BigTV English

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిపై మౌనిక సీరియస్.. మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిపై మౌనిక సీరియస్.. మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode june 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి పార్లర్కి వెళ్లి శృతి గురించి విజ్జి తో చెబుతుంది. వాళ్ల అమ్మ వాళ్లు గ్రాండ్ గా చేస్తున్నారంటే కచ్చితంగా మీ నాన్నని తీసుకురమ్మని మీ అత్తగారు అడుగుతారని విజ్జి అంటుంది. అదే నా మెడ మీద వచ్చి కూర్చునింది నేను ఎటు పోలేని పరిస్థితి అయిపోయింది అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ గండం నుంచి బయటికి పడాలంటే ఫస్ట్ నాకు పుస్తెలతాడు కొనడానికి డబ్బులు కావాలి అని అడుగుతుంది. ఇప్పటికిప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని సుశీలమ్మకు ఫోన్ చేస్తుంది. కూతురు కోసం ఆమె తన బంగారాన్ని తాకట్టు పెట్టిస్తానని అంటుంది. రోహిణి కైతే వాళ్ళ అమ్మ వాళ్ళ డబ్బులు దొరుకుతాయి. రోహిణి కోసం ప్రభావతి పార్లర్కి వస్తుంది. జస్ట్ రోహిణి తప్పించుకుంటుంది.. సత్యం దగ్గరికి వెళ్లి మీరు ఇంకా ఇలాగే ఖాళీగా ఉన్నారేంటి సరుకులు తీసుకురమ్మ లిస్టు ఇచ్చాను కదా అని అడుగుతుంది. లిస్టు ఇచ్చావ్ సరే డబ్బులు ఎవరిస్తారు అని సత్యం అంటాడు. అదేంటి మీ ముద్దుల కొడుకుని అడిగి తీసుకొని వెళ్లి తీసుకొని రావచ్చు కదా అని అనగానే సత్యం ప్రభావతికి క్లాస్ పీకుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సత్యం ప్రభావతి మన ఇంటి ఆడపడుచు మౌనికని పిలవాలి కదండీ ఈ ఫంక్షన్ కి వాళ్ళని పిలవకుంటే ఏమైనా అనుకుంటారేమో మీరు మర్చిపోయారా అని అడుగుతుంది. నేనేమీ మర్చిపోలేదు నాకు గుర్తుంది. నేను రెడీ గానే ఉన్నాను పదవి వెళ్లి మాట్లాడేసి వద్దామని ఇద్దరు కలిసి వెళ్తారు. ప్రభావతి సత్యంని చూసిన నీలకంఠం ఎగతాళిగా మాట్లాడుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారు అని అడుగుతాడు. వదిన గారు ఎక్కడ అని ప్రభావతి అడుగుతుంది. అయితే నీలకంఠం ఆ తింగరి దాంతో వీళ్ళకి ఏం పని ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతుంది కదా అందుకే వీళ్లకు కావాలేమో అని వెటకారంగా మాట్లాడతాడు.

అలాగే నీలకంఠ మౌనికని పిలుస్తాడు. సంజయ్ మాత్రం మీ అమ్మాయి కోసం వచ్చారా మా అమ్మ కోసం వచ్చారా అని అడుగుతాడు.. మా ఇంట్లో రోహిణి, శృతి లకు పెళ్లి చాలా రోజులైంది కదా నల్లపూసల కార్యక్రమం చేస్తున్నాం మిమ్మల్ని పిలుద్దామని వచ్చామండి అని అంటుంది. మా ఇంటి ఆడపడుచు మౌనిక కదా మౌనికని తప్పనిసరిగా పిలవాలి అని వచ్చానని ప్రభావతి అనగానే.. సంజయ్ మీ కూతురు ఒక్కటే సరిపోతుందా అని అడుగుతాడు. ఆ లేచిపోయిన దానికోసం మేము రావాలా అన్నట్లు సంజయ్ మాట్లాడగానే సత్యం ప్రభావతి షాక్ అవుతారు..


తర్వాత మౌనిక వాళ్ళ అత్తింటి వాళ్ళు అమ్మ నాన్నని అవమానిస్తున్నారని గ్రహించి ముందుగానే మేము రాము అని చెప్పాను కదా.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. నేను రాకుంటే ఫంక్షన్ ఆగిపోతుందా ఏంటి అని మాట్లాడుతుంది. ప్రభావతి మౌనికకు ఎంత చెప్పాలని చూసినా కూడా మౌనిక మాట వినదు. ఇక సత్యం వెళ్ళిపోదాం పదండి గౌరవాన్ని తను కాపాడుతుంది అని అంటాడు..

బాలు మీనా కోసం ఏం తెచ్చినా కూడా ఎవరో ఒకరు తినేస్తున్నారని ఇవాళ కేవలం మల్లెపూలే తీసుకొని వస్తాడు.. అందరూ పడుకున్నారు కదా తెల్లారి వరకు ఇంకెవరు రారులే అని మల్లెపూలు మీ నాకు పెడతాడు. మీనాను దగ్గర తీసుకునే లోపల ప్రభావతి విజిల్ ఊదుతూ హాల్లోకి వచ్చేస్తుంది.. ఈ విజులావతికి నిద్ర రాదనుకుంటా వెనకాల గూడ్స్ బండిలాగా ఆ ఇద్దరిని కూడా తీసుకొని వస్తుంది అని బాలు అంటాడు. ఇక రేపు ఫంక్షన్ కదా పెద్దపెద్ద వాళ్లు వస్తారు కదా మంచి చీరలు సెలెక్ట్ చేసుకుని కట్టుకోవాలి అని ముగ్గురు కిందకు వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటారు.. ప్రభావతి మీనాను చీరలు విషయంలో దారుణంగా అవమానిస్తుంది.

ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకున్న పట్టు చీరలు మురికి పోతున్నాయి మరి ఏది ఉంటే అది కట్టుకో రావడానికి అని ఎగతాళి చేసి మాట్లాడుతుంది. మీనా మాత్రం తన భర్తను వెనకేసుకొస్తూ నాకు మా ఆయన తెచ్చిన చీరల్లోనే మంచి చీర కట్టుకుంటాను అని అంటుంది. ఇక ఆ తర్వాత శృతి మేన తలలో మల్లెపూలను చూసి బాలు మీనా కోసం వెయిట్ చేస్తున్నారు మనం ఇక్కడే ఉంటే మనల్ని కూడా బయటికి వస్తాడు అని అందర్నీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.

Also Read: షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన చిరంజీవి సినిమాలు.. కారణాలు తెలిస్తే మైండ్ బ్లాకే..

ఇక తర్వాత రోజు ఉదయం ప్రభావతి ఇంకా రెడీ అవ్వలేదా అని అందరినీ హడావిడి చేస్తుంది. బాలు మీనా కోసం కొత్త చీర తీసుకొచ్చి ఇస్తాడు. ఆ చీరను కట్టుకొని మీనా కిందకి రావడం చూసి మైమరిసిపోతాడు. ప్రభావతి చూసింది చాలు ఫంక్షన్ కి టైం అవుతుంది వెళ్దాం పదండి అని అందరూ ఫంక్షన్ హాల్ కి వెళ్తారు. వీళ్ళని చూసిన సురేంద్ర, శోభన పలకరిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రోహిణి పై ప్రభావతి సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee: ఫ్యామిలీలు చూస్తున్నారు? ఏంటా డ్యాన్సులు.. ఇద్దరు అమ్మాయిలు అలా?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Big Stories

×