Tamilnadu News: దేవాలయాలు పవిత్రకు మారు పేరు. అలాంటి దేవాలయాలను అపవిత్రం చేస్తే ఇంకేమైనా ఉందా? పాలకుల మాటేమోగానీ, దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. అదే చేశారు ముగ్గురు పూజారులు. తమకు ఎదురులేదని భావించి ఫుల్‌గా మద్యం పుచ్చుకుని బావలు సైయ్యా అంటూ తమదైన శైలిలో డ్యాన్స్ చేశారు. అడ్డంగా బుక్కయ్యారు ఆ పూజారులు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.
దేవాలయాలకు వచ్చే భక్తులకు మంచి మాటలు చెబుతారు అక్కడి పూజారులు. అంతేకాదు మంచి మార్గంలో వెళ్తే జీవితం బాగుంటుందని అంటుంటారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ చాలా పద్ధతిగా వ్యవహరిస్తారు. తమిళనాడులోని ఓ ఆలయంలో పూజారులు చేసిన పని భక్తులు షాకయ్యారు. వీరు ఇంతకీ పూజారులేనా అంటూ మండిపడుతున్నారు భక్తులు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
తమిళనాడులోని శ్రీవిల్లీపుత్తూరు పెరియ మరియమ్మన్ ఆలయంలో ముగ్గురు పూజారులు గాడి తప్పారు. టీవీలో పాటలు పెట్టుకుని ఓ రేంజ్‌లో అశ్లీల నృత్యాలు చేశారు. సగం.. సగం బట్టలు ధరిస్తూ తమదైన శైలిలో రెచ్చిపోయారు. అంతేకాదు దర్శనానికి వచ్చిన భక్తులపై విబూది చల్లారు. ఆ తర్వాత వారిపై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. క్లిక్ వీడియోలు
పూజారుల వీడియో వ్యవహారం బయటకు రావడంతో ఇంటా బయటా రచ్చ అయ్యింది. చివరకు ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. ముగ్గురు పూజారులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న వీడియోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని సస్పెండ్ చేయడమే కాకుండా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: రెండు వేలకే శోభనం లైవ్.. హైదరాబాద్ లో కంత్రి కపుల్స్
తమిళనాడులోని శ్రీవిల్లీపుత్తూరు పెరియ మరియమ్మన్ ఆలయంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పవిత్రోత్సవాలు జరగనున్నాయి. జూలై 2న ఆ కార్యక్రమం జరగాల్సివుంది. కార్యక్రమం నేపథ్యంలో పూజారికి సహాయంగా మరికొందరు వివిధ ప్రాంతాల నుంచి పూజారులు అక్కడికి వచ్చారు.
వారిలో గోమతి వినాయగం ఇంట్లోనే టీవీ పాటలు పెట్టారు. గోమతితోపాటు వినోద్, గణేషన్ అసభ్యకరంగా డ్యాన్స్ చేసిన వీడియోలు బయటపడ్డాయి. కావాలనే ఎవరో చేశారని అంటున్నారు. న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు పూజారులపై కేసులు నమోదు చేశారు.
మహిళలను కించపరచడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించడం వంటి కారణాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూజారులు డ్యాన్స్ దృశ్యాలను ఆలయ మాజీ పూజారి హరిహరన్ కుమారుడు శబరి నాథన్ వీడియో తీసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ట్రస్టుకు, ఆలయ నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ఇందులో తమను కావాలనే ఇరికించారని అంటున్నారు.