E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మనోజ్ సేఫ్.. డేంజర్ లో రోహిణి.. ప్రభావతికి షాకివ్వబోతున్న మీనా..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మనోజ్ సేఫ్.. డేంజర్ లో రోహిణి.. ప్రభావతికి షాకివ్వబోతున్న మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 26th: రాత్రి బాలు వాళ్ళు ఇంటికి రాగానే ప్రభావతి వచ్చారా ఊరినంతా ఉద్ధరించి వచ్చారా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. మేము దగ్గరుండి అన్ని చేసుకున్నాం కాబట్టి వాళ్లకి సంతోషం మిగిలింది.. లేదంటే మావయ్యకి బాధ మాత్రమే మిగిలేది.. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఏమైందిరా వచ్చిన పని పూర్తయిందా అసలు సుందరి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు.. సుందరి ప్రేమించిన అబ్బాయి వాళ్ళతోనే ఉండింది నాన్న సంబంధం ఖాయం అయింది వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పగానే సత్యం చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు..

సుందరిని పొగిడేసిన మాణిక్యం..

తర్వాత రోజు ఉదయం మాణిక్యం రంగ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ముందు రోజు సంబంధం గురించి మాట్లాడి వెళ్లిన మాణిక్యం తర్వాత రోజు సుందరీతో మాట్లాడి ఆమెను పొగిడేస్తూ ఉంటాడు.. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి ఉండడం నిజంగా గ్రేట్.. వేరే అమ్మాయిలైతే ఈపాటికి పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ ఈ అమ్మాయి మాత్రం తన పేరెంట్స్ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. మీ అమ్మాయి చాలా దూరం ఆలోచించింది.. అబ్బాయిని బుట్టలో వేసుకుంది. చాలా మంచి అమ్మాయి అని తనమీద పొగడ్తల వర్షం కురిపించేస్తాడు. మాణిక్యం మాటలకి రంగా ఫిదా అయిపోతాడు.. ఇలాంటి మంచి అమ్మాయి మా ఇంటికి కోడలు అవడం మా అదృష్టం అంటూ రంగా ఫ్యామిలీని కూడా పొగిడిస్తూ ఉంటాడు.. ఏది ఏమైనా కూడా పిల్లల వల్ల మన రెండు కుటుంబాలు మంచిగా ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది అని మాణిక్యమంటాడు. మీలాంటి మంచి మనుషులు మాకు వియ్యంకులు కావడం మా అదృష్టం కూడా అని రంగా అంటాడు.

బాలును మాణిక్యం కలిస్తే..? 

Advertisement

మీ ఫ్రెండ్ అబ్బాయి ఎవరు అన్నారు కదా ఆయన కూడా చాలా కష్టపడ్డాడు.. సుందరితో మా వాడి పెళ్లి చేయాలని మా ఇంటికి వెళ్లి మాట్లాడేది సంబంధం కాయం అయ్యేలా చేశాడు. అతను ఉంటే బాగుండు నేను కూడా చూసేసి వెళ్లే వాడిని అని మాణిక్యం మాట్లాడుతూ ఉంటాడు.. అతనికి ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తాడు ఫోన్ చేయమంటారా అని రంగ అడుగుతాడు.. నిన్న మా పనుల వల్లే అలా ఇలా వెళ్లారు కదా ఇప్పుడు మళ్లీ అతని పిలిస్తే బాగోదు లేండి అతను రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని అంటాడు మాణిక్యం.. అయినా ఇప్పుడు మనం త్వరలోనే వియ్యంకుళం కాబోతున్నాం కదా. పెళ్లయిన తర్వాత కలుస్తూనే ఉంటాము ఫంక్షన్లు అవి ఇవి ఉంటే అతను కూడా వస్తూనే ఉంటాడు కదా అప్పుడు అతనితో ఇంకా బాగా మాట్లాడొచ్చు లేండి అని మాణిక్యం అనగానే రంగా సరే అని అంటాడు..

సుందరికి తండ్రిగా మారిన మాణిక్యం..

మీరు మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది అని రంగా అడుగుతాడు. అయితే మిగతా విషయాలు ఏమీ లేవండి మా అమ్మాయి ఒకటే కాబట్టి మేము మంచిగానే తనకి పెడతాము అని అంటారు. కానీ మాణిక్యం మాత్రం నాకు కూడా మీ అమ్మాయి వరస అవుతుంది. అన్ని దగ్గరుండి మేము చూసుకుంటాము మీరు అమ్మాయిని మాత్రమే పంపించండి అని సుందరికి తండ్రిగా మారతాడు మాణిక్యం. మొత్తానికి సుందరి చాలా అదృష్టవంతురాలు అని అందరూ అనుకుంటారు. మీరు చాలా మంచివారండి మీ ఇంటికి మా అమ్మాయిని పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని రంగ కూడా సంతోషంతో ఉప్పొంగిపోతాడు..

మనోజ్ కు గుడ్ న్యూస్.. 

Advertisement

మనోజు జిఎస్టి క్లియరెన్స్ నోటిఫికేషన్ వచ్చింది అని అనగానే రోహిణి ఇది మనకి గుడ్ న్యూస్ చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. హమ్మయ్య ఇప్పుడు జీఎస్టీ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంటాను అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇకమీదట మా మామయ్య గారికి వెళ్లమని, లేదా మా నాన్నగారు చచ్చిపోయారు కాబట్టి ఆయన దగ్గర ఆస్తులు గురించి కూడా మాట్లాడరు. నాకు ఎటువంటి ప్రమాదం లేదు నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్నాను అని రోహిణి అనగానే అప్పుడే బయట నుంచి దుమ్ముకుంటూ మీనా బాలు వస్తారు. ఏంటి నేను ఇప్పుడు మనశ్శాంతిగా ఉండొచ్చు అని అనుకునే లోపల ఇప్పుడు ఇలా జరిగిపోయింది అని వాళ్ళు షాక్ అవుతారు.. ఇకపోతే ప్రభావతి ఏంటి పొద్దున్నే ఈ తుమ్ములు గోల ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతుంది.

ప్రభావతికి మీనా స్ట్రాంగ్ కౌంటర్..

పొద్దున్నే సంచిలో దుమ్ముకుంటూ ఉంటే అందరికీ ఈ తుమ్ములు అంటుకుంటాయి అన్న విషయం మీకు తెలియదా అని ప్రభావతి అంటుంది.. ఏంటి తుమ్ములు గోల ఏంటి? జలుబు చేసి వచ్చింది కావాలని ఎవరైనా తుమ్ముతారా అత్తయ్య అని మీనా అంటుంది.. ఇదంతా కాదు నాకు వెళ్లి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని తీసుకురా ఆ తర్వాత ఈ తుమ్ములు నువ్వు కంటిన్యూ చేయొచ్చు అని ప్రభావతి అంటుంది. మీరు ఇలా తుమ్మి తుమ్మి నాకు కూడా తుమ్ములు వచ్చేలా ఉన్నాయి. ముందు అవి ఆపండి అని ప్రభావతి అరుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.. శృతి ఎవరు ఎలా పోతున్నా సరే ఈడికి మాత్రం కాఫీ తో పాటుగా అన్ని టైంకి చేసి పెట్టాలి ముందు ఆ పని చూడు మీనా అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read:Intinti Ramayanam Today Episode: పల్లవి మారిపోయిందా..? ఇదేం ట్విస్ట్.. భరత్ మాటకు మీనాక్షికి మైండ్ బ్లాక్..

Related News

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం టెన్షన్.. చింతామణి ఇంటికి భాగ్యం.. తిరుపతి ఎంట్రీతో షాక్..

Big Stories

Advertisement
×