E-Paper
Advertisement

Congress leader Murder: కారులో కాపు కాచి.. కాంగ్రెస్​ నేత దారుణహత్య, నిజామాబాద్ జిల్లాలో దారుణం

Congress leader Murder: కారులో కాపు కాచి.. కాంగ్రెస్​ నేత దారుణహత్య, నిజామాబాద్ జిల్లాలో దారుణం
Advertisement

Congress leader Murder: నిజామాబాద్​ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. అధికార కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత, ముదిరాజ్​ సంఘం రాష్ట్ర నేత ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు.

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కాంగ్రెస్ నేత దారుణహత్య

Advertisement

ఏపీ మాదిరిగా తెలంగాణ రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నిజామాబాద్​ జిల్లాలో అధికార కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత, ముదిరాజ్​ సంఘం రాష్ట్ర నేత ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా, ఇందల్​వాయి ప్రాంతం శివారులో మరో కారుతో గోపి కారుని బలంగా ఢీ కొట్టాడు.

యాక్సిడెంట్ తర్వాత కారులోని వ్యక్తులు బయటకు వచ్చి అత్యంత దారుణంగా హత మార్చాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు ఇందల్​వాయి పోలీస్​ స్టేషన్‌‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్య గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు.

Advertisement

కాంగ్రెస్​ నేత గోపిని అత్యంత దారుణంగా హత్య చేసిన దగ్గర బంధువు

ఇందల్​వాయి మండలానికి చెందిన గోపి కొన్నాళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీల్లో ఆయన సేవలు అందించారు. ఇందల్​వాయి మండలంలో ఎంపీపీగా గోపి తన సేవలు అందించారు. ముదిరాజ్​ సంఘంలో క్రీయాశీలక పాత్ర పోషించిన ఆయన, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.

ఇటీవల గోపి భార్య హేమలత గౌరారం సర్పంచిగా గెలిచారు కూడా. అయితే గోపీని హత మార్చింది సమీప బంధువని తెలుస్తోంది. వరుసకు మేనల్లుడు అవుతాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు తనంతట తాను పోలీసుల వద్ద లొంగిపోవడంతో హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మండలంలో అంచెలంచెలుగా ఎదిగిన గోపి, అధికార పార్టీకి చెందిన కీలక నేతగా మారారు.

ALSO READ: బయట పడ్డ ఉర్దూ మీడియం హై స్కూల్ బండారం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..!

 

Related News

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×