Brahmamudi serial today Episode: కావ్యను పక్కకు తీసుకెళ్లి ఎమోషనల్ అవుతుంటాడు రాజ్. తాను ఇష్టపడ్డ వ్యక్తికి దూరం అవుతుంటే తనలోని బాధ పెరిగిపోతుందని చెప్తాడు. మీకు నాలాగే ఉంది కదూ లోపల బాధ ఉన్నా పైకి నటిస్తున్నారు కదూ అంటూ అడుగుతాడు రాజ్. దీంతో కావ్య ఏంటండి చెప్పేది తెల్లారితే మీకు పెళ్లి ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుంది. ఇలాంటి టైంలో ఒక ఆడపిల్లను ఒంటరిగా మాట్లాడటానికి బయటకు పిలిచిందే తప్పు.. పైగా మీ ఇష్ఠం వచ్చినట్టు మనసు బాధగా ఉందా..? భారంగా ఉందా అని అడుగుతున్నారేంటి..? అయినా మీరు పెళ్లి చేసుకుంటే నాకెందుకు బాధగా ఉంటుంది. యామినికి మాట ఇచ్చింది మీరు. తనను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది మీరు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేది మీరు. నిర్ణయాలు అన్ని మీరు తీసుకుని నన్ను అడిగితే నేనేం చెప్తాను. నాకేం కావాలనేది నాకు ఓ క్లారిటీ ఉంది. మీకు ఏం కావాలో మీ మనసును అడిగి తెలుసుకోండి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పండి అంటూ కావ్య వెళ్లిపోతుంది.
అపర్ణ, కనకం, ఇంద్రాదేవి ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తుంటారు. అటువైపు వెళ్తున్న రుద్రాణి వాళ్లను చూసి షాక్ అవుతుంది. రాహుల్‌ను ఆపి అక్కడే చూస్తూ ఉండిపోతారు. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం అని అక్కడే నిలబడిపోతారు. ఇంతలో అక్కడికి కళ్యాణ్, అప్పు, స్వప్న వస్తారు. ఏంట్రా మనవడా వెళ్లిన పని ఏమైంది అని ఇంద్రాదేవి అడుగుతుంది. సక్సెస్ అయింది నాన్నమ్మ అని కళ్యాణ్ చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అపర్ణ ఏంటి కళ్యాణ్ నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. అబద్దం నేనెందుకు చెప్తాను పెద్దమ్మ.. ఆ యామిని రౌడీకి డబ్బులు ఇస్తున్నప్పుడు సాక్ష్యం దొరికింది అని చెప్తాడు. అంతే కాదు అమ్మమ్మ గారు ఆ సాక్ష్యాన్ని కళ్యాణ్ తన ఫోన్‌లో వీడియో కూడా తీశాడు. కళ్యాణ్ ఆ వీడియో చూపించు అని చెప్తుంది. కళ్యాణ్ వీడియో చూపిస్తాడు.
ఇంక ఈ సాక్ష్యంతో ఆ యామిని పీడ వదిలిపోతుంది అమ్మమ్మ గారు అరెస్ట్ చేసి లోపల వేశామంటే జీవితాంతం జైళ్లోనే చస్తుంది అని అప్పు చెప్పగానే దూరం నుంచి గమనిస్తున్న రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. భయంతో రాహుల్ అంతా అయిపోయింది మమ్మీ ఎవరికి దొరకకూడదో వాళ్లకే దొరికింది. ఆ అప్పుకు ఏ సాక్ష్యం దొరకకపోతేనే విడిచిపెట్టదు. ఇంత సాలీడ్ సాక్ష్యం దొరికితే ఇక విడిచిపెడుతుందా..? అసలు విడిచిపెట్టదు అంటాడు. విడిచిపెడుతుందో పట్టుకుంటుందో తర్వాత వెంటనే వెళ్లి ఈ విషయం యామినికి చెప్పాలి పద వెళ్దాం అంటూ రాహుల్, రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కనకం వెంటనే వెళ్లి ఆ యామినిని అరెస్ట్ చేసి తీసుకెళ్లవే అప్పు అని చెప్తుంది. దీంతో అంత తొందరగా అరెస్ట్ చేయడం కుదరదు దానికో ప్రొసీజర్ ఉంటుంది. రేపు పొద్దున్న అరెస్ట్ చేస్తాను అని చెప్తుంది అప్పు.
రాహుల్, రుద్రాణి ఇద్దరూ కలిసి యామిని దగ్గరకు వెళ్లి నిజం చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు. ఏమీ చేయోద్దని.. మీరు ఏమీ విననట్టు తెలియనట్టే ఉండండి అని చెప్తుంది యామిని. అలా ఉంటే వాళ్లు పెళ్లి ఆపేస్తారు కదా యామిని అని రాహుల్ అడిగితే వాళ్లు ఆపరు. ఆపనివ్వను.. కానీ వాళ్లకు మాత్రం నిజం మనకు తెలిసినట్టు వాళ్లకు తెలియకూడదు అని చెప్తుంది యామిని.
మరుసటి రోజు పెళ్లికి అంతా రెడీ చేస్తుంటారు. కావ్య హడావిడిగా తిరుగుతుంది. ఇంతలో యామిని వాళ్ల డాడీ వచ్చి కావ్యను చూస్తుంటారు. ఆయన్ని చూసిన కావ్య వెళ్లిపోతుంటే వెనకాలే వెళ్తూ కావ్యను ఆగమంటాడు. దీంతో కావ్య ఏంటండి ఎప్పుడు మీరు కళావతి అని పిలిచేవారు ఇవాళ కొత్తగా కావ్య అని పిలుస్తున్నారేంటి..? అని అడుగుతుంది. దీంతో ఆయన కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు కొత్తగానే పిలవాలి కదమ్మా అంటాడు. కానీ అలా పిలిస్తే మీ కూతురు జీవితానికే ప్రమాదం. ఈ మాట మీ అల్లుడు గారు విన్నారంటే ఈ పెళ్లి కూడా ఆగిపోతుందేమో చూసుకోండి మరి అంటుంది. దీంతో ఆయన ఈ పెళ్లి ఆగిపోకూడదనే నీ దగ్గరకు వచ్చాను కావ్య ఈ మాట నిన్న బాధపెడుతుందని నాకు తెలుసు.. కానీ ఈ పెళ్లి జరగాలని కావ్యను ప్రాధేయపడతాడు.
దీంతో కావ్య మీరేం టెన్షన్ పడకండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లిని ఆపను ఎందుకంటే నాకు నా తాళి బొట్టు మీద నమ్మకం ఉంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి జరగదు. దానంతట అదే ఆగిపోతుంది అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు రాజ్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే.. అపర్ణ, ఇంద్రాదేవి, కనకం, కళ్యాణ్ వస్తారు. వారితో రాజ్ కోపంగా కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారా..? నేను బాధపడతానని అలా చెప్పారా..? అంటూ నిలదీస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇన్నేళ్ల నుంచి తను మాకే అర్థం కాలేదు. నీకెలా అర్థం అవుతుంది. కానీ తను నిన్నే ప్రేమిస్తుంది. ఈ పెళ్లి ఎలాగూ జరగదు అని చెప్తారు. మరోవైపు యామినిని పెళ్లి కూతురుని చేసుకుని తీసుకొస్తుంటారు. ఇంతలో కావ్య ఎదురుగా వస్తుంది. దీంతో కావ్య, యామిని మధ్య చిన్నపాటి గొడవ జరగుతుంది. వైదేహి యామినిని తీసుకెళ్తుంది.
రాజ్, యామిని పెళ్లిపీటల మీద కూర్చుని ఉంటారు. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. రాహుల్, రుద్రాణి వస్తారు. కావ్య మాత్రం హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అందరూ సైలెంట్ గా కూర్చుని ఉంటారు. రుద్రాణి వెళ్లి మన ఇంటి వారసుణ్ని ఆ యామిని పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ కూర్చున్నారేంటి అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?