E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం గుర్తు వచ్చినా రానట్టే నటిస్తున్న అమర్    

Nindu Noorella Saavasam Serial Today Episode June 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం గుర్తు వచ్చినా రానట్టే నటిస్తున్న అమర్    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  నిజం తెలుసుకున్న అమర్‌ ఆ విషయం బయటకు చెప్పకుండా మిస్సమ్మను ప్రేమగా చూస్తూ.. హారతి తీసుకుంటుంటాడు. అంతా గమనించిన చంభా అనుమానంగా మనోహరిని దగ్గరకు పిలిచి మనోహరి సార్‌ చూపులేంటి అదో రకంగా ఉన్నాయి. భాగీని చాలా ప్రేమగా చూస్తున్నాడు అని అడగ్గానే.. మనోహరి అది ప్రేమ కాదు తను కష్టపడి పూజలు చేసింది కదా..? అందుకోసం సానుభూతి చూపిస్తున్నాడు అని చెప్పగానే.. చంభా మాత్రం అనుమానంగా కానీ నాకు సార్‌ చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పగానే.. మనోహరి వెంటనే అమర్‌కు గతం గుర్తుకు వచ్చింది అనుకుంటున్నావా..? ఏంటి..? అంత లేదు అనగానే.. చంభా అంతేలే సార్‌కు గతం గుర్తుకు వస్తే ముందు నీ అంతు చూస్తారు కానీ భాగీని ప్రేమగా ఎందుకు చూస్తారు అంటుంది.

ఇంతలో హారతి తీసుకోవడం పూర్తయ్యాక అమర్‌ మీరంతా వెళ్లి కారులో కూర్చోండి అనగానే.. అందరూ వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక అమర్‌ దేవుడికి దండం పెట్టి మొక్కుతూ.. స్వామి ఈరోజు నన్ను ఎందుకు గుడికి రప్పించుకున్నావో ఇప్పడు అర్థం అయింది. నా భార్యా పిల్లల గురించి నాకు గుర్తుకు వచ్చింది. ఇందుకే వాళ్లు నన్ను గుడికి తీసుకొచ్చారేమో.. వాళ్లు చేసిన పూజలు తీర్చిన మొక్కులు నన్ను మళ్లీ మామూలు మనిషిని చేశాయి. గతం మర్చిపోయిన నేను ఇన్నాళ్లు వాళ్లను ఎంతో బాధపెట్టాను. ఇక నుంచి వాళ్లను బాగా చూసుకుంటాను. నేను అనుకున్నది నెరవేరాక అప్పడు నేను కూడా పెద్ద మొక్కు నెరవేర్చుకుంటాను అంటూ మొక్కి వెనక్కి తిరిగి చూడగానే.. రాథోడ్‌ అమర్‌ను గమనిస్తూ ఉంటాడు.

Advertisement

దగ్గరకు వెళ్లిన అమర్‌ ఏంటి రాథోడ్‌ నువ్వు వెళ్లలేదా..? అని అడగ్గానే.. రాథోడ్‌ నాకంతా అయోమయంగా ఉంది సార్‌ అంటాడు. అమర్‌ దేనికి అని అడగ్గానే.. మీకు మిస్సమ్మ ఎవరో గుర్తుకు వచ్చింది కదా..? బుజ్జమ్మ ఎవరో తెలిసింది మరి వాళ్లతో మీరు ఎందుకు ఏమీ చెప్పలేదు.. అని అడగ్గానే.. అమర్‌ ఇప్పుడే చెప్పదలుచుకోలేదు రాథోడ్‌ అంటాడు.. రాథోడ్‌ ఎందుకు సార్‌ అని అడిగితే నాకు గతం గుర్తుకు వచ్చిందంటే సంతోషించే వాళ్లతో పాటు షాక్‌ అయ్యే వాళ్లు ఉన్నారు రాథోడ్‌.. అనగానే.. రాథోడ్‌ షాకింగ్‌ గా ఎవరు సార్‌ అని అడగ్గానే.. అమర్‌ తెలియదని అరుంధతిని చంపిన వాళ్లే తనను నీడలా వెంటాడి యాక్సిడెంట్‌ చేశారు అనిపిస్తుందని.. వాళ్ల నుంచి తనకే కాదని మిస్సమ్మ, పిల్లలకు థ్రెట్‌ ఉందని అర్థం అవుతుందని వాళ్లెవరో తెలుసుకోవాలని చెప్తాడు.

అమర్‌ మాటలకు రాథోడ్‌ సూపర్‌ సార్‌ ఇప్పుడు మీరు కరెక్టు రూట్‌లో వెళ్తున్నారు అని మనసులో అనుకుంటాడు. ఆ శత్రువులు ఎవరో తెలుసుకునే వరకు  తనకు గతం గుర్తకు వచ్చిందన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదని రాథోడ్‌కు చెప్తాడు అమర్‌. రాథోడ్ అలాగే సార్‌ అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం టెన్షన్.. చింతామణి ఇంటికి భాగ్యం.. తిరుపతి ఎంట్రీతో షాక్..

Big Stories

Advertisement
×