Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆత్మను బంధించడానికి అమర్ ఇంట్లోకి వచ్చిన చంభాకు ఆరు ఆత్మ కనిపించదు. ఏమైందని మనోహరి అడగ్గానే ఆ ఆత్మ ఎక్కడో దాక్కుంది అని చెప్తూనే మంత్రదండంతో మంత్రించగానే ఆత్మ ఉన్న రూంను మంత్రదండం చూసిస్తుంది. ఆ రూమ్ వైపు చంభా వెళ్తుంటే మనోహరి ఆపి అది నా రూం అని చెప్తుంది. కానీ ఆత్మ అందులోనే ఉందని చంభా చెప్పే సరికి మనోహరి షాక్ అవుతుంది. నువ్వు నేను లోపలికి వెళ్తాను అని చంభా చెప్తుండగానే పైన అమర్ నిద్ర లేచి ఆరు రూం ఓపెన్ చేస్తాడు. రూం ఓపెన్ చేసిన సౌండ్ విని మనోహరి షాక్ అవుతుంది. ఈ లోపు చంభా రూంలోకి వెళ్లి ఆరును వెతుకుతుంటే.. ఆరు మరో పక్క నుంచి రూంలోకి బయటకు వెళ్లి అక్కడి నుంచి పైకి వెళ్తుంది. తన రూంలో అమర్ ఉండటం చూసి షాక్ అవుతుంది.
రూంలోంచి బయటకు వచ్చిన చంభాను చూసి ఏమైంది దొరికిందా అని మను అడుగుతుంది. లేదు అని చంభా చెప్పగానే.. చ అంటూ తిడుతుంది. వెంటనే పైకి వెళ్తారు చంభా, మను. పైన రూంలో అమర్ ఎమోషనల్‌గా ఆరు ఫోటో ముందు నిలబడి ఆరు అని పిలుస్తాడు. ఆరు ఎమోషనల్ అవుతుంది. ఏవండి నేను ప్రమాదంలో ఉన్నానండి అంటుంది. ఎందుకో తెలియదు ఆరు మనసంతా అలజడిగా ఉంది. నీకు ప్రమాదం వస్తుందేమోనని ఇబ్బందిగా ఉంది. ఆరు నువ్వు బాగానే ఉన్నావు కదా..? అంటాడు. లేదండి ఎవరో దుష్ట శక్తురాలు నా కోసం వచ్చిందండి నన్ను తీసుకెళ్లిపోతానంటుంది. ఏం చేయాలో ఏంటో అసలు తోచడం లేడు అని ఆరు అనగానే.. నువ్వే ఏం చెప్పినా నాకు వినిపించదు కదా ఆరు.. మన ఇంటికి ఏ స్వామిజీ వచ్చినా కూడా నువ్వు ఇక్కడే ఉన్నావని నీ ఆత్మ మన ఇంటి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. వాళ్లు చెప్పిన ప్రతిసారి.. ఆ విషయం గుర్తొచ్చిన్నప్పుడల్లా మాతో సంతోషంగా గడపాల్సిన నువ్వు మమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఆనంద పడుతున్నావో బాధపడుతున్నావో అసలు అర్థం కావడం లేదు ఆరు అంటూ ఎమోషనల్ అవుతుంటాడు.
వెనకవైపు నుంచి చంభా వస్తుంది. ఆరు చంభాను చూసి ఏవండి ఆ చంభా వచ్చేసిందండి.. నన్ను తీసుకెళ్లిపోతుందేమోనని భయంగా ఉందండి ఏదైనా చేసి నన్ను కాపాడండి అంటూ ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మను, చంభాను చూసి ఏయ్ ఏంటి ఏమైంది.. ఇక్కడ ఎందుకు ఆగావు..? అని అడుగుతుంది. చంభా అటు చూడు అని చెప్పగానే.. మను చూస్తుంది. అమర్ ఈ టైంలో ఆరు రూం ఓపెన్ చేశాడేంటి..? అంటుంది. అతనొక్కడే కాదు ఆత్మ కూడా లోపలే ఉంది.. అంటూ తన శక్తికి ఆరు మీదకు పంపిస్తుంది. ఆ శక్తి రిటర్న్ చంభా దగ్గరకు వస్తుంది. దీంతో చంభా కోపంగా ఏదో శక్తి నా దుష్టశక్తికి అడ్డు పడుతుంది. ఆ ఆత్మ ఫోటో ముందు దైవబలం కల పూలు ఉన్నాయి. ఆ పూలు తీస్తే కానీ నేను ఆత్మను వశపరుచుకోలేను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అక్కడి నుంచి అతన్ని బయటకు పంపించు. వెంటనే ఆ పూలను కూడా తీసుకెళ్లిపో అప్పుడు నేను ఆత్మను బంధిస్తాను అని చంబా చెప్పగానే…
మొత్తం విన్న గుప్త లోపలికి వచ్చి బాలిక వారిరువురు నీ చిత్ర పటం ముందు ఉన్న పువ్వులు తీయుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ చంభా నీ పై దుష్ట శక్తిని ప్రయోగించింది. ఆ పువ్వుల సమీపంలో నువ్వు ఉన్నందునే ఆ దుష్ట శక్తి నీ సమీపమునకు రాలేదు.. అని చెప్తాడు. మనోహరి చంభా నువ్వు వెళ్లి పక్కన దాక్కో నేను వెళ్లి అమర్ ను పంపిస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి అమర్ ఈ టైంలో ఇక్కడే చేస్తున్నావు…? అని అడగ్గానే.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మనోహరి అని అడుగుతాడు అమర్.
అది పడుకుంటే ఏదో సౌండ్ వచ్చింది అమర్ ఏంటా అని చూసి వచ్చాను ఏమైంది అమర్..? అని అడగ్గానే.. ఏం లేదు నువ్వు వెళ్లి పడుకో.. అంటాడు.. అయ్యో అమర్ ముందు నువ్వు వెళ్లి పడుకో అమర్ నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు.. అంటుంది మను. అమర్ సైలెంట్‌గా ఉంటాడు. అమర్ ఏమైంది అమర్ నువ్వు వెళ్లి పడుకో అమర్ అని చెప్పగానే.. అమర్ బయటకు వెళ్తాడు. మనోహరి పూలు తీయడానికి ఫోటో దగ్గరకు వెళ్తుంది. ఆరు తీయోద్దని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంతలో అమర్ రిటర్న్ వచ్చి మనోహరిని బయటకు పిలిచి రూం లాక్ చేస్తాడు. హమ్మయ్యా అంటూ ఆరు ఊపిరి పీల్చుకుంటుంది. చంభా కోపంగా బయటకు వెళ్లిపోతుంది.
యాడ్ షూటింగ్‌కు మిస్సమ్మ ఒప్పుకుంటుంది. తర్వాతి రోజు మిస్సమ్మతో షూటింగ్ చేస్తుంటారు. మిస్సమ్మ డైరెక్టర్ చెప్పినట్టు ఫర్పెక్ట్‌గా చేస్తుంటుంది. డైరెక్టర్ ఆశ్చర్యపోతాడు.. చిత్ర ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. మిస్సమ్మ యాక్టింగ్‌కు అందరూ చప్పట్లతో మెచ్చుకుంటారు. తర్వాత అమర్ మిస్సమ్మను పైకి రూంలోకి తీసుకెళ్లి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం