E-Paper
Advertisement

మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం
Advertisement

Liquor Truck: రోడ్డుపై వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడితే సాధారణంగా ఏం జరుగుతుంది? జనాలు పరుగు పరుగున వచ్చి లోపల ఉన్న డ్రైవర్‌ను క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఆ లారీలో ఉన్నది ‘మద్యం’ బాటిళ్లు అయితే మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది.

బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న ఒక వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. లారీ పడటమే ఆలస్యం.. లోపల ఉన్న వందల కొద్దీ మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు, ఆ దారిలో వెళ్తున్న వాహనదారులకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. అంతే.. క్షణాల వ్యవధిలో అక్కడ జాతర మొదలైపోయింది.

Advertisement

డ్రైవర్‌ పరిస్థితి ఏంటని అడిగే నాథుడే కరువయ్యాడు. ఎవరికి దొరికినన్ని బాటిళ్లను వాళ్లు ఎత్తుకెళ్లడం మొదలుపెట్టారు. కొందరైతే ఏకంగా చేతికి దొరికిన బాక్సులను పట్టుకుని పరుగు తీశారు. మరికొందరు తమ లుంగీలు, టవళ్లలోనే బాటిళ్లను మూటగట్టుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ తోపులాటలో పురుషులతో పోటీ పడుతూ కొందరు మహిళలు సైతం మద్యం సీసాల కోసం ఎగబడటం అక్కడున్న వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది.

చివరికి ఈ ‘మద్యం దోపిడీ’ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. లాఠీలకు పనిచెప్పి జనాలను చెదరగొట్టడంతో గొడవ సర్దుమణిగింది. అప్పటికే సగానికి పైగా స్టాక్ మాయమవగా.. మిగిలిన కొన్ని సీసాలను పోలీసులు ఎలాగోలా భద్రపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన కామెంట్స్.. ‘గాలి మోటార్’ అస్త్రంతో స్ట్రాంగ్ కౌంటర్!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×