E-Paper
Advertisement

LPG Crisis: యుద్ధం ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్స్ మూసివేతకు యాజమాన్యం సిద్ధం..!

LPG Crisis: యుద్ధం ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్స్ మూసివేతకు యాజమాన్యం సిద్ధం..!
Advertisement

LPG Crisis: సంక్షోభం దిశగా ఎల్బీజీ గ్యాస్​
–ధరల పెంపుతో సామాన్యులకు భారం
–హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేతకు యజమాన్యం సిద్దం
–ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 30లక్షల గ్యాస్​ కనెక్షన్లు

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: దేశాల మధ్య జరుగుతున్న యుద్దంతో క్రూడ్​ ఆయిల్​ సమస్యకు కారణమైతుందని తెలుస్తోంది. ఇరాన్​, ఇజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతున్న పోరు ఇతర దేశాలపై ప్రభావం చూపుతుంది. అందులో భాగంగానే భారతదేశంపై గ్యాస్​ సమస్య వస్తుందని ఆర్ధమైతుంది. ఈనేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కమర్షియల్ అవసరాలకు గ్యాస్​ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సామాన్యులు నడిపించే హోటళ్లు, టీ స్టాల్స్​, బేకరీ ఐటమ్స్​ తయారీ కేంద్రాలు, ఫుట్ఫాత్​ లపై నిర్వహించే బజ్జీల కొట్టు, హాట్ చీఫ్స్​ లాంటివి మూసివేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా కమర్షియల్​ పరంగా నడిపించే లగ్జరీ హోటల్స్​, రెస్టారెంట్లు సైతం మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు యాజమాన్యం వివరిస్తున్నారు. గ్యాస్​ సరఫరా పై తెచ్చిన అంక్షాలతో నిరుద్యోగ సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలోనే అత్యధిక హోటల్స్​, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిపై భారీగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

కమర్షియల్ సరఫరా నిలిపివేత..

Advertisement

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో కమర్షియల్ గ్యాస్​ సరఫరా నిలిపివేతతో అనేక మంది ఇబ్బందిపడే అవకాశం కనిపిస్తోంది. గతంలో డోమోస్టిక్​ కనెక్షన్లు ఒకే కుటుంబంలోని ఇద్దరి ముగ్గురి పేరుపై కనెక్షన్లు తీసుకునేది. ప్రస్తుతం ఒకే కుటుంబంలొ ఒకే కనెక్షన్​ ఇవ్వాలనే నిబంధనలతో అదనపు గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం లేదు. దీంతో రోడ్లకు ఇరువైపు నడిపించే చిరు వ్యాపారులు, టీఫిన్​ సెంటర్లు, బజ్జీల కొట్టు వాళ్లు ఉన్న గ్యాస్​తోనే సర్దుకపోవాల్సి వస్తుంది. గతంలొ 21 రోజుల తర్వాత గ్యాస్ బుకింగ్​ ఉండే ప్రస్తుతం 25 రోజుల తర్వాతనే బుకింగ్​ చేయడంతో కూడా ఇబ్బందులు ఉన్నట్లు చేబుతున్నారు. తేడా నాలుగు రోజులైన నెల ఆలస్యంగా గ్యాస్​ వస్తుందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఎదిఎమైన గ్యాస్ సరఫరాలో సంక్షోభం తప్పదనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

Also Read: Weather Update: ఎండలకు గుడ్ బై.. ఈ మూడు తేదీల్లో వడగళ్ల వర్షాలు, బయటకు రావొద్దు

బహిరంగా మార్కెట్​లో దోపిడీ..

Advertisement

వాణిజ్య, చిరు వ్యాపారులను ఆసరాగా చేసుకోని ఎల్పీజీ గ్యాస్​ దందా చేసే వాళ్లు దోపిడికి పాల్పడుతున్నారు. గతంతో పోలిస్తే రెండింతల అధికంగా బహిరంగా మార్కెట్లో గ్యాస్​ విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధరణంగా అవసరాల నిమ్మిత్తం గ్యాస్ మధ్యవర్తల ద్వారా తీసుకుంటే సిలెండర్ కు రూ.1500ల వరకు తీసుకునే వాళ్లు… కానీ ప్రస్తుతం ఆధర రూ.3వేలకు పైగా పెంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ వ్యాపారం చేసుకునే వాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో భాగా సంపాదిస్తారనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారేంట్ల యాజమాన్యం ఒక్కసారిగా వ్యాపారం మూసివేయలేరు. కనుక బహిరంగ మార్కెట్లో గ్యాస్​ విక్రయాలు జరిపించి వ్యాపారం కొనసాగించే అవకాశం ఉంటుంది. దీంతో ధరలు కూడా భారీగా పెంచి ప్రజల దగ్గర వసూళ్లు చేసేందుకు కూడా వెనకడుగు వేయరని తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 30లక్షల కనెక్షన్లే..

రంగారెడ్డి, మేడ్చల్​, వికారాబాద్​ జిల్లాలో కలిపి మొత్తం 30లక్షల కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 14లక్షలుండగా మేడ్చల్​ జిల్లాలో 13లక్షలు, వికారాబాద్​లో 3లక్షల చొప్పున కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిలో కలిపి లక్షలల్లోనే కమర్షియల్​ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న 14లక్షల కనెక్షన్లో కేవలం 15వేల పైన మాత్రమే కమర్షియల్​ కనెక్షన్లు ఉన్నట్లు జిల్లా సివిల్​ సప్లయ్​ అధికారి వివరించారు. అంటే కమర్షియల్ స్ధాయిలో నడిపించే హోటల్స్​, రెస్టారెంట్ల ఉన్న రంగారెడ్డిలో కేవలం ఆ స్ధాయిలో కమర్షియల్​ కనెక్షన్లు లేవని సుస్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమర్షియల్ వ్యాపారులు అక్రమ మార్గం ద్వారనే దందాలు నడిపిస్తున్నారని అర్ధమైతుంది. ఇప్పటి వరకు కమర్షియల్​ వ్యాపారులు డోమెస్టిక్​ గ్యాస్​ కనెక్షన్లతోనే వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Temple Lands: ఎండోమెంట్‌ శాఖలో చిత్ర విచిత్రం.. ప్రభుత్వం ఆదేశించిన స్పందించిన అధికారులు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×