E-Paper
Advertisement

OTT Movie : ఆన్సర్ షీట్ పై పెన్ పెడితే చేతులు నరికేసే దెయ్యం… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఆన్సర్ షీట్ పై పెన్ పెడితే చేతులు నరికేసే దెయ్యం… చిన్న పిల్లలు చూడకూడని మూవీ
Advertisement

OTT Movie : థాయ్ లాండ్ మస్సాజ్ లకే కాదు, హారర్ సినిమాలకు కూడా ఫేమస్. ఓటీటీలో ఒక థాయ్ హారర్ థ్రిల్లర్ మూవీ అదరగొడుతోంది. ఈ మూవీ ఒక స్కూల్ లో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ తో ఈ హారర్ సినిమా ఉత్కంఠంగా సాగుతుంది. ఇందులో హింస ఎక్కువగానే ఉంటుంది. చిన్నపిల్లలు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ థాయ్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ఎంప్టీ చైర్ : ఫైనల్ ఎగ్జామ్’ (The Empty Chair: Final Exam). 2023 లో విడుదలైన ఈ సినిమాకి లాకోండే దర్శకత్వం వహించారు. ఇందులో సువంది, టెడ్డీ స్యాహ్, లానియా ఫిరా, మైషా కన్నా, ఎమిలియానో ఫెర్నాండో కోర్టిజో, డిండా మహిరా, ఎమిర్ రజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం స్టార్‌విజన్ ప్లస్, మూవీస్టా పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. ఇది ఒక హైస్కూల్‌లో జరిగే సూపర్‌న్యాచురల్ హారర్ సంఘటనలను చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

థాయ్ లాండ్ లో ఒక పేరున్న హైస్కూల్‌లో ఫైనల్ పరీక్షల సమయం వస్తుంది.  విద్యార్థులు ఈ ఫైనల్ పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఆరోజు పరీక్ష రాసేటప్పుడు, స్కూల్ లో ఊహించని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. పరీక్ష హాల్‌లో ఒక విద్యార్థికి అకస్మాత్తుగా దెయ్యం ఆవహిస్తుంది. ఇది ఒక భయంకరమైన శక్తిలా అనిపిస్తుంది. ఈ దెయ్యం శక్తి విద్యార్థులను ఒక్కొక్కరినీ ఆవహించి, వారిని ఒకరినొకరు హింసించుకొనేలా చేస్తుంది. ఎవరైనా పరీక్షలు రాస్తే చేతులు నరికేస్తుంది. దీనివల్ల అక్కడ రక్తపాతం, భీభత్సమైన మరణాలు సంభవిస్తాయి.

ఈ సినిమా మొదటి 30 నిమిషాలు అత్యంత భయంకరమైన సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఈ సన్నివేశాలు స్లాషర్ హారర్ అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్క విద్యార్థి ఈ దెయ్యం శక్తి బారిన పడుతూ, స్కూల్ ఒక భయంకరమైన యుద్ధభూమిగా మారుతుంది. కథలో ప్రధాన పాత్రలైన అమండా కర్తనేగారా, అబాహ్ ఆయుబ్, నకిలా ఈ భయంకర శక్తిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ శక్తి ఎందుకు ఇలా చేస్తుందనేది, స్టోరీ ముందుకు వెళ్ళేకొద్ది బయటపడుతుంది. ఇతకీ ఆ దెయ్యం గతం ఏమిటి ? ఎందుకు స్కూల్ పిల్లలను టార్గెట్ చేస్తోంది ? దానిని ఎవరైనా అడ్డుకుంటారా ? ఈ స్టోరీ ఎలా ఎండ్  అవుతుంది ? అనే విషయాలను, ఈ థాయ్ హారర్-థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అనుమానంతో భార్య మర్డర్ కు మాస్టర్ ప్లాన్… ఆ ఒక్క పొరపాటుతో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×