Nirudyoga Bruthi Scheme 2025: ఏపీలో కూటమి సర్కార్ సంక్షేమంపై ఫోకస్ చేసింది. ఏడాదిపాటు పాలనను గాడిలో పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు ఒకొక్కటిగా అమలు చేయనుంది. తాజాగా మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నుంచి నిరుద్యోగుల భృతి పథకాన్ని అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి కీలకమైనవి సూపర్ సిక్స్ పథకాలు. ఏడాది గడిచిపోవడంతో ఒకొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళిక రెడీ చేసింది. ఈ ఏడాదిలో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం మచిలీపట్నం పర్యటనలో భాగంగా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ ఏడాదిలో నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని వెల్లడించారు. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం రెట్టింపు అయ్యింది. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు భృతిగా ప్రతీ నెల రూ.3 వేలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది.
ప్రతి నెలా 3 వేల చొప్పున ఏడాదికి 36 వేలు నిరుద్యోగుల అకౌంట్లలో వేయనుంది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయబోమని చెబుతూనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తామని చెప్పకనే చెప్పారు. అయితే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ALSO READ: టీటీడీ కీలక నిర్ణయం.. భారీగా తగ్గింపు, మీరు కూడా అప్లై చేయవచ్చు
నిరుద్యోగ భృతి పథకం ఇప్పటిది కాదు. 2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకొచ్చింది. అప్పట్లో కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలని నిబంధన పెట్టింది. అంతేకాదు తెల్ల కార్డు ఉండాలని, యువకుల వయస్సు 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు తప్పనిసరి చేసింది. కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని తెలిపింది.
గతంలో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగ భృతితో పాటు అదనంగా స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇప్పించారు. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. చివరకు ఆ సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇప్పుడు ఆ స్కీమ్‌ని ఇప్పుడు మళ్లీ ప్రవేశపెడుతోంది కూటమి సర్కార్.
అధికారంలోకి రాగానే ఉచితంగా గ్యాస్ సిలెండర్లు అందిస్తోంది. దీనికితోడు జూన్ 12న తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ఒకటి తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న ప్రతీ విద్యార్థికి 15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాలో వేసింది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుంది.
ఈ ఏడాది చివరకు నిరుద్యోగులకు భృతి ఇవ్వనుంది. కూటమి ప్లాన్ చూస్తుంటే రాబోయే రెండేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తే, మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే చర్చ మరోవైపు మొదలైంది.