E-Paper
Advertisement

Shooting at School: పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి, కెనడాలో దారుణం

Shooting at School: పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి, కెనడాలో దారుణం
Advertisement

Shooting at School: కెనడాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ కొలంబియాలోని ఓ పాఠశాలలో బుధవారం ఉదయం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో దుండగుడుతోపాటు 10 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా తెలిపారు.

కెనడాలో దారుణం.. పాఠశాలలో కాల్పులు

Advertisement

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలోని టంబ్లర్ రిడ్జ్ స్కూల్‌లో కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులు, నలుగురు పాఠశాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. కాల్పుల తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు.

అక్కడి కాలమాన ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఒంటిన్నర గంటల సమయంలో టంబర్ రిడ్జ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. కాల్పుల గురించి తెలియగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దుండగుడు గోధుమ రంగు దుస్తులు ధరించినట్టు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎంతమంది అనేదానిపై అధికారులు ఫోకస్ చేశారు.

Advertisement

10 మంది మృతి, అందులో విద్యార్థులు కూడా

ఘటన నేపథ్యంలో వారం రోజులపాటు పాఠశాలను మూసి వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వెబ్‌సైట్ వివరాల ప్రకారం టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో 7 నుండి 12 తరగతు వరకు ఉంది. దాదాపు 175 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఘటన సమయంల పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది తెలియాల్సి వుంది.

ప్రశాంతంగా టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలో కాల్పుల ఘటనలో ఆ దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో మరో 25 మందికి గాయపడ్డారు. వారిని స్థానిక వైద్య కేంద్రానికి తరలించారు. కాల్పులకు తెగబడిన తర్వాత యువతి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో ట్విస్ట్.. తెరపైకి జూకర్ బర్గ్, మస్క్ ఫొటోలు

గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని హెలికాప్టర్ ద్వారా మెరుగైన చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తరలించారు. పాఠశాల ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దాడుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×