BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలును వెంటాడుతున్న ఇద్దరు..రోహిణి కి టెన్షన్.. సత్యంకు ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: బాలును వెంటాడుతున్న ఇద్దరు..రోహిణి కి టెన్షన్.. సత్యంకు ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode june 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ప్రభావతి మన ఇంటి ఆడపడుచు మౌనికని పిలవాలి కదండీ ఈ ఫంక్షన్ కి వాళ్ళని పిలవకుంటే ఏమైనా అనుకుంటారేమో మీరు మర్చిపోయారా అని అడుగుతుంది. నేనేమీ మర్చిపోలేదు నాకు గుర్తుంది.  నేను రెడీ గానే ఉన్నాను పదవి వెళ్లి మాట్లాడేసి వద్దామని ఇద్దరు కలిసి వెళ్తారు. ప్రభావతి సత్యంని చూసిన నీలకంఠం ఎగతాళిగా మాట్లాడుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారు అని అడుగుతాడు. వదిన గారు ఎక్కడ అని ప్రభావతి అడుగుతుంది. అయితే నీలకంఠం ఆ తింగరి దాంతో వీళ్ళకి ఏం పని ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతుంది కదా అందుకే వీళ్లకు కావాలేమో అని వెటకారంగా మాట్లాడతాడు. మా ఇంట్లో రోహిణి, శృతి లకు పెళ్లి చాలా రోజులైంది కదా నల్లపూసల కార్యక్రమం చేస్తున్నాం మిమ్మల్ని పిలుద్దామని వచ్చామండి అని అంటుంది. మా ఇంటి ఆడపడుచు మౌనిక కదా మౌనికని తప్పనిసరిగా పిలవాలి అని వచ్చానని ప్రభావతి అనగానే.. సంజయ్ మీ కూతురు ఒక్కటే సరిపోతుందా అని అడుగుతాడు. ఆ లేచిపోయిన దానికోసం మేము రావాలా అన్నట్లు సంజయ్ మాట్లాడగానే సత్యం ప్రభావతి షాక్ అవుతారు.. మౌనిక మాటలకు ప్రభావతి, సత్యం షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం ప్రభావతి ఇంకా రెడీ అవ్వలేదా అని అందరినీ హడావిడి చేస్తుంది. బాలు మీనా కోసం కొత్త చీర తీసుకొచ్చి ఇస్తాడు. ఆ చీరను కట్టుకొని మీనా కిందకి రావడం చూసి మైమరిసిపోతాడు. ప్రభావతి చూసింది చాలు ఫంక్షన్ కి టైం అవుతుంది వెళ్దాం పదండి అని అందరూ ఫంక్షన్ హాల్ కి వెళ్తారు. వీళ్ళని చూసిన సురేంద్ర, శోభన పలకరిస్తారు. సురేంద్ర మాత్రం సత్యం పై కోపంతోనే ఉంటాడు. శోభనం మాట ప్రకారం సత్యం ను బావగారు అని పిలుస్తాడు. అటు రోహిణిని అందరూ టార్గెట్ చేస్తారు. మీ నాన్న ఎప్పుడు వస్తారు అని అడగగానే రోహిణి ఫంక్షన్ హాల్ చూద్దాం వెళ్దాం పద అని లోపలికి వెళ్ళిపోతారు.

శృతి వాళ్ళ నాన్నతో సంతోషంగా మాట్లాడుతుంది. అందరూ కలిసి సంతోషంగా ఫంక్షన్ హాల్ లోకి వెళ్లి పోతారు. చివరిగా బాలు మౌనంగానే లోపలికి వెళ్ళిపోతాడు. ఈ బాలు గాడి వల్లే మన అమ్మాయి అల్లుడు మన ఇంటికి వచ్చేస్తారు అని శోభన సురేందర్ తో అంటుంది. ఏం చేస్తావో నాకు తెలియదు మన అమ్మాయి మన ఇంట్లోనే ఉండాలి అని సురేంద్ర కూడా అంటాడు. ఇక లోపలికి వెళ్ళగానే ఫంక్షన్ హాల్ చాలా బాగుంది అని రోహిణి అంటుంది.


మీ నాన్న కూడా వస్తే బాగుండు చాలా బాగుంది కదా అని మనోజ్ అంటాడు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యే లోపల మా నాన్న వచ్చేస్తాడు అని రోహిణి కవర్ చేస్తుంది. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు. రవి శృతి ఇద్దరూ ఫంక్షన్ హాల్ లో ఫోటోలు దిగుతుంటారు. శోభన అక్కడికి వచ్చి ఫంక్షన్ అయిన తర్వాత మీకు ఎంత సేపు కాబడితే అంత సేపు ఫోటోలు దిగొచ్చు ముందు వెళ్లి రెడీ అవ్వండి అని అంటుంది. రూమ్ చూపించండి అని అనగానే శోభన అమ్మాయిలకు అక్కడ రూములు ఉన్నాయి వెళ్లి రెడీ అవ్వు అని శృతి తో అంటుంది.

శృతి మాత్రం మీనాని చీర కట్టడానికి పిలుస్తుంది. మీనా అయితే పద్ధతిగా సింపుల్గా చీర కడుతుంది అని శృతి అంటుంది. కానీ శోభన మాత్రం మీనవద్దు నువ్వు వెళ్ళు అక్కడ నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నీ రూమ్ లో అని ఎంత చెప్పినా శృతి మాట వినదు. మరేం పర్లేదండి నేను కడతాను అని మీనా ఎంత చెప్తున్నా కూడా శోభన వినదు. బ్యూటిషన్స్ కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నారు నువ్వు వెళ్ళు అని శృతి తో అంటుంది. నువ్వు చీర కట్టడానికి పిలిపించిన మీ ఆయన మా ఆవిడకి అన్ని పనులు చెప్తారా అని మా మీద అరుస్తాడు అని శోభన అంటుంది.

ఇక మీనా బాలు దగ్గరికి వెళ్తుంది.. బాలు ఇంతసేపు ఎక్కడున్నారు అని అడుగుతుంది. బాలు మాత్రం లోపలికి వచ్చిన తర్వాత మౌనంగా ఉండాలని చెప్పడంతో అసలు మాట్లాడకుండా సైగల్ చేస్తూ ఉంటాడు. రవి కామాక్షి అటుగా వెళ్తూ గెస్ట్ లాగా లాస్ట్ లో కూర్చున్నారేంటి మన ఫ్యామిలీ అంతా ఫస్ట్ లో కూర్చోవాలి కదా అని అడుగుతాడు రవి. బాలు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా వాళ్లకి చేతులతోనే చెప్తాడు. అయితే రవి మాటలకు బాలు సమాధానం చెప్తూ ఉంటాడు. మీనని ఏమైందని అడుగుతారు. ఈ ఫంక్షన్ లో గొడవ జరుపుకున్న ఉండాలంటే బాలు మౌనంగా ఉండాలని అన్నాం కదా అందుకే ఇలా ఉన్నారు అని అంటుంది.

Also Read: వడ్డే నవీన్ భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? నమ్మడం కష్టమే..

కోపం తెప్పించితే కోపం వస్తుంది కదా.. అప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవడం అని రవి అడుగుతాడు. దానికి కామాక్షి నా దగ్గర కొన్ని కోడ్ పదాలు ఉన్నాయి. అవి పెట్టుకుందాం. నీకు కోపం వస్తే బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి కదా అని నేను అంటాను.. నువ్వు బంగాళదుంపలు బాగా తగ్గిపోయాయి కదా అని అంటే సరిపోతుంది అని అంటుంది. ఇక రోహిణి లేని నాన్న నువ్వు ఎక్కడ తీసుకొస్తామని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రభావతి మాత్రం రోహిణి కి నిమిషం కూడా సమయం ఇవ్వకుండా దబాయిస్తూ ఉంటుంది.. రోహిణికి ముందు చూస్తే నో ఈ వెనక చూస్తే గొయ్యిలాగా పరిస్థితి మారుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×