Sravanthi Chokkarapu: స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu)పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం యాంకర్ గా వరుస సినిమా ఈవెంట్లతో ఏ మాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలా సినిమా ఈవెంట్లతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న యాంకర్ స్రవంతి సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలతో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు ముచ్చమట్టలు పట్టిస్తుంటారు. ఇలా యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న స్రవంతి ప్రశాంత్ (Prashanth) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే స్రవంతి పెళ్లి వెనుక పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని తెలుస్తోంది.
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన స్రవంతి…
స్రవంతి అనంతపురం జిల్లాకు చెందిన అమ్మాయి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన స్రవంతి తన చదువులు మొత్తం అనంతపురం కదిరిలోనే పూర్తి చేశారు. అయితే కాలేజీ రోజుల్లో తన స్నేహితులు హీరోయిన్ లా ఉన్నావ్ అంటూ చెప్పడంతో ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఈమె మోడలింగ్ రంగం వైపు అడుగులు వేయాలని భావించారు. అలా కదిరిలో డిగ్రీ పూర్తి చేసిన ఈమె తన అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఏమాత్రం అంగీకరించలేదు. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడానికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇంకొకసారి ఇలా సినిమాలు అంటే పెళ్లి చేసి పంపిస్తామని తన కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఇండస్ట్రీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులకు జాబ్ కోసం హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక హాస్టల్లో ఉన్నారు.
హాస్టల్ ఫ్రెండ్ ద్వారా ప్రశాంత్ పరిచయం…
తన దగ్గర ఉన్న డబ్బులతో ఫోటో షూట్ చేయించి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా తనకు తనకు రాజశేఖర్ హీరోగా నటించిన మహంకాళి సినిమాతో పాటు లీడర్ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమాల ద్వారా పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు. ఇక తన హాస్టల్ ఫ్రెండ్ జ్యోతి కారణంగా ప్రశాంత్ పరిచయం కావడంతో ఈ ముగ్గురు పెద్ద ఎత్తున పార్టీలు అంటూ ఎంజాయ్ చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అలాగే ఒక మ్యూజిక్ ఛానల్ లో ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న స్రవంతి ఆడిషన్ కి వెళ్లి సెలెక్ట్ అయింది. ఇక స్రవంతి ప్రశాంత్ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే తనని పెళ్లి చేసుకోవాలంటే యాంకరింగ్ మానేయాలని కండిషన్లు పెట్టారట అందుకు స్రవంతి కూడా ఒప్పుకున్నారు.
రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్రవంతి..
ఇలా తన కుమార్తె హైదరాబాదులో జాబ్ కోసం కాకుండా సినిమా అవకాశాల కోసం వెళ్లిందని, వేరే కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉందనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అర్జెంటుగా నీతో పని ఉందని చెప్పి తనని ఇంటికి పిలిపించారు. అయితే ఇంట్లో తనని హెచ్చరించి కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సంబంధాలు కూడా చూశారు. తెల్లవారితే పెళ్లి కావడంతో స్రవంతి రాత్రికి రాత్రి ఇంట్లో వారికి తెలియకుండా హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాద్ వచ్చిన స్రవంతి ప్రశాంత్ తో కలిసి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు తనని తమ కుటుంబానికి దూరం పెట్టారు. ఇలా వీరి వివాహం జరిగిన కొద్ది రోజులకి ఇద్దరి పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకొని ఘనంగా మరోసారి విరిగి వివాహం చేశారు. ఇక ఈ దంపతులకు ఆఖీరా నందన్(Akira Nandan) అనే ఒక కుర్రాడు కూడా ఉన్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోను స్రవంతి ఎంతో సంతోషంగా, బిజీగా గడుపుతున్నారు.
Also Read: Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్