E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చితక్కొట్టిన మీనా.. షాక్ లో ప్రభావతి, రోహిణి.. శోభాకు దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చితక్కొట్టిన మీనా.. షాక్ లో ప్రభావతి, రోహిణి.. శోభాకు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా ఇంటికి వస్తారు.. ప్రభావతి బాలుని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. ఈయన మాత్రం దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. వీడికి జైలుకెళ్లడం కొత్తవి కాదు కదా అని ప్రభావతి అంటుంది. ఎంత చెబుతున్న సరే ప్రభావతి మాత్రం తన అనుకున్నవి చెప్పేసి వెళ్తుంది. అయితే అక్కడికొచ్చిన రోహిణి మనోజ్ లు కూడా ప్రభావతికి తోడుగా రావడంతో ఇంకాస్త రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఆయన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. జైలుకెళ్ళి మోసం చేసి డ్రామాలాడుతున్నారు అని ప్రభావతి అనగానే మీనా రెచ్చిపోతుంది.

డ్రామా అంటే ఏంటి అత్తయ్య అనేసి అడుగుతుంది. మీరు మీ అబ్బాయికి సపోర్ట్ చేయడం 40 లక్షలు ఎత్తుకుపోయిన సరే ఏమి మాట్లాడుకుందాం ఉండడం డ్రామానా.. ఇంట్లో ఉన్నవి మింగేయడంతో పాటుగా ఇంటినే మింగాలనుకున్న మీ కోడలు ఆడేది డ్రామా నా. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఏమి తెలియని వాళ్ళ లాగా ఉండడం అది డ్రామా నా ఏం మాట్లాడుతున్నారు ఏమి డ్రామాలాడం మా పుట్టింటి వాళ్ల గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది మీనా.. మనోజ్ కోసం ప్రభావతి చికెన్ సూప్ చెయ్యమని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా వాళ్ళ అత్త చేసిన ఘనకార్యం గురించి తన స్నేహితులతో చెప్పి బాధపడిపోతుంది. జలుబు చేయడంతో మీనా ఇంటికి వస్తానే చికెన్ తీసుకొచ్చి సూప్చేయమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది.. అది విన్న మీనా నేనెందుకు చేయాలి వాళ్ళ ఆవిడని చేయమని చెప్పు అనేసి వాళ్ళిద్దరికీ చుక్కలు చూపిస్తుంది. మీనా ఎంతగా అంటున్న సరే వాళ్ళిద్దరు మాత్రం మీనాని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. దాంతో మీనా వెళ్లి బెల్ట్ తీసుకుని వచ్చి మనోజ్ కి వాతలు పెడుతుంది.. మనోజ్ ని కొట్టడం చూసిన ప్రభావతి మీనాకు ఏమైంది అని భయపడిపోతూ ఉంటుంది.. ఇంటికి వచ్చిన రోహిణి కూడా ఏమైంది అని అడుగుతుండగా ఎక్కడికి వెళ్లావే నీ మొగుడికి నేనెందుకు చేసి పెట్టాలి అంటూ మీనా కొడుతుంది..

మీ ఇద్దరిని కాదు ఆ ముసలి తయతక్కలాడే ముసలి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని ప్రభావతిని కొట్టబోతుంది.. అది ఒక్కసారిగా నోరు తెరిచి కేకలు వేయడంతో మీనా కళ్ళు తెరిచి తను కలగన్నట్లు ఊహించుకుంటుంది.. ఆ తర్వాత ఏంటే చెప్తుంటే వినకుండా ఏం చేస్తున్నావు అని ప్రభావతి అంటుంటే మీనా ఒక్కసారిగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అసలు మీనా ఎందుకు ఇలా నవ్వుతుంది అని వాళ్ళందరూ కూడా తలలు పట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు కి ప్రభావతి మీ ఆవిడకి నేనంటే అంత అలసిపోయినా పొగరు ఏంటి అనేసి అరుస్తుంది.. ఒకటే పకపక నవ్వుతుంది అని చెప్పగానే బాలు మీనా అని పిలుస్తాడు..

Advertisement

అక్కడికి వచ్చిన మీనా వాళ్ళని చూసి తెగ నవ్వుకుంటుంది. ఏంటి మీనా నువ్వు ఇంతగా నవ్వుతున్నావ్ నువ్వు నవ్వితే చాలా బాగున్నావ్ తెలుసా? అని బాలు మీనాని పొగడ్తలతో ముంచేస్తాడు. అసలు ఎందుకు నవ్వుతున్నావ్ చెప్పు అని బాలు ఎంతగా అడిగినా సరే మీనా మాత్రం నవ్వుతూనే ఉంటుంది. కానీ చివరికి మనోజ్ ని కొట్టినట్లు ఊహించుకున్నట్లు బాలుతో చెప్పగానే బాలు కూడా ఒక్కసారిగా నవ్వుతాడు. వీళ్లిద్దరు నవ్వడం చూసిన మిగిలిన ముగ్గురు షాక్ అయిపోతారు.. ఇక తర్వాత నా కొడుకు కోడలు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే ఏదో జరిగింది ఎందుకబ్బా వీళ్ళు ఇంతగా నవ్వుతున్నారు అని ఆలోచిస్తూ వస్తాడు సత్యం. ఏంటండీ వీళ్లిద్దరూ అని ప్రభావతి వచ్చి రాకతలికి వాళ్ల మీద చాడీలు చెప్పేస్తుంది.. ఎందుకు నవ్వుతున్నారు తెలియదు కానీ వాళ్ళు చాలా నవ్వుతున్నారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని సత్యం అంటాడు.

శృతి ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు అని శోభా సురేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి ఎదో పెద్ద గొడవ జరగడంతోనే బ్యాగ్ సర్దుకొని వచ్చేసిందని అనుకుంటున్నాను. అల్లుడుగారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దర్నీ ఇక్కడే ఉండేలా ప్లాన్ చేద్దామని శోభా సురేంద్ర ఇద్దరూ అనుకుంటారు. అప్పుడే అక్కడికి రవి వచ్చి శృతి తో మాట్లాడాలి అని లోపలికి వెళ్తాడు. శృతి మొదట ఎంతగా రవితో మాట్లాడకుండా ఉండాలని అనుకుంటుంది..ఇక సారీ చెప్పి డైమండ్ రింగ్ ఇవ్వడంతో శృతి కూల్ అవడంతో పాటుగా మా ఇంటికి వెళ్ళిపోతున్నామని వచ్చేస్తారు..

Also Read :గాయత్రికి దిమ్మతిరిగే షాక్.. రచ్చ చేసిన చక్రీ, కేశవ.. నలుగురిని అరెస్టుచేసిన పోలీసులు..

మనోజ్ రోహిణి ఇద్దరు షాప్ కి వెళ్తారు కానీ విద్య ఫోన్ చేయడంతో రోహిణి బయటకు వచ్చి మాట్లాడుతుంది.. ఆ వీడియోని కొట్టేస్తేనే బాలు మీనాలా పని పట్టొచ్చు లేదంటే మాత్రం నా పరిస్థితి దారుణంగా మారుతుంది అని రోహిణి అంటుంది.. అయితే ముందు ఆ వీడియోని కొట్టేయాలంటే రాత్రి మాత్రమే సాధ్యమవుతుంది అప్పుడే నేను దాని కొట్టేయగలను అని రోహిణి అనుకుంటుంది. ఇక రాత్రి అవ్వగానే మీనా అందరికీ భోజనం వడ్డిస్తుంది అక్కడ కూడా రోహిణి మనోజ్ ని టార్గెట్ చేసి దారుణంగా తిడుతుంది.. వీళ్ళందరూ భోజనం చేసిన తర్వాత రవి శృతి ఇంటికి రాగానే ప్రభావతి మళ్లీ క్లాస్ పీకుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×