E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపు మంట.. విద్యకు వార్నింగ్ ఇచ్చిన రోహిణి.. మీనా ప్లాన్ సక్సెస్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపు మంట.. విద్యకు వార్నింగ్ ఇచ్చిన రోహిణి.. మీనా ప్లాన్ సక్సెస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 6th: బాలు మీనా లోపలికి వెళ్ళగానే ఆ కవర్లో ఉన్న ఫోన్ ని చూసి ఇది నాదే మీనా అని అంటాడు. ఫంక్షన్ లో పోయిన ఫోను తాతయ్య వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందండి.. తాత దగ్గరికి పోనీ ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఎవరు ఈ ఫోను తీసారు అన్నది బాగా తెలిసిపోతుంది అని బాలు అంటాడు. మనోజ్ రోహిణి వాళ్ళ ఫంక్షన్ కి మనం వెళ్ళాం కదా ఖచ్చితంగా వాళ్ళ ఈ ఫోన్ ని కొట్టేసి దున్నకి ఇచ్చి ఉంటారు అని బాలుకి అనుమానం మొదలవుతుంది.. ఒకవేళ రోహిణినే కనక ఇది తీసింది అని కన్ఫామ్ అయిపోతే మాత్రం ఇక తర్వాత ఆమె సంగతి ఏంటో నేను తేలుస్తాను అని బాలు అంటాడు. ఈ విషయాన్ని కిందికి వెళ్లి సత్యంతో చెప్పగానే మనోజ్ పైన 30 లక్షలు తప్ప అందరివి దొరికేస్తున్నాయని ప్రభావతి అంటుంది. ఫోన్ దొరికింది అని తెలుసుకున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నాకు విద్య అబద్ధం చెప్పిందా అని అనుకుంటుంది..

రోహిణికి దిమ్మతిరిగే షాక్..

విద్య నాకు ఎందుకు అబద్దం చెప్పిందో తేల్చుకుంటాను అని రోహిణి విద్య దగ్గరికి వెళ్తుంది.. రావే కరెక్ట్ గా భోజనం టయానికి వచ్చావు.. నువ్వు వస్తున్నావ్ అని ఒక మాట ఫోన్ చేస్తే నీకు కూడా భోజనం చేసేదాన్ని కదా అని విద్య అంటుంది.. కానీ రోహిణి మాత్రం నీ భోజనాని కోసం ఎవరు ఇక్కడికి రాలేదు నువ్వు నాకు ఎందుకు అబద్దం చెప్పావు అని అడుగుతుంది.. ఏంటి ఏం అబద్ధం చెప్పాను అని రోహిణి తో విద్య సీరియస్గా అడుగుతుంది. ఏం లేదు నువ్వు బాలు ఫోన్ ఎక్కడ పడేసావ్? చెరువులో పడేసావ్ అని చెప్పావు కదా.. మళ్లీ ఆ ఫోను బాలు దగ్గరికి ఎలా వచ్చింది విద్య రోహిణి అడుగుతుంది. ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

నా ఇంట్లో నుంచి వెళ్ళిపో..

Advertisement

ఫ్రెండు ఎప్పుడూ మంచి కోరే దాని లాగా ఉండాలి కానీ.. నా గురించి అన్ని విషయాలు నీకు తెలుసు అయినా కూడా నువ్వు ఇలా నన్ను ఇరికించేలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని రోహిణి అంటుంది. మంచి ఫ్రెండ్షిప్ ఉంది కానీ నువ్వు నన్ను ఇలా నీ అబద్ధాలని దాచడానికి వాడుకుంటావని అస్సలు ఊహించలేదు అని విద్య అంటుంది.. నా పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు.. కానీ నువ్వు ఇలా మాట్లాడతావా నిన్ను అసలు ఊహించలేదు.. నువ్వు ఇలా మారిపోతావని నేను అసలు ఊహించలేదు.. అవునే నిన్ను చూస్తే నేను మారాల్సి వచ్చింది.. కాపురం లోకి నన్ను కూడా లాగావు. ఇంకెప్పుడు నా ఇంట్లోకి రావద్దు ముందు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని విద్య అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. సరే ఇంకెప్పుడూ నీ ఇంట్లో అడుగు కూడా పెట్టను అని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…

హమ్మయ్య.. విద్య లవ్ లో పడింది..

విద్య ఆఫీస్ కి వెళ్తూ ఉండగా మనోహర్ బయట చూసి చూడనట్లుగా దాక్కుంటూ ఉంటాడు.. గమనించిన విద్య నేను చూశాను బయటికి రావచ్చు అని అంటుంది.. ఇలా వెళ్తుండగా మీ ఇండ్లు కనిపించింది ఇలా వచ్చాను అని అతను అనగానే ఏంటి ఇలా వచ్చారా అని విద్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.. మనోహర్ ఏమి చెప్పలేక మౌనంగా తడబడి పోతూ ఉంటాడు.. విద్య లోపలికి రమ్మని చెప్తుంది. ఇష్టమైన వాళ్లకోసం కష్టమైన పర్వాలేదు కానీ ఎంత దూరమైనా రావచ్చు అని అతను ఇండైరెక్టుగా విద్యను లవ్ చేస్తున్న విషయాన్ని చెప్తాడు.. కానీ విద్య మాత్రం అతనికి తెలియకుండానే అతన్ని కూడా లవ్ చేస్తూ ఉంటుంది.. మొత్తానికి విద్య లవ్ ట్రాక్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని తెలుస్తుంది.

మీనా ప్లాన్ సక్సెస్..

Advertisement

విద్య మనోహర్ని బయటికి పంపించిన వెంటనే మీనా రావడంతో ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నావు అని అడుగుతుంది. ఇందాకే నేను తలచుకున్నాను మీనా.. అప్పుడే నువ్వు వచ్చేసావు అని అనగానే అదేంటి నన్ను తలుచుకోవడం ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమీ లేదు నా వెంట ఒకడు పడుతున్నాడు వాడి గురించి నీకు చెప్పాలని అనుకున్నాను అని విద్య అంటుంది.. అవునా ఎవరు వాడు ఎక్కడున్నాడు అని మీనా అడుగుతుంది. అయితే అతను వెళ్ళిపోయాడు అని విద్యా సిగ్గుపడుతూ చెప్పడంతో మీనా నువ్వేంటి ఎప్పుడు లేనిది ఇంతగా సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతున్నావు అని అడుగుతుంది.. ఏంటి నేను సిగ్గు పడుతున్నానా మెలికలు తిరుగుతున్నానా ఆపు మీనా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని విద్య అంటుంది.. కావాలంటే నీకు ఫోటో తీసి చూపిస్తాను అని మీనా వచ్చిన పనిని మొదలు పెడుతుంది.. ఫోటో తీసి చూపించి నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి వచ్చేస్తుంది.. మీనా బాలుల ప్లాన్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీని ఫాలో అయిన మహా.. డ్రైవర్ ను చితక్కొట్టిన నారాయణ.. అబ్బా.. చక్రీ హ్యాపీ..

Related News

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Big Stories

Advertisement
×