BigTV English

Gundeninda GudiGantalu Today episode: విజిల్ తో అందరిని నిద్రలేపిన ప్రభావతి..బాలు పొట్ట కొట్టిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: విజిల్ తో అందరిని నిద్రలేపిన ప్రభావతి..బాలు పొట్ట కొట్టిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode june 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సువర్ణ మౌనిక బ్యాగులు తీసుకొని వచ్చి ఇక నుంచి వెళ్ళిపో అమ్మ.  వాడు మారతాడని నమ్మకం నాకు లేదు అని అంటుంది. నేను వెళ్ళిపోవాలని అనుకోవడం ఒక్క నిమిషం పని అత్తయ్య ఇప్పుడు నేను వెళ్ళిపోతే అక్కడ మా అన్నయ్య వచ్చి మీ అబ్బాయిని చంపేస్తాడు అది మీకు మంచిదేనా..? మీరు నాకు సపోర్ట్ గా ఉన్నంత వరకు నాకు ఏం కాదు అని అంటుంది. మీ మామయ్య తో నేను మొదట్లో అనేక ఇబ్బందులు పడ్డాను.. సంజయ్ కడుపున పడ్డం తర్వాత అలవాటైపోయింది అని సువర్ణ అంటుంది. నాకు వెయిట్ చేసేంత ఓపిక ఉంది అత్తయ్య.. కచ్చితంగా ఆయన మారతాడు అని మౌనిక అంటుంది.


మీనా దగ్గరికి రోహిణి వచ్చి కారు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటుంది. నిజంగానే ఆ కారును నువ్వు అంత డబ్బులు పెట్టి కొన్నావా అని అడుగుతుంది.. అవును రోహిణి ఎందుకలా అడిగావు అని నేను అడుగుతుంది. ఏం పేరు మాలల ఆర్డర్ కడితే అంత అమౌంట్ వచ్చిందా.. నీకు నా పెద్దపెద్ద ఆర్డర్ చేసే వాళ్లు ఉన్నారు. మరి నీలాగా కార్లు కొనలేదు కదా అని రోహిణి డౌట్ గా అడుగుతుంది. దానికి రోహిణి కి మీనా దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. నిజం చెప్పాలంటే మేమంతా డబ్బులు కట్టలేదు కొంత డబ్బులు కట్టి కారును తీసుకొచ్చాం మిగతావి ఈఎంఐ లో కట్టాలి అని చెప్తుంది.. మీనాను కారు కొందని కుళ్లుకుంటున్నావా అని శృతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని రవి, శృతిని ఇక్కడే ఉండేలా చెయ్యాలి అని అంటుంది శోభా.. అదేంటి నీ పిచ్చి గానీ ఆ రవి పేరెంట్స్ ను వదిలి ఉండడు కదా అని సురేంద్ర అంటాడు. బాలు ఉంటే గొడవలు జరుగుతాయి. వాడిని లేకుండా చేసి రెచ్చగోడితే గొడవ పెద్దది అవుతుంది. ఇక రవి, శృతిలు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. నేను అదంతా చూసుకుంటాను అని అంటారు.. ఏం చేస్తావో ఏమో అని సురేంద్ర అంటాడు.


ఇక బాలు మీనా కారు కొణించిందనే ఆనందంతో మీనా తో సరదాగా గడపాలని అనుకుంటాడు. కానీ మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇగో నీ కోసం ఏం తెచ్చానో చూడు అని మల్లెపూలు మీనాక్షిస్తాడు. మీనా నా చేతికి ఇవ్వడం ఎందుకు మీరే పెట్టొచ్చుగా అని అంటుంది. ఆ తర్వాత నీకోసం ఇంకో గిఫ్ట్ తెచ్చాను అని బాలు అంటాడు. కానీ ఆ బాక్స్ తీసే లోపల ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. ప్రభావతి ఏమైనా పూల కొట్టు పెట్టినప్పటి నుంచి చాలా బిజీగా ఉంటుంది ఇంట్లో ఏ పని సరిగ్గా చేయట్లేదు అని ప్రభావతి సత్యంతో అంటుంది. సత్యం మీనా చెయ్యకపోతే నువ్వు చెయ్యొచ్చుగా అని అంటాడు. అందుకే కదా నేను ఇడ్లీకి పిండి కలిపిందో లేదో మీకు పాలు ఇవ్వడం కూడా మర్చిపోయాను కదా తీసుకొని వస్తానని వెళ్తుంది.

వాళ్లు హాల్లో పడుకో ఉన్నారన్న సంగతి తెలుసు కదా.. ఇదిగో నా దగ్గర ఇది ఉంది కదా.. కిందకొచ్చేటప్పుడు మీ కొడుకే కదా విజిల్ ఊదుకుంటూ రమ్మన్నాడు అందుకే కొన్నాను అని ప్రభావతి అంటుంది. వాళ్లు ఇప్పటికే మనకు గదిచి ఇబ్బంది పడుతున్నారు నువ్వు చీటికిమాటికి అక్కడికి వెళుతుంటే ఇంకెంత ఇబ్బంది పడతారో ఆలోచించవా అని అంటాడు.. ఇలా వెళ్లి అలా వస్తాను అని ప్రభావతి విజిల్ ఊదుకుంటూ అందరిని నిద్రలేపుతుంది. కిందకు రాగానే మీనా పిండి కలిపావా.. మీ మావయ్య గారికి పాలు తీసుకెళ్లడం మర్చిపోయాను అని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. అది విన్న బాలు ఇద్దరు కోడలు ఇంకా ఉన్నారు కదా.. వాళ్లకి ఆర్డర్లు వేయొచ్చు కదా… ఏదో హోటల్ లో ఆర్డర్లు వేసినట్టు వేస్తున్నామని అరుస్తాడు.

వాళ్ళిద్దరూ ఇంట్లో నౌకర్లు పెట్టుకొని పని చేయించుకున్న వాళ్ళు వాళ్ళకి ఇలాంటి పనులన్నీ రావు అని ప్రభావతి అంటుంది. అలాగే మరి నువ్వు ఖాళీగా ఉన్నావ్ కదా నువ్వు చేయొచ్చు కదా అని ప్రభావతి గారు రివర్స్ కౌంటర్ వేస్తాడు. ఇక ప్రభావతి పైకి వెళ్ళగానే హల్వా తీసే లోపల శృతి కిందకి వస్తుంది. ఏంటి శృతి ఈ టైంలో కిందకు వచ్చావని నేను అడుగుతుంది.. బిర్యానీ కోసం వచ్చాను.. బిర్యానీ వచ్చాక తినేసి వెళ్తాను ఇదే మిడ్ నైట్ బిర్యాని చాలా టేస్టీగా ఉంటుంది అని అంటుంది..

Also Read : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

శృతి కింద కూర్చుని బిర్యానీ తింటూ ఉంటే బాలు, మీనా చూస్తూ కూర్చుంటారు. ప్రభావతి మంచినీళ్లు లేవని విజిల్ వేస్తూ మరోసారి కిందకు వస్తుంది. శృతి బిర్యానీ తినడం చూసి ప్రభావతి కూడా ఒక పట్టు పట్టాలని శృతి దగ్గర కూర్చుని తింటుంది. అందరూ వెళ్ళిపోయారు కదా అని బాలు హల్వా తీసి తినాలనుకుంటాడు.. కానీ మీనా ప్లేట్ తీసుకొచ్చే లోపల మనోజ్ రోహిణి రావడంతో అక్కడున్న హల్వాని చూసి వాళ్ళు తినేస్తారు. ఆ తర్వాత మనోజ్ రెచ్చిపోతాడు.. ఎటు చూసినా మనోజ్ బాలు కడుపు మీద కొడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శోభా ప్రభావతి ఇంట్లో గొడవ పెడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Tv Actress : ఒక్కరోజుకు సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్.. వంటలక్కకు పోటీగా నటిగా..!

Illu Illalu Pillalu Today Episode: రామరాజు రైస్ మిల్లులో దొంగతనం.. నర్మద తెలివికి ఫిదా.. తప్పు ఒప్పుకున్న భాగ్యం..

Intinti Ramayanam Today Episode: అవనిని పార్వతి క్షమిస్తుందా..? పల్లవి మాస్టర్ ప్లాన్.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలును మార్చుకోవడం కోసం మీనా ప్రయత్నం.. షాకిచ్చిన ప్రభావతి..అయ్యో పాపం..

Anshu Reddy: ఆ ఛానెల్ పై సీరియల్ నటి ఫైర్… అసలేం జరిగిందంటే..?

Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అమెరికాకు బయలుదేరిన రాజ్‌ – నిజం చెప్పేసిన కావ్య   

Big Stories

×