Gundeninda GudiGantalu Today episode May 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఫోటోషాప్ అతనితో బాలు మంచిగా పెద్ద సైజు ఫోటోలు కావాలన్నా అని అడుగుతాడు. ఆ ఫోటోలను చూసినా అతను మీ అమ్మగారు ఇటీవల దొంగతనానికి గురయ్యారు కదా అనేసి అడుగుతాడు. అవునన్నా ఎవరో ఒక వెధవ మా అమ్మ దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడు అని బాలు అంటాడు. ఎవరో కాదు ఇదిగో ఇక్కడ చూడు ఒకసారి అని చూపిస్తాడు. ఆ విజువల్స్ లో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ ప్రభావతి బ్యాగు ని కొట్టేసి డబ్బులు తీసుకొని బ్యాగ్ ని అక్కడే పడేసి వెళ్లిపోతారు. అది చూసిన బాలు మొహానికి మాస్కులు వేసుకుని ఉన్నారు కదా అన్న కనిపెట్టలేకపోతున్నాం ఎవరో తెలిస్తే మాత్రం వాడికి ఉంటది అని అంటారు. మా బిల్డింగ్ కు ఇంకో కెమెరా ఉంది అది చూడండి అని అతను బాలుకు మరో వీడియోను చూపిస్తాడు. ఇతను చేసింది శివనే అని తెలుసుకొని బాలు కోపం కట్టలు తెచ్చుకుంటుంది.. ఇక బాలు రాజేష్ ని కొట్టడానికి వచ్చిన గుణ శివ కి తగిన బుద్ధి చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. గుణ వెంట వచ్చిన శివ బాలు కాలర్ పట్టుకుని అరుస్తాడు. నా ఫ్రెండ్ ని కొడితే బావ అని కూడా చూడను కొడతానని శివ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. నా కాలరే పట్టుకుంటావు రా ఎంత ధైర్యం రా నీకు అని శివని బాలు కొడతాడు. శివకు దెబ్బ తగలడంతో కారుపై పడిపోతాడు. నువ్వు ఇంట్లో కాలేజీకి పోతున్నానని చెప్పి ఇలా మళ్లీ వీడు వెనకాల తిరుగుతున్నావా నీ అమ్మ చెల్లి ఎంత కష్టపడుతున్నారో కొంచమైనా ఆలోచించవా మనిషి లాగానే కొంచమైన బుద్ధుందా అని శివ కొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ బాలు ఎంతగా ఆపాలని ప్రయత్నించినా కూడా బాలు ఆగడు. శివ ను చెయ్యి పట్టుకుని మేలు పెట్టేస్తాడు. ఇక రాజేష్ చెప్తే శివని వదిలేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శివ నొప్పిగా ఉందని బాధపడుతుందే పార్వతీ సుమతి ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకెళ్తారు.. అక్కడ శివకి చాలా నొప్పిగా ఉందని ఎక్స్ రే తీయాలని డాక్టర్ చెప్తాడు. పార్వతీ సుమతి మాత్రం శివకి ఏమైందని టెన్షన్ పడుతూ ఉంటారు.
శివ మాత్రం బైక్ మీద నుంచి కింద పడ్డానని చెబుతాడు. విపరీతంగా నొప్పి వస్తుందని అంటాడు. ఇక డాక్టర్ సరిగా ఏమైందో చెప్పమని, లేదంటే ట్రీట్ ెమెంట్ చేయడం కష్టమని అంటాడు. అప్పటికి కూడా శివ నిజం చెప్పడు. బైక్ మీద వెళ్లి కారు గుద్దుకున్నానని చెబుతాడు. డాక్టర్ ఇంకా గుచ్చి గుచ్చి అడుగుతుంటే నొప్పి నొప్పి అని అరుస్తాడు. ెక్కడ వాళ్ల అమ్మ, చెల్లి, అక్కా మీనాకు నిజం తెలిసి పోతుందోనని భయపడుతాడు. ఇక మీనా శివకు గాయమైందన్న విషయం తెలుసుకుని ఆస్పత్రికి వస్తుంది. ఏం జరిగిందని, ఎలా జరగిందని అడుగుతుంది. కంగారు పడుతూ శివతో మాట్లాడతాడు. శివకు అన్ని టెస్టులు చేయిస్తారు ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
అప్పుడే మీనా హాస్పిటల్ కి వస్తుంది. ఏమైందిరా అసలు నీకు దెబ్బ ఎలా తగిలిందని అడుగుతుంది. కాలేజీకి వెళ్లమంటే నువ్విలా బండిమీద తిరుగుతూ కిందపడి ఇలాంటి దెబ్బలు తగిలించుకుంటావా నీకు ఏమన్నా అయితే అమ్మ చెల్లి ఎంత టెన్షన్ పడతారో తెలుసా అనేసి మీనా శివ కి గడ్డి పెడుతుంది. ఇప్పటి వరకు మన ఇంట్లో వారు ఎవరూ ఆస్పత్రికి రాకుండా అమ్మ మనల్ని జాగ్రత్తగా కాపాడుకుందని శివతో అంటుంది. అలాంటి ఇలా యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రి పాలవడం ఏమాత్రం బాగా లేదని చెబుతుంది. నేనేమీ కావాలని బైక్ మీద నుంచి పడలేదు కదా అని శివ బదులిస్తాడు. కానీ నిన్ను ఇలా చూసి అమ్మ, మేము తట్టుకోలేక పోతున్నాము అని మీనా బదులిస్తుంది.
సుమతి డాక్టర్ ఏమైనా తినడానికి పెట్టమన్నారా అని అడిగితే లేదక్కా జ్యూస్ లాంటివి ఇవ్వమన్నారు అని చెప్తుంది మీనా నేను వెళ్లి జ్యూస్ తీసుకొస్తానని అంటుంది. జ్యూస్ కోసం వెళ్లిన మీనా బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది మీనా అని అడుగుతాడు. శివ ఆస్పత్రిలో చేరిన విషయం చెబుతుంది. వెంటనే వాళ్ల అమ్మగారి ఇంటి పక్కన ఉన్న ఆస్పత్రికి రమ్మని అడుగుతుంది. బాలు రాలేనని చెబుతాడు. ఒక లాంగ్ ట్రిప్ పడిందని, తను తిరిగి వచ్చే వరకు రాత్రి అవుతుందని మీనాతో అంటాడు. దాంతో మీనా షాక్ అవుతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని బాలుతో అంటుంది. ఇంకెలా మాట్లాడాలి. వాడు అస్సలు ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడనే విషయాలను పట్టించుకోవడమే మానేశారు. అందుకే వాడికి ఇలా జరిగిందని అంటాడు. వాడికి యాక్సిడెంట్ అయితే నేను వచ్చి ఏం చేయాలని అంటాడు. దాంతో మీనా బాధ పడుతుంది. సొంత తమ్ముడు ఆస్పత్రిలో ఉన్నాడంటే ఇలా మాట్లాడుతున్నారంటూ కోపం తెచ్చుకుంటుంది. ఇక తిరిగి ఆస్పత్రికి వెళ్తుంది.
సుమతి అక్క బావకు ఫోన్ చేసావా అని అడుగుతుంది చేశాను సుమతి. ఆయన లాంగ్ ట్రిప్ కి వెళ్ళాడు అంట సగం దూరం వెళ్ళాడంట ఇప్పుడు తిరిగి రావడం కుదరదు అనేసి అన్నారు. ఒకవేళ లేట్ అవుతుంది రావడానికి అని కూడా చెప్పారు అని మీనా అంటుంది. అది విన్న శివ ఊపిరి పీల్చుకుంటాడు. నా గురించి నిజం తెలిసే అవకాశం లేదని కాస్త రిలాక్స్ అవుతాడు. ఇక శివ దొంగతనం వీడియోను డిలీట్ చేయాలని అనుకుంటాడు. ఆ వీడియో చూస్తే అమ్మ ప్రభావతి మీనాను ఇంట్లో ఉండనివ్వదనే ఆలోచనతో డిలీట్ చేద్దామని తన స్నేహితుడు రాజేశ్ తో అంటాడు. కానీ రాజేశ్ మాత్రం ఆ వీడియో ఉండాలని, దాన్ని చూపించి శివను దారిలో పెట్టే అవకాశం ఉందని చెబుతాడు. ఎప్పుడైనా సాక్ష్యం కావాలంటే ఇది చూపించొచ్చు అని సలహానిస్తాడు. దాంతో బాలు కూడా ఆ వీడియోను తన ఫోన్ లోనే ఉంచుతాడు..
ఇక మీనా కోసం ప్రభావతి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ మహాతల్లి ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. సత్యం అప్పుడే అక్కడికి వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు ఇంట్లో టీ పెట్టిచ్చే దిక్కు కూడా లేరు అని ప్రభావతి అంటుంది. నీకు టీ పెట్టడం రాదా ఏంటి? పెట్టొచ్చు కదా ఒకసారి కి అని అంటాడు. దానికి ప్రభావతి అవును ఈవిడ ఉద్ధరించడానికి వెళ్తే నేను టీ పెట్టుకుని తాగుతాను అని అంటుంది. అప్పుడే రోహిణి పైనుంచి వస్తుంది మీనా ఇంకా రాలేదా ఆంటీ అని అడుగుతుంది. రాలేదమ్మా ఏం కావాలి అంటే మనోజ్ కి టీ కావాలంట అని అడుగుతుంది. అప్పుడే మీనా ఇంట్లోకి వస్తుంది.
వెళ్లగానే సత్యం ఏమైందని, శివకు ఎలా ఉందని అడుగుతాడు. దాంతో మీనా ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడని చెబుతుంది. ఆస్పత్రి ఖర్చులకు ఏమైనా డబ్బులు కావాలంటే అడుగు అంటాడు సత్యం. దానికి ప్రభావతి ఆ మొత్తం ఊడ్చి ఇవ్వండని తన బుద్ధిచూపిస్తుంది. అందుకు మీనా నేను నా మొగుడిని అడగలేదు. ఇంకా మిమ్మల్ని ఎందుకు అడుగుతానని బదులిస్తాడు. అలోపే బాలు కిందికి దిగి వస్తాడు. మీనా బాలును చూసి మీరు ఇంట్లోనే ఉన్నారా? ఆస్పత్రికి ఎందుకు రాలేదు, ఒక్కరోజు ట్రిప్ కు వెళ్లకపోతే ఏం జరుగుతుందని అంటుంది. దాంతో బాలు నేను ఆస్పత్రికి వచ్చి అడిగితేనే వాడికి తగ్గుతుందా? వాడు ఎవరితో పనిచేస్తున్నాడో, ఎక్కడ పనిచేస్తున్నాడో చూస్తున్నారా? అని మీనాను ప్రశ్నిస్తాడు. అసలు శివగాడు చేసిన పనికి… అంటూ పిడికిలి బిగిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మీనాకు అసలు నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..