E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాపై రెచ్చిపోయిన రోహిణి.. మీనాను కొట్టబోయిన ప్రభా.. మీనాకు అండగా బాలు..

Gundeninda GudiGantalu Today episode: మీనాపై రెచ్చిపోయిన రోహిణి.. మీనాను కొట్టబోయిన ప్రభా.. మీనాకు అండగా బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి రోహిణి నిజంగానే రెండోసారి ప్రెగ్నెంట్ అయిందని అనుకుంటుంది.. పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు మరి రెండుసార్లు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందనుకొని రోహిణి అని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది.. రోహిణిని కిందకు తీసుకొని వెళ్లి అందరి ముందర అడుగుతుంది. అయితే రోహిణి నేను అడ్డంగా ఇరుక్కుపోయాను అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలని ఆలోచిస్తుంది. అవును నేను మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యాను అబార్షన్ కూడా అయింది అని నిజాన్ని చెప్పేస్తుంది.. ఏం మాట్లాడుతున్నావ్ రోహిణి? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అని అనగానే మనోజ్ ఒక్కసారి కూడా ప్రెగ్నెంట్ అవ్వలేదు కదా మరి అయ్యాను అని అంటావేంటి అని అంటాడు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను కానీ అయినట్లు కూడా నాకు తెలియదు.. ఒకరోజు విపరీతమైన కడుపునొప్పి రావడంతో నేను హాస్పిటల్ కి వెళ్ళాను. అప్పుడే నాకు తెలియకుండానే అబార్షన్ అయిపోయింది అని రోహిణి కొత్త నాటకం మొదలు పెడుతుంది. అది నిజమేని అందరూ నమ్ముతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే… మీనా రెండోసారి తల్లి కాబోతుందని ఎలా తెలిసింది అన్న విషయాన్ని మొత్తానికి తెలుసుకుంటారు.. శృతి వల్లే తెలిసిందని అనుకుంటారు కానీ శృతికి మీనా చెప్పిందని తెలుసుకొని ప్రభావతి సీరియస్ అవుతుంది. మీనా నేను చెప్పాను నేనే ఆ విషయాన్ని చెప్పాను అని అనగానే ప్రభావతి రెచ్చిపోతుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటావా అని ప్రభావతి సీరియస్ అవుతుంది.. అసలు ఈ పూల అమ్ముకునే దాన్ని నా ఇంటికి తెచ్చి పెట్టారు. ఇది ఎలాంటి గొడవలు పెడుతుందో చూసారా అని ప్రభావతి సత్యం పై సీరియస్ అవుతుంది.. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావే నిన్ను అని కొట్టబోతుంది ప్రభావతి.

Advertisement

మధ్యలోకి వచ్చిన బాలు ప్రభావతి చేయి పట్టుకుంటాడు.. రోహిణి మాత్రం మీనా కరెక్ట్ గా దొరికింది. ఇప్పుడు గనక మనం క్లాస్ పీకకపోతే మరోసారి ఇలాంటి పనులు చేస్తుంది అని అనుకుంటుంది.. ఎందుకు మీనా నీకు నేనంటే అంత కక్ష. ఎప్పుడూ ఏదో ఒకటి నా గురించి చెప్తూనే ఉంటావా అని రోహిణి అంటుంది. అసలు మీనాకు డబ్బున్న వాళ్ళ అన్న.. చదువుకున్న వాళ్ళ అన్న ఇష్టం లేదు నా మీద అందుకే ఇలాంటి పగని పెంచుకొని అబద్ధాలు చెప్తుంది అని రోహిణి అంటుంది. ఛీ నువ్వు పైకి కనిపించే అంత మంచి దానివి కాదు అని రోహిణి మీనా అనే దారుణంగా తిడుతుంది. ఇలాంటి దానితో ఎలా ఉండాలి అత్తయ్య రేపు ఇంకొకటి చెప్తే మీరు నమ్ముకున్న ఉండరు కదా అని రోహిణి అంటుంది.

రోహిణి మీనా ఇంకొకసారి నా విషయాలు జోక్యం చేసుకోకూడదు అని రెచ్చిపోయి మాట్లాడుతుంది కానీ మీనా మాత్రం మౌనంగా ఉంటుంది. సత్యం ఏదో పొరపాటు జరిగింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి పై సీరియస్ అవుతాడు. మీనా మాత్రం నేనేమీ తప్పుగా అనలేదు కదా నా వల్లే కదా ఇదంతా తెలిసింది. లేకపోతే మీకు ఎప్పటికీ తెలిసేది కాదు కదా.. అని అన్నా కూడా ప్రభావతి సీరియస్ గానే ఉంటుంది. ఇక రోహిణి ఇంకొకసారి ఇలాంటివి జరిగితే నా సంగతి వేరేలా ఉంటుంది అని మీ నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

Advertisement

Also Read : ఒక్కటైన ప్రేమ ధీరజ్.. అమూల్య పెళ్లిపనుల హడావిడి.. శ్రీవల్లిపై అనుమానం..

మీనా మాత్రం బాధపడిపోతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మీనా ని వెతుక్కుంటూ వెళ్లిన బాలు ఎందుకు మీనా బాధపడుతున్నావు అని అడుగుతాడు.. ఎందుకండీ ఎప్పుడూ నాకే ఇలా జరుగుతాయి అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరు ఏదో అన్నారని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని మీనాతో బాలు అంటాడు. నిప్పు లేనిదే పొగ రాదు. పార్లరమ్మ ఏదో దాస్తుందని నాకు మొదటినుంచి అనుమానం. ఇప్పుడు కచ్చితంగా దీని గురించి బయట పెడతాను నేనున్నాను కదా నిజాన్ని బయటకి కక్కిస్తాను అంతవరకు నిద్రపోను అని బాలు అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చాటుగా విన్న రోహిణి బాలు మాట విని షాక్ అవుతుంది. ఇకమీదట నేను జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా ఈ బాలు నా బండారం మనోజ్ లాగే బయట పెట్టేస్తాడు. ఇప్పుడు ఎన్ని మాటలు అయితే నేను అన్నాను అంతకంతా నన్ను అంటారు అని అనుకుంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×