E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రవి పై ప్రభావతి సీరియస్.. బాలు పాలల్లో నిద్ర మాత్రలు కలిపిన రోహిణి..దొరికిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రవి పై ప్రభావతి సీరియస్.. బాలు పాలల్లో నిద్ర మాత్రలు కలిపిన రోహిణి..దొరికిపోతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా వాళ్ళ అత్త చేసిన ఘనకార్యం గురించి తన స్నేహితులతో చెప్పి బాధపడిపోతుంది. జలుబు చేయడంతో మీనా ఇంటికి వస్తానే చికెన్ తీసుకొచ్చి సూప్చేయమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది.. అది విన్న మీనా నేనెందుకు చేయాలి వాళ్ళ ఆవిడని చేయమని చెప్పు అనేసి వాళ్ళిద్దరికీ చుక్కలు చూపిస్తుంది. మీనా ఎంతగా అంటున్న సరే వాళ్ళిద్దరు మాత్రం మీనాని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. దాంతో మీనా వెళ్లి బెల్ట్ తీసుకుని వచ్చి మనోజ్ కి వాతలు పెడుతుంది.. మనోజ్ ని కొట్టడం చూసిన ప్రభావతి మీనాకు ఏమైంది అని భయపడిపోతూ ఉంటుంది.. ఇంటికి వచ్చిన రోహిణి కూడా ఏమైంది అని అడుగుతుండగా ఎక్కడికి వెళ్లావే నీ మొగుడికి నేనెందుకు చేసి పెట్టాలి అంటూ మీనా కొడుతుంది..

మీనా మనోజ్ ని రోహిణి ప్రభావతిని కొట్టినట్లు కలగంటుంది అది తలుచుకొని బాగా నవ్వుకుంటుంది.. బాలు కూడా ఆ విషయం తెలుసుకొని బాగా నవ్వుకుంటాడు.. అందరూ నవ్వుకోవడం చూసినా సత్యం చాలా సంతోషంగా ఉన్నారు అని ఆలోచిస్తాడు. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా మీనా మనోజ్ పై కౌంటర్ వేస్తుంది. సత్యం మాత్రం రివర్స్ కౌంటర్లు ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శృతి రవి అప్పుడే ఇంటికి రావడం చూసిన ప్రభావతి ఏంటి మీరిద్దరు అప్పుడే వచ్చేసారు అని అడుగుతుంది.. అయితే రవి వచ్చాడు ఫీలయ్యాడు సారీ చెప్పాడు అందుకే వచ్చేసాను అని శృతి చాలా సింపుల్ గా చెప్తుంది. ఏంట్రా నువ్వు ఇలా చేశావు అని రవిని ప్రభావతి అడుగుతుంది. కానీ ప్రభావతి మాత్రం శృతి దగ్గరికి వెళ్లి రవి అలా చేయడంతో సీరియస్ అవుతుంది.. ఇక శృతి ఉండకుండా నాకు డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అది చూసిన బాలు నువ్వు రింగ్ ఇచ్చావు. ఇకమీదట నుంచి ఆడవాళ్ళందరూ అలాంటి వస్తువులే కావాలని అడుగుతారో ఏమో.. అని అనగానే నాకు పుస్తెలతాడికే గతి లేదు అలాంటివి అడుగుతానా నాకు అంత ఆశ లేదు లేండి అని మీనా అంటుంది.

కానీ రోహిణి మాత్రం ఏరోజైనా అలా గిఫ్ట్ లు ఇచ్చావ్ అని మనోజ్ ని అడగ్గానే.. అయితే మన మధ్య అలాంటి గొడవలు ఏమి జరగలేదు కదా అని రోహిణి అంటుంది.. ఇక రవి ఇలా చేయడం తప్పు అని ప్రభావతి పక్కకు తీసుకొని వెళ్లి బాగా క్లాస్ పీకుతుంది. కానీ ప్రభావతి మాత్రం నువ్వు ఇలా చేస్తే చులకన అయిపోతావ్ రా అనేసి తిడుతుంది. చెప్పినప్పుడు నేను అలానే అనుకున్నాను అమ్మ ఆ తర్వాత వదిన ఫోన్ చేసి నాకు చెప్పడంతో నేను వెళ్లి శృతిని తీసుకొని వచ్చాను అని అంటాడు. ఆ తర్వాత నేనంటే నీకు అస్సలు గౌరవమే లేదు మీ వదిన చెప్పగానే చేసావా అని ప్రభావతి రవిని తిడుతుంది కానీ రవి మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

బాలు దగ్గర నుంచి ఆ వీడియోని ఎలాగైనా సరే ఈరోజు కొట్టేయాలి అని ప్లాన్ చేస్తుంది రోహిణి. బాలు తాగే పాలలో ఎలాగైనా సరే నిద్ర మాత్రలు కలిపి అతని డైవర్ట్ చేసి ఆ వీడియోని కొట్టేయాలి అని అనుకుంటుంది.. మీనని ఏదో ఒకటి చెప్పి మాయ చేసి పక్కకు పంపిస్తుంది ఆ పాలల్లో నిద్ర మాత్రలు కలుపుతుంది.. అయితే మీనా అది గమనించకుండా వెళ్లి ఆ పాలని బాలుకి ఇస్తుంది. ఆ పాలు తాగిన బాలు మీనాని పాట పాడమని చెప్పి చల్లగా నిద్రపోతాడు. రోహిణి ఇదే కరెక్ట్ టైం ఫోన్ కొట్టేయాలి అని అనుకుంటుంది. కానీ అప్పుడే ప్రభావతి వచ్చి రోహిణి పట్టుకుంటుంది.. ఏదోఒకటి చెప్పి మేనేజ్ చేసి తప్పించుకుంటుంది.

ఇక ప్రభావతి పైకి వెళ్ళగానే ఆ ఫోన్ తీసుకోవాలని రోహిణి వస్తుంది. అప్పుడే పైనుంచి మనోజ్ వచ్చే రోహిణి పైకి ఎత్తుకొని వెళ్ళిపోతాడు.. ప్రభావతి మాత్రం తన డాన్స్ క్లాసులో కూడా మీన ఎందుకు నవ్విందో అని ఆలోచిస్తూ ఉంటుంది.. కామాక్షిని కనుక్కోమని ఎంత చెప్పినా సరే మీనా మాత్రం అసలు నిజాన్ని చెప్పకుండా దాచేస్తుంది. ఆ తర్వాత మనోజ్ షోరూం కి కొందరు వ్యక్తులు వచ్చి తన బాడీ కార్డు సంబంధించిన వాళ్ళని చెప్తారు. బాలు అతనికి హాస్పిటల్ బిల్ అయింది దానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.. నేను డబ్బులు ఇవ్వను అని మనం చెప్పగానే అక్కడున్న ఫర్నిచర్స్ ని తీసుకొని వెళ్ళిపోతారు.

Also Read : పోలీస్ స్టేటన్ కు వెళ్లిన మహా.. మాధవ్ ను కాపాడేందుకు ప్లాన్.. నిజం చెప్పేసిన గాయత్రి..

ఆ కోపంతో మనోజు ఇంటికి వచ్చి బాలుతో గొడవ పడతాడు. ఆ బాడీగార్డ్ వచ్చి వీడి వల్ల నాకు నష్టాన్ని కలిగించాడు కాబట్టి నేను 50,000 ఇంకా ఇవ్వను అని అంటాడు.. కానీ బాలు మాత్రం నువ్వు వడ్డీకి డబ్బులు ఇస్తున్నావ్ కదా.. మరి అవి ఇవ్వొచ్చు కదా అనేసి మనోజ్ గురించి మరో నిజాన్ని బయటపెడతాడు. బాలు లాస్ అని అంటున్నాడు కదా మరి మనోజ్ ని ఎందుకు నువ్వు ఊరికే ఏదో ఒకటి అంటుంటావు అని రోహిణి అంటుంది. కానీ మనోజ్ మాత్రం లక్ష రూపాయలు ఒక నెలకి ఇవ్వాలి అంటే కష్టంగా ఉంది అని మనోజ్ అంటాడు.. ఇక నోటు రాసి ఇవ్వాలి అని బాలు డిమాండ్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×