవ్వడానికి కాదు మనం రూమ్ కట్టాలి అని అనుకున్నాం కదా అందుకు నేను ఇవ్వడానికి వద్దు అని అన్నాను అని మీనా అంటుంది.. అయితే మీనా బాలు ఇద్దరు గొడవపడడం చూసి ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. ఇక ఉదయం లేవగానే బాలు రాజేష్ వాళ్ళ అమ్మానాన్న షష్టిపూర్తికి వెళ్తున్నానని చెప్పగానే మీ నాన్న కూడా తీసుకెళ్లాలని సత్యం అంటాడు.
Also Read : ధీరజ్ ప్రేమకు ఫిదా.. సాగర్ జాబ్ బయటపడుతుందా..? అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..
సత్యం చెప్పడంతో మీనాని ఇష్టం లేకపోయినా బాలు అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడున్నావ్ వాళ్ళందరికీ మీనాని పరిచయం చేస్తాడు.. ఆ తర్వాత ఫస్ట్ పూర్తి జరగాల్సిన దంపతులు ఎలా ఉన్నారు ఏంటి అని బాలు వాళ్ళని అడుగుతాడు.. మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు మీ ఫ్రెండుకి తెలీదు. మీరు వెళ్లి ఒకసారి ఆయననే అడగండి అని రాజేష్ భార్య చెప్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..