Megastar Chiranjeevi: తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు మెగాస్టార్.. ఈయన ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ప్రత్యేక పాత్రలో నటిస్తూ హృదయాలను దోచుకున్నారు. ఆ తర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మెగాస్టార్ అయ్యారు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 155 సినిమాలను చేశారు. ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు.. అయితే ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాలు గురించి అందరికీ తెలుసు.. కానీ చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. అసలు సినిమాలు ఎందుకు ఆగిపోయాయన్న కారణాలు చాలా మందికి తెలియదు. మనం ఇప్పుడు ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన చిరు సినిమాలు..
మెగాస్టార్ చిరంజీవి విలన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో నటించిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి టాక్ ని సొంతం చేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ ఇమేజ్ ని అలానే కొనసాగిస్తూ కుర్ర హీరోలకు పోటీగా వరుసగా సినిమాలను అనౌన్స్ సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. అయితే చిరు కెరియర్ లో హిట్ సినిమాలు తో పాటు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని తాజాగా ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఆ సినిమాల విషయానికొస్తే.. సింగీతం శ్రీనివాసరావు రచించిన ఒక కథను చిరంజీవి చేయాల్సి ఉంది. భూలోకవీరుడు అనే టైటిల్ తో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది.. అబూ బాగ్దాద్ గజదొంగ అనే సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది.. అదే విధంగా కమర్షియల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా చేయాల్సి ఉండేది. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓసినిమా చేయాల్సి ఉండేది. కానీ డేట్స్ కుదరక ఆ మూవీ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక చివరిగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సిందే. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇలా చిరంజీవి హీరోగా ఫిక్సయిన ఐదు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి..
Also Read :Nayan నయన్ – శేఖర్ కమ్ముల మధ్య అంత పెద్ద గొడవ.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
విశ్వంభర అండ్ మెగా 157 మూవీస్ అప్డేట్స్..
మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.. 156వ సినిమాగా విశ్వంభర మూవీ తెరకెక్కుతుంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ తర్వాత మెగా 157 పేరుతో మరో మూవీని చిరంజీవి సెట్స్ మీదకి తీసుకెళ్లారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార చిరు సరసన జోడిగా నటిస్తుంది.