E-Paper
Advertisement

Almond Milk: చర్మ సౌందర్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బాదం పాలతో కలిగే లాభాలు ఇవే !

Almond Milk: చర్మ సౌందర్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బాదం పాలతో కలిగే లాభాలు ఇవే !
Advertisement

Almond Milk: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో చాలా మంది తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన డ్రింక్స్ తయారు చేసుకుని తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పాలు, నానబెట్టిన బాదంపప్పులతో తయారు చేసిన ఈ డ్రింక్ పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది దీనిలోని విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరాన్ని లోపలి నుంచి బలపరుస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఇంతకీ బాదం పాలు తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందామా..

Advertisement

బాదం పాలు తాగడం వల్ల కలిగే  ప్రయోజనాలు:

మెదడును పదునుపెడుతుంది: బాదం పాలలో విటమిన్ E , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమ్మేళనాలు జ్ఞాపకశక్తి , మెదడు పని తీరును మెరుగు పరచడంలో సహాయ పడతాయి. క్రమం తప్పకుండా బాదం పాలు తీసుకోవడం వల్ల విద్యార్థులు, మానసిక నైపుణ్యాలు ఉన్న వారిలో ఏకాగ్రత మెరుగు పడుతుంది.

Advertisement

ఎముకలను బలపరుస్తుంది: ఈ పాలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఎముకల బలానికి ఈ పోషకాలు చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు, బాదం పాలు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చిన్న పిల్లల్లో ఎముకలు బలపడటానికి ఉపయోగపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచడం: బాదం పాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. దీనిలో ఉండే.. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ పడతాయి. అంతే కాకుండా జలుబు, దగ్గుతూ పాటు ఇతర కాలానుగుణ వ్యాధులను నివారించడానికి కూడా మీ డైల్ లో భాగంగా బాదం పాలను చేర్చుకోవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచుగా బాదం పాలు తాగడం చాలా మంచిది.

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: బాదం పాలు కొలెస్ట్రాల్ ఉండదు. అంతే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇవి సహాయ పడతాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Also Read: ఫ్యాటీ లివర్ సమస్యా ? ఇవి తింటే సమస్య దూరం

బరువు నియంత్రణలో సహాయం: బరువు తగ్గాలనుకునే వారికి బాదం పాలు మంచి ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా , ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. తరచుగా ఆకలి బాధలను నివారించడానికి , అతిగా తినకుండా నిరోధించడానికి కూడా సహాయ పడతాయి. బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా బాదం పాలు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

చర్మం, జుట్టుకు ప్రయోజనకరం: బాదం పాలు చర్మాన్ని పోషిస్తాయి. అంతే కాకుండా దాని సహజ మెరుపును పునరుద్ధరించడంలో సహాయ పడతాయి. దీనిలోని విటమిన్ E కంటెంట్ చర్మాన్ని వృద్ధాప్యం నుంచి రక్షిస్తాయి. ఇది జుట్టును బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×