BigTV English

Kubera Twitter Review : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

Kubera Twitter Review : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

Kubera Twitter Review : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ‘సార్’ మూవీ తర్వాత చేసిన మరో తెలుగు స్ట్రైట్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ‘కింగ్’ నాగార్జున కూడా ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీలో నాగార్జున పాత్ర హైలెట్ గా నిలుస్తుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది.. ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సినిమాస్’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు , శేఖర్ కమ్ముల సంయుక్తంగా మూవీని నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీలో కీలక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో జూన్ 20 న మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న నేపథ్యంలో మూవీ పై అంచనాలు ఎక్కువే. మరి ఇవాళ థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో నెటిజన్ల అభిప్రాయం ఏంటో ఒకసారి ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం..


కుబేర మూవీ కాస్త లెన్త్ ఎక్కువగా ఉన్నా కూడా స్టోరీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది.. ధనుష్ అమాకత్వం, నాగ్ పెర్ఫార్మన్స్ బాగా సింక్ అయ్యాయి. స్టోరీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. శేఖర్ కమ్ముల యొక్క అసలైన కథాకథనం చాలావరకు మార్కును తాకింది.. సూపర్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

కుబేర మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్. ఇద్దరు చించేసారు.. మరో నేషనల్ అవార్డు పక్కా రాసిపెట్టుకోండి అని ట్వీట్ చేశారు.

కుబేర లో ధనుష్ తాండవం కనిపించింది. అతను ప్రతి సినిమాకి తన అంకితభావం, హార్డ్ వర్క్ మరియు కమిట్‌మెంట్ అన్నింటినీ ఉంచుతాడు. అతని కళ్లలోని తీవ్రత చూడండి. అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఈ కుబేరా అనేది పూర్ అండ్ రిచ్ అనే ఇతివృత్తంతో కూడిన బలమైన నటనతో కూడిన చిత్రం. ఎన్నడూ చూడని ఇమేజ్ & పెర్ఫార్మెన్స్‌లో ఆ పాత్రను చంపేశాడు. అటు ధనుష్ అసలైన పాత్రలో జీవించాడు, అతను నిజంగా బిచ్చగాడిలా అనిపిస్తుంది. సినిమా లెంత్ కొంచం ఎక్కువ ఉంది అదే మైనస్..

మొత్తానికి ఈ మూవీకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ధనుష్ వన్ మ్యాన్ షోలాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. లెంత్ కొంచెం ఎక్కువ అయ్యింది. అంతేకాని మిగితా అంతా బాగుంది. శేఖర్ కమ్ముల మార్క్ ను మరోసారి చూపించారు. బ్లాక్ బాస్టర్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ఇప్పటివరకు చేసిన సినిమాలు లో- బడ్జెట్ లో రూపొందినవి. స్టార్స్ తో ఆయన ఇదివరకు పనిచేసింది లేదు. టెక్నికల్ టీం కూడా కొత్తవాళ్లే ఎక్కువగా ఉంటారు. సంగీత దర్శకుడితో సహా.. ఇప్పుడు ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కలెక్షన్స్ ఎలా ఉంటాయో.. ఏది ఏమైన మొదటి నుంచి ఈ మూవీ పై ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి.. కలెక్షన్స్ ను బట్టి హిట్ అయ్యిందో లేదో చూడాలి..

Related News

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Big Stories

×