E-Paper
Advertisement

గుండెనిండా గుడిగంటలు.. మార్చి 30 : సత్యం మాటతో షాకైన బాలు.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. శివను పోలీసులు అరెస్ట్ చేస్తారా..?

గుండెనిండా గుడిగంటలు.. మార్చి 30 : సత్యం మాటతో షాకైన బాలు.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. శివను పోలీసులు అరెస్ట్ చేస్తారా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజు శివ దొంగతనం చేసిన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని పూర్తిగా చూడక తలికే బాలు ఈ వీడియో ఎక్కడిది అని అంటాడు. ఈ వీడియో ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు పంపించారు అని అనగానే ఏమో ఎవరికి తెలుసు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది అని మనోజ్ అంటాడు..

ఆ దొంగ ఇంట్లో నుంచి అమ్మాయిని నా ఇంటికి కోడలుగా అడుగుపెట్టనివ్వను అని ప్రభావతి అంటుంది.. ఇక తర్వాత మీనా ఎక్కడుంది అని అడిగితే వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇక్కడికి తీసుకు రావాల్సిన అవసరం లేదు అని బాలుకి ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. రోహిణి మాత్రం బాలు మీనా ఈ దెబ్బతో బయటికి వెళ్లిపోతారు నా గతం గురించి బయట పెట్టే అవకాశం లేదు అని లోలోపల సంతోషపడిపోతు ఉంటుంది. బాలు మాత్రం మీనా కోసం వాళ్ళ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతాడు.. ఇలాంటి వాటికి వాళ్ళు ఎంత బాధ పడిపోతూ ఉంటారో మీరు అర్థం చేసుకోవడం లేదు అని బాలు సత్యంతో అంటాడు.. ఎన్ని అన్నా సరే దులిపేసుకోవడానికి నువ్వు అమ్మ కాదు వాళ్ళు కొంచెం మానవత్వం పౌరుషం ఉన్నవాళ్లు అని బాలు మీనా కోసం అక్కడికి వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా ఏ తప్పు చేయలేదు కదా మరి మీనాను ఎందుకు నిందిస్తున్నారు.. మీనా గురించి మీ అందరికీ తెలియదా అని బాలు అందరిపై అరిచేసి మీనా కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్తాడు.. శివ గురించి ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియ లేదండి. నా ఫోన్ కొట్టేసిన వాళ్లే ఇదంతా చేసి ఉంటారు మీ నాన్న నువ్వు ఏమి బాధపడకు అని అంటాడు.. అల్లుడుగారు మీ గురించి తెలియక చాలానే అనుకున్నాము మమ్మల్ని క్షమించండి అని పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో అత్తయ్య మీరేం బాధపడకండి వాడ్ని ఆ గుణ గాడే చెడగొట్టాడు.. మీరు వాడి గురించి తెలిసి కూడా మౌనంగా ఉన్నారు వాడి చెయ్యి విరగట్టారు. అదే నేను కనుక అయ్యుంటే వాడికి కాళ్లు కూడా విరగగొట్టే దాన్ని మీరు నిజంగా దేవుడు అల్లుడుగారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీరేం బాధపడకండి అత్తయ్య గారు ఇదంతా నేను చూసుకుంటాను అని బాలు అంటాడు.

ఇకపోతే పోలీసులు ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వీడు దొంగతనం ఎలా చేస్తున్నాడో చూడండి చాలా సింపుల్ గా దొంగతనం చేసి సంతోషంగా వెళ్లి పోతున్నాడు.. పోలీసులంటే ఇలాంటి వాళ్లకి లెక్క లేదనుకుంటాను. ఇలా చేసి అలా వెళ్ళిపోతున్నారు అని వాళ్ళు కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ వాళ్ళని చూసి ఏంటయ్యా వీడియో చూశారు కదా వాడెవడో కనుక్కొని స్టేషన్ కి తీసుకురండి అని చెప్పి వెళ్తాడు.. ఇక కానిస్టేబులు అతని కోసం వెతుకుతూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. బాలు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా కానిస్టేబుల్ శివ అంటే ఎవరు? ఇదే కదా ఇల్లు అని అడుగుతారు. శివ ఎక్కడున్నాడు ముందు తీసుకురండి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలి అని వాళ్ళు అడుగుతారు.. మా అమ్మగారిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తాను ఇది మా ఫ్యామిలీ విషయమని బాలు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతారు.

Advertisement

Also Read : శైలుకు కేశవ వార్నింగ్.. నారాయణ ప్రవర్తనతో మహా షాక్..చావు బతుకుల్లో నారాయణ..

అసలు శివ ఎక్కడ కనిపించడం లేదు అని అనగానే సుమతి మీ అమ్మగారు వచ్చి వాడిని కొట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలియడం లేదు బావ అని అంటుంది. అయితే నేను వచ్చేటప్పుడు వాడి బైక్ అక్కడే ఉండింది మూడంతస్తుల బిల్డింగ్ వైపు వెళుతున్నాడు. వాడు ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి అని బాలు అనగానే అందరూ కంగారుపడి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు.. అయితే పైకి వెళ్ళిన శివని చూసి బాలు వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతుంటారు. మీరు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను అని శివ అంటాడు. నన్ను దొంగ అని ఊరందరూ ముద్ర వేశారు నేను ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు నన్ను పోలీసులు తీసుకెళ్లిపోతారా అని బాధ పడిపోతూ ఉంటాడు. మీ అక్క వాళ్ళని మీ అమ్మని చూసైనా ఒకసారి ఆగరా ఏం చేస్తున్నావ్ రా అనే బాలు అంటూ ఉంటాడు. ఇక మొత్తానికి అక్కడి నుంచి దూకపోతున్న శివనే కాపాడి బాలు పక్కకు తీసుకొని వస్తాడు. నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని బాలు మాట ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×