E-Paper
Advertisement

Peddi Release: మళ్లీ తెరపైకి ‘రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ వీయిదా’!.. ఇందులో నిజమెంత?

Peddi Release: మళ్లీ తెరపైకి ‘రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ వీయిదా’!.. ఇందులో నిజమెంత?
Advertisement

Peddi Release: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చి బాబు సన కలయికలో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్త సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరిరి, రైయ్ రైయ్ రారా పాటలు చాట్ బాస్టర్లుగా మారాయి. ముందుగా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేద్దాం అనుకున్నారు అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో కొంత అయోమయాన్ని సృష్టిస్తోంది.

Read also-‘ధురంధర్ 2’ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏం జరిగిందంటే?

దీనిపై తాజా అప్‌డేట్స్

Advertisement

మొదట ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27, 2026న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడం, ఇతర పెద్ద సినిమాలతో పోటీని నివారించే క్రమంలో దానిని ఏప్రిల్ 30, 2026కి వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ టీజర్‌లో కూడా ఇదే తేదీని అధికారికంగా ధృవీకరించారు.

వాయిదా వార్తలకు కారణం

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, సినిమా మళ్ళీ మే 21కి వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్‌పై చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాలు మరియు ఒక భారీ స్పెషల్ సాంగ్ షూట్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇటీవల షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్ కంటి వద్ద చిన్న గాయం కావడంతో కొన్ని రోజులు చిత్రీకరణకు విరామం ఇచ్చారు. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం తక్కువగా ఉండటంతో విడుదల తేదీ మారవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Advertisement

Read also-ప్రేమ ‘డబుల్’ ధమాకా.. ఒకే వేదికపై ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టిన యువకుడు

రిలీజ్ ఎప్పుడంటే?

ఒకవేళ సినిమా మే 21కి వెళ్తే, అది మెగా అభిమానులకు సెంటిమెంట్ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వేసవి సెలవుల చివరి వారం కావడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడానికి లాంగ్ రన్ దొరుకుతుంది. అయితే, ఏప్రిల్ 30న రిలీజ్ అయితే మే డే (మే 1) హాలిడే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో చరణ్ ఒక ‘పెహిల్వాన్’ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన ఫిజిక్, రఫ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ఉప్పెన’తో తన ప్రతిభను చాటుకున్న బుచ్చి బాబు, ఈ చిత్రాన్ని ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఎంతో సహజంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత చరణ్ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ఎసెట్. విడుదల తేదీ మార్పుపై చిత్ర యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఏప్రిల్ 30నే ఫైనల్ డేట్ అని భావించాల్సి ఉంటుంది.

Related News

మెగా హీరో చేసుకోబోయే అమ్మాయి ఈమెనా..?

వియత్నాం ట్రిప్ ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న మినాక్షి

మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప.. ఫ్యాన్ వార్స్‌పై విశ్వక్ సేన్ ఫైర్

నాన్న పరిచయం చేసిన అబ్బాయినే ప్రేమించా.. కానీ పెళ్లికి ఒప్పుకోలేదు!

అబ్బా.. చీరలో రుక్మిణి వసంత్ లుక్ మామూలుగా లేదుగా!

రణబాలి డైరెక్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రజినీకాంత్‌తో ‘జైలర్’ తీసిన నెల్సన్.. ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా?

‘మంగళవారం’లో పులిరాజు పాత్ర వెనుక ఇంత కథ ఉందా?

Big Stories

Advertisement
×