E-Paper
Advertisement

T20 World Cup 2026: ఇండియాలో అడుగుపెడితే చంపేస్తామంటూ బెదిరింపులు…బంగ్లాదేశ్ మ‌రో కుట్ర‌ ?

T20 World Cup 2026: ఇండియాలో అడుగుపెడితే చంపేస్తామంటూ బెదిరింపులు…బంగ్లాదేశ్ మ‌రో కుట్ర‌ ?
Advertisement

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడంపై అనేక రకాల కారణాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమ్జద్ హుస్సేన్ సంచలన ప్రకటన చేశాడు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలగడం అనేది తమ దేశ ప్రభుత్వం నిర్ణయం అంటూ పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. వాస్తవానికి టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ క్రికెటర్లందరూ ఆడాలని అనుకున్నారు, కానీ ఇండియాలో పర్యటిస్తే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని తమ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అమ్జద్ హుస్సేన్ వెల్లడించారు. దీంతో అమ్జద్ హుస్సేన్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

టి20 ప్రపంచ కప్ నుంచి వైదొలగడం పై బంగ్లాదేశ్ క్లారిటీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలగడం పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమ్జద్ హుస్సేన్ ( BCB Media Committee chairman Amjad Hossain) క్లారిటీ ఇచ్చారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడాలని తమ క్రికెటర్లు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.. ఇందులో భాగంగానే జట్టును కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు ఉన్నాయి.. ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో పర్యటించడం సేఫ్టీ కాదని తమ బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఇండియా టూర్ కు తమ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కచ్చితంగా అవసరం.. కానీ బంగ్లాదేశ్ సర్కార్ నుంచి ఆ క్లియరెన్స్ రాలేదని పేర్కొన్నారు. ఇండియాలో పర్యటిస్తే చంపేస్తామని బెదిరింపులు కూడా కోల్కతా నుంచి వచ్చాయని తెలిపారు. అందుకే ఇండియాలో ఆడటం సేఫ్ కాదని మాకు కూడా అనిపించిందని క్లారిటీ ఇచ్చారు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ అమ్జద్ హుస్సేన్.

ఐసీసీ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఐసీసీ ని కూడా విలన్ చేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమ్జద్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తమ క్రికెట్ బోర్డు అనేక డిమాండ్లు పెట్టింది.. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది.. కానీ తమ డిమాండ్లు ఒక్కటి కూడా ఐసీసీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు అమ్జద్ హుస్సేన్. తమ డిమాండ్లపై ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వేదికలు శ్రీలంకకు షిఫ్ట్ చేస్తే అయిపోయేది.. పాకిస్తాన్ తరహా లోనే తమ మ్యాచ్ లు కూడా నిర్వహించాలని కోరాం.. కానీ ఐసీసీ ఒక్క డిమాండ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సర్కార్ నిర్ణయం మేరకు టోర్నమెంట్ నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు అమ్జద్ హుస్సేన్. అయితే, చంపేస్తామ‌ని బెదిరింపులు వ‌చ్చాయ‌ని ఇండియాపై కావాల‌నే అమ్జద్ హుస్సేన్ వ్యాఖ్య‌లు చేశాడ‌ని, ఇది బంగ్లా అంటూ ఇండియ‌న్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×