E-Paper
Advertisement

Podarillu Today Episode : మనసును చంపుకున్న కేశవ.. హమ్మయ్య శైలు ప్రేమ సక్సెస్.. చక్రీ ట్విస్ట్ మహా షాక్..

Podarillu Today Episode : మనసును చంపుకున్న కేశవ.. హమ్మయ్య శైలు ప్రేమ సక్సెస్.. చక్రీ ట్విస్ట్ మహా షాక్..
Advertisement

Podarillu Today Episode June 26th : శైలుకి పెళ్లిచూపులు జరిగాయి పెళ్లవుతుంది అని చెప్పగానే కేశవ ఫీల్ అయిపోతాడు. ఆ మాట వినగానే కేశవ చాలా బాధపడిపోతాడు.. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దూరమైపోతుంది అని కంగారు పడిపోతుంటాడు.. ఇంటికి వచ్చి తను తన గర్ల్ ఫ్రెండ్ దూరమవుతుందన్న కోపాన్ని నారాయణ మీద చూపిస్తాడు.. ఇంటికి రాగానే మాధవ దోశలు వేసుకు కనిపిస్తాడు.. కేశవ ని తింటావా అని అడిగితే ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. చ క్రీ ఎక్కడున్నాడో ఫోన్ చేయమని చెప్తే వాడికి చేయాల్సిన అవసరం నాకు లేదు అని అరుస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన నారాయణను కేశవ దారుణంగా తిడతాడు.. చక్రీకి నేర్పించి మహాలక్ష్మిని ఇలా బయటికి పంపించాడు అని మాధవతో చెప్తాడు.. కేశవ అలా మాట్లాడటం విని కన్నా కూడా నాకు ఆకలి చచ్చిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. కన్నా వదిన చాలా బాధపడుతుంది అని ఎమోషనల్ అయిపోతాడు..

కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

కేశవా ఒక్కడే కూర్చుని బాధపడిపోతూ ఉంటాడు. అయితే మాధవ్ భోజనం చేయడానికి రారా అని పిలుస్తాడు.. నాకు తినాలని అనిపించడం లేదు అన్నయ్య అని కేశవ్ అంటాడు.. ఏమైందిరా ఎందుకు అంతగా బాధపడుతున్నావు అని బాధపడుతాడు.. మన ఇంటికి మళ్ళీ శాపం తగిలినట్టు కనిపిస్తుంది అన్నయ్య నాకు అని కేశవ అనగానే.. మాధవ్ అదేమీ ముని శాపం కాదురా ఆ రోజుల్లో అంతగా తపస్సు చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళ నోటికి చాలా పవర్ ఉండేది. కానీ ఈ రోజుల్లో నోరు పరేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.. అలాంటి వాళ్ళు పెట్టిన శాపం ఎప్పటికీ తగలదు.. నారాయణ తన భార్యలతో బంధం అంతవరకే ఉందేమో అందుకే అది దూరమైంది. మనకు ఇష్టమైన వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోవద్దు రా అని మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు..

మనసు మార్చుకున్న కేశవ..

Advertisement

ఎప్పుడు ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండాలి.. మనం ఎంత కావాలని అభిమానిస్తున్నామో వాళ్ళకి తెలియచేయాలి.. నారాయణ తో ఆ బంధం అంతవరకే ఉండింది.. లోపల బాధపడుతున్న బయటికి మాత్రం గంభీర్యంగా కనిపిస్తున్నాడు.. ఇక చక్రి అంటావా వాడి చేతులారా వాడి జీవితాన్ని వాడి నాశనం చేసుకున్నాడు. వాడి జీవితాన్ని వాడు నాశనం చేసుకొని దేవత లాంటి మహాలక్ష్మిని ఈ ఇంట్లో ఉంచి వెళ్లేలా చేశాడు.. ఇక నేను కూడా గాయత్రి ప్రేమకు దూరమై ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ బాధ నా గుండెల్లో ఎంత భారంగా ఉందో నేను చెప్పలేను అని మాధవ ఎమోషనల్ అవుతాడు.. ఇక కేశవ ఎలాగైనా సరే శైలు ప్రేమను దక్కించుకోవాలి అని ఫిక్స్ అవుతాడు.. నాకు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అని అక్కడికి వెళ్తాడు.. అయితే మాధవ్ ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని అడిగితే ఒక బండి రిపేర్ కి వచ్చింది అన్న పెళ్లి వస్తాను అని పరిగెత్తుకుంటూ వస్తాడు వెళ్తాడు..

శైలు ప్రేమను కేశవ అంగీకరిస్తాడా..?

శైలు వాళ్ళ ఇంటి దగ్గరికి కేశవ ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది.. ఏంటి మీ ముంగిసగాడు ఇంకా రాలేదు మనం చేసిన ప్లాను వర్కౌట్ కాలేదా అని బాధ పడిపోతుంది.. వాటికి రావాల్సింది కదా ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది.. అప్పుడు అక్కడ కేశవ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.. తన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.. ఈ ముంగిస వచ్చాడు మనకు ఏమీ తెలియకుండానే వాడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది. ఇంట్లో ఉన్న చెత్తను తీసి బయట పడేసే లాగా నటిస్తూ అక్కడికి వెళుతుంది అక్కడ కేశవాన్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది.. కేశవా పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో శైలు నాకోసం వచ్చాను అని చెప్పొచ్చు కదా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని ఆలోచిస్తుంది.. శైలు కేశవ మీద ఉన్న ప్రేమని బయటపెడుతుంది.. ఈ సీన్ఎ పిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది..

మహాకు సారీ చెప్పిన చక్రీ..

Advertisement

మహా హాస్టల్ దగ్గరికి చక్రి వెళ్తాడు. అయితే అక్కడ సారీ అన్నా బెలూన్స్ కనిపించడంతో దివ్య ఏంటది ఎవరికోసం సారీ అని అక్కడ చూడగానే కింద చక్రి కనిపిస్తాడు. మా హాస్టల్ దగ్గర ఎందుకు ఇంత షో ఆఫ్ చేస్తున్నావు నువ్వు దయచేసి ఇక నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. అయితే నా సారీ నేను యాక్సెప్ట్ చేయండి అని చక్రి ఎంతగా చెప్తున్నా సరే మహా మాత్రం జన్మలో ఇక తప్పు చేయను అని అంటుంది. మీ హాస్టల్ కి నేను వాచ్మెన్ గా జాయిన్ అయిన తర్వాత మీరు నన్ను క్షమిస్తారని చక్రి అడుగుతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రికి షాక్ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రి కేశవ కి తన బాధను చెప్పి ఇంకాస్త బాధపడతాడు.. ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: నగల కోసం కన్నీళ్లు పెట్టుకున్న కామాక్షి.. సుందరి పెళ్లి ఫిక్స్.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Related News

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  

Big Stories

Advertisement
×