E-Paper
Advertisement

కిల్లర్లను దారుణంగా చంపేసే ముసలోడు.. అసలు ట్విస్టు తెలిస్తే మతిపోద్ది, డోన్ట్ మిస్

కిల్లర్లను దారుణంగా చంపేసే ముసలోడు.. అసలు ట్విస్టు తెలిస్తే మతిపోద్ది, డోన్ట్ మిస్
Advertisement

Action Thriller : హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా ? అయితే మీరు ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. 2019లో విడుదలైన ‘పోలార్’ (Polar) అనే మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. పాపులర్ గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రిటైర్మెంట్ వయసుకు వచ్చిన ఒక ప్రొఫెషనల్ అసాసిన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీని నెట్ ఫిక్స్ లో వీక్షించవచ్చు. మరి మూవీ స్టోరీ ఏంటి ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో హీరో 50 ఏళ్ల డంకన్. అతనికి మరో 14 రోజుల్లో 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ క్రమంలోనే ఆయన రిటైర్ అవ్వాలని అనుకుంటాడు. ఎవరికీ తెలియని మంటానా అనే ఒక మంచు కురిసే ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా జీవించడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ అతనికి కామెలా అనే ఒక అమాయకపు యువతి పరిచయమవుతుంది. ఆమె తన గతంలోని ఏదో బాధాకరమైన సంఘటన కారణంగా ఒంటరిగా భయపడుతూ బతుకుతుంది. హీరో నెమ్మదిగా ఆమెకు దగ్గరయి, రక్షణగా నిలబడతాడు.

Advertisement

ఇంకోవైపు డెమోక్లెస్ సంస్థ అధిపతి అయినా బ్లూట్ అనే క్రూరమైన బిజినెస్మెన్, డంకన్ కు ఇవ్వాల్సిన భారీ పెన్షన్ డబ్బులు ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తాడు. టాప్ అసాసిన్లు అక్కడ పని చేస్తారు. అయితే వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి భారీగా డబ్బు వాళ్ళ ఎకౌంట్లో జమవుతుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. ఒకవేళ రిటైర్మెంట్ ఏజ్ కాకముందే చనిపోతే, రిటైర్మెంట్ డబ్బు సంస్థకే తిరిగి చేరుతుంది. అందుకే వీళ్లంతా కలిసి హీరోని చంపాలని ప్లాన్ చేస్తారు. కానీ డంకన్ మాత్రం ఒంటి చేత్తో తనకోసం వచ్చిన గ్యాంగ్ మొత్తాన్ని దయ లేకుండా క్రూరంగా చంపేస్తాడు. ఈ సమయంలోనే బ్లూట్ మనుషులు కామెలాను కిడ్నాప్ చేసి బ్లూట్ హెడ్ క్వార్టర్స్ కు తీసుకెళ్తారు.

తనని నమ్మిన కామెలాను రక్షించడానికి డంకన్ డైరెక్ట్ గా శత్రువుల కోటలోకి అడుగు పెడతాడు. దీంతో అతనిని పట్టుకుని తీవ్రంగా టార్చర్ చేసి చంపాలని చూస్తారు. కానీ అవన్నీ భరించిన హీరో తన ఫైటింగ్స్ స్కిల్స్ తో బ్లూట్ తో పాటు అతని సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటాడు. అయితే చివర్లో కామెలా గురించి ఓ షాకింగ్ నిజం బయటకు వస్తుంది. మరి ఆ షాకింగ్ నిజం ఏంటి ? హీరో గతానికి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి ? తన కుటుంబాన్ని చంపిన ది బ్లాక్ కైజర్ ఎవరు ? చివరికి క్లైమాక్స్ ఎలా ముగిసింది ? అన్న విషయం తెలియాలంటే ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించాల్సిందే.

Advertisement

Read Also : ఫోన్లో పని కానిచ్చే అబ్బాయిలు… కాల్ చేశారని సొళ్ళు కారిస్తే ఖతం… ఐశ్వర్య రాజేష్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

బోర్డర్లో వైట్ కోట్ వారియర్స్ స్టోరీ… సైనికుల ప్రాణాల కోసం డాక్టర్ల పోరాటం

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

40 ఏళ్ల పెళ్లి బంధం… ఒక్క ట్రిప్‌తో బయటపడ్డ షాకింగ్ నిజం

హీరో సిద్ధార్థ్ కి భారీ షాక్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్!

ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ

హిందీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మా ఇంటి బంగారం.. ఎప్పుడంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

రైతు కొడుకు నుంచి పూణే డాన్‌గా… షాకింగ్ క్రైమ్ డ్రామా

Big Stories

Advertisement
×