Poisonous Mushrooms| ఇటీవల మెఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో పుట్టగొడుగులు తినడం వల్ల వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ సంఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి. అక్కడి ప్రజలు అడవుల్లో సేకరించిన వైల్డ్ మష్రూమ్స్.. తమ రోజువారీ ఆహారంలో భాగంగా తింటారు. జిల్లా వైద్యాధికారి ప్రకారం.. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఈ విష ప్రభావానికి గురయ్యారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలంలో ఆ ప్రాంతంలో పుట్టగొడుగులు ఎక్కువగా పెరగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతాయి.
విషపూరిత పుట్టగొడుగులు తినడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇవి తినడానికి వీలైన పుట్టగొడుగుల్లానే కనిపిస్తాయి. కానీ చాలా మంది వీటి మధ్య తేడాను గుర్తించలేరు. స్థానిక మార్కెట్లలో కూడా విషపూరిత పుట్టగొడుగులు సాధారణ మష్రూమ్స్‌తో అమ్ముడవుతుంటాయి.
హానికర పుట్టగొడుగుల వల్ల ఆరోగ్యంపై ప్రభావాలు
విషపూరిత పుట్టగొడుగుల లక్షణాలు
వైద్యుల ప్రకారం.. విషం కలిగిన పుట్టగొడగులు తింటే ఆరోగ్యపై తొలిగా కలిగే దుష్ప్రభావాలు
అసౌకర్యం, వికారం
కడుపు నొప్పి
వాంతులు
నీళ్ల విరేచనాలు లేదా రక్తంతో కూడిన విరేచనాలు
కొన్ని సందర్భాల్లో భ్రాంతులు, ఆనంద భావం ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆసుపత్రికి వెళ్లండి లేదా వైద్యుడిని సంప్రదించండి.
చికిత్స ఎలా జరుగుతుంది?
విషపూరిత పుట్టగొడుగు రకాన్ని బట్టి చికిత్స మారుతుంది.
Also Read: ఖర్జూరాలు తింటున్నారా? చెక్ చేసి తినండి లేకుంటే.. డాక్టర్ల వార్నింగ్
పుట్టగొడుగు విషాన్ని ఎలా నివారించాలి?
వైద్యుల సూచనల ప్రకారం, ఈ జాగ్రత్తలు తీసుకోండి:
మీకు రకం తెలియని వైల్డ్ పుట్టగొడుగులను ఎప్పుడూ తినవద్దు.
అడవులు లేదా తెలియని ప్రాంతాల నుంచి పుట్టగొడుగులు సేకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
నమ్మదగిన, శుభ్రమైన దుకాణాల నుంచి మాత్రమే పుట్టగొడుగులు కొనండి.
పాడైన లేదా అపరిశుభ్రంగా ఉన్న పుట్టగొడుగులను తినవద్దు.
పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి, బాగా వండి తినండి.
విష లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
ఈ సులభమైన జాగ్రత్తలతో మీరు, మీ కుటుంబం విషపూరిత పుట్టగొడుగుల ప్రమాదం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి!