E-Paper
Advertisement

Podarillu Today Episode : గాయత్రికి దిమ్మతిరిగే షాక్.. రచ్చ చేసిన చక్రీ, కేశవ.. నలుగురిని అరెస్టుచేసిన పోలీసులు..

Podarillu Today Episode : గాయత్రికి దిమ్మతిరిగే షాక్.. రచ్చ చేసిన చక్రీ, కేశవ.. నలుగురిని అరెస్టుచేసిన పోలీసులు..
Advertisement

Podarillu Today Episode March 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. శైలు ఎలాగైనా సరే ఆ కేశవ దగ్గర నుంచి ఫోన్ తీసుకోవాలని అనుకుంటుంది.. తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో కనుక్కోమని చెప్తుంది.. నా దగ్గర డబ్బులు లేవు కానీ ట్రై చేస్తాను అని తన ఫ్రెండ్ చెప్తుంది. అయితే ఫోన్ ఎలాగైనా తీసుకోవాలి అని మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చి ఏంటే ఫోన్ తీసుకోవాలంటున్నావ్. ఫోన్ ఎక్కడైనా తాకట్టు పెట్టావా అని అడుగుతుంది. మరి ఎక్కడైనా పోగొట్టేసావా ఏంటి అని కంగారుగా అడుగుతుంది. అయ్యో లేదమ్మా నా ఫోన్ ఉంది కాకపోతే దానికి చార్జింగ్ పిన్ పనిచేయట్లేదు అని ఏదో ఒక అబద్ధం చెప్పేస్తుంది శైలు.. అప్పుడే అక్కడికి వచ్చిన తన అన్నయ్య సర్వీస్ కి ఇవ్వడానికి రేపు వెళ్దాము అని అంటుందమ్మా అదేనేమో అని అనగానే ఏదో ఒకటి చావు ముందు ఆ రీల్స్ చేయడం ఆపేసి చదువు మీద దృష్టి పెట్టు అనేసి అంటుంది..

మహాలక్ష్మి మాధవ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన గాయత్రి మాధవ్ ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది.. ఏమైంది గాయత్రీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నాకు ఇంట్లో పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు బావ. నాకు ఇష్టం లేదు బావ నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మాధవ్ నీ కొట్టడం తప్పే అని మహా చక్రికి చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మాధవ్ ను పురుషోత్తం కొట్టిన విషయాన్ని మహా చక్రికీ ఫోన్ చేసి అర్జెంటుగా మీరు ఇంటికి రావాలి అని కంగారు పడిపోతూ చెప్తుంది.. అయితే ఏమైంది అని చక్రి అడగ్గా మాధవ్ ని గాయత్రి వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేసి కొట్టారు అని చెప్తుంది ఆ మాట వినగానే నేను ఇప్పుడే వస్తున్నానని చక్రి అంటాడు.. చక్రి కేశవ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తాడు.. ఇక కేశవా చక్రి ఇద్దరు కూడా ఇంటికి రాగానే.. మాధవ్ ఏం కాలేదు రాని ఎంత చెప్తున్నా సరే.. వాడిని ఈరోజు చంపేస్తాను అని కేశవ సీరియస్ అవుతాడు.. ఇక తర్వాత గాయత్రి నీ ఇంటికి తీసుకువెళ్లిన పురుషోత్తం ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాడు. నువ్వు ఏం పెద్దమనిషి అయ్యా అని రమణయ్య ను తిడతాడు.. ఆడదానివి ఆడది బయటికి వెళుతుందంటే చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అంటూ తాయారు పై రెచ్చిపోతాడు..

నువ్వు నా కూతురువి చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది.. ఇక నీకు ఏ ఛాన్స్ లేదు ఇప్పుడు నేను తెచ్చిన సంబంధాన్ని చచ్చినట్టు నువ్వు చేసుకోవాల్సింది అని పురుషోత్తమంటాడు. తాయరు నువ్వు రెడీ చేసి పెళ్లి వాళ్ళు ముందు నీ కూతుర్ని కూర్చో పెడతావో లేదో? అది నీ ఇష్టం లేదంటే మాత్రం నేను జైలుకు వెళ్తాను అర్థం అవుతుందా అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు పురుషోత్తం.. ఇక తర్వాత గాయత్రి నేను రెడీ అవమని తాయారు చెప్తుంది. ఇక అప్పుడే చక్రి మాధవ్ కేశవ ముగ్గురు కూడా తాయారు ఇంటికి కోపంగా వస్తారు.. పురుషోత్తం ని బయటికి పిలిచి మరి చక్రి కేశవ ఇద్దరు కలిసి కొడతారు. ఇంటిదగ్గర పెద్ద రచ్చ జరుగుతుంది. మాధవ్ ఎంతగా ఆపుతున్న సరే పురుషోత్తం మాత్రం ఇద్దరు తమ్ముళ్లు దారుణంగా కొట్టేస్తారు.. మా అన్నయ్య జోలికొస్తే అస్సలు ఊరుకోము అని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు..

Advertisement

నారాయణకు కన్నాకు ఈ విషయం చెప్పగానే ఆవేశంతో నారాయణ బయటికి వెళ్తాడు అప్పుడే ముగ్గురు కూడా లోపలికి రావడంతో ఏంట్రా వాళ్ళు చేయొ, కాలో తీసుకొని వస్తారు. అనుకుంటే ఇలా వచ్చేసారు అని నారాయణ సీరియస్ అవుతాడు.. వీళ్లంటే ఆవేశపడ్డారు నాన్న వారిని కొట్టారు. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి చేయకుండా అసలు ఊరుకోరు కదా అని మాధవ్ అంటాడు.. వాళ్లు ఇన్నేళ్లు ఎన్ని చేసినా ఊరుకున్నాము.. ఇకమీదట ఊరుకునేదే లేదు అని అనగానే అప్పుడే పోలీసులతో పురుషోత్తం రమణయ్య వస్తారు.. ఈ కుటుంబమే సార్ ఈన్లే వీళ్ళ వల్లే మాకు ప్రమాదం ఉంది అని పురుషోత్తం పోలీసులతో అంటాడు. మొత్తానికి మహా ఎంత చెప్తున్న సరే పోలీసులు మాత్రం కన్నా అని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు.. ఆ నలుగురు నీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలని నారాయణ వాళ్ళ ఇంటి మీదకి గొడవకు వెళ్తాడు.

Also Read :హమ్మయ్య.. ధీరజ్ ప్రేమను చెప్పేశాడు.. శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. అదిరిపోయే ట్విస్ట్..

మహా కూడా అక్కడికి వెళుతుంది మీరు ఇక్కడ గొడవ చేస్తే ఇంకా వాళ్ళు పోలీసులను రెచ్చగొడతారు వాళ్ళు మన వాళ్ళని బయటకు రానివ్వకుండా చేస్తారు అని మహా అంటుంది.. ఇక మహా గాయత్రీ ని చూసి నువ్వు నిజం చెప్పు లేదంటే మాత్రం అందరిని జైలుకు పంపిస్తారు అని మహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత మాధవ్ ఎస్ ఐ తో మాట్లాడాలని అనుకుంటాడు.. ఎంత చెప్పినా సరే అతను మాత్రం వినడు అప్పుడే అక్కడికి వచ్చిన మహా పోలీసులతో మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×