Turkey Earthquake: టర్కీపై మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. బలికెసిర్ ప్రావిన్సులో భారీ భూకంపం సంభించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్టు అక్కడి న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదు అయ్యింది.
టర్కీని భూకంపాలు వెంటాడుతున్నాయి. టర్కీలోని వివిధ ప్రావిన్స్‌ల్లో ఆదివారం రాత్రి భూమి కంపించింది. బలికెసిర్ ప్రావిన్సులో ఆదివారం రాత్రి బలమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఆదివారం రాత్రి దాదాపు 8 గంటల సమయంలో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది.
దీని తీవ్రతకు 200 కిలోమీటర్ల దూరంలోవున్న రాజధాని ఇస్తాంబుల్‌లో భూమి కంపించింది. ప్రకంపనల ధాటికి సిందిర్గి పట్టణంలో 16 భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
ప్రస్తుతం ఆయా శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు అధికారులు. సిందిర్గి పట్టణం జనాభా 1.6 కోట్ల పైమాటే. కూలిపోయిన భవనం నుండి నలుగురిని రక్షించామని సిండిర్గి మేయర్ వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జరిగిన నష్టాన్ని అప్పుడే అంచనా వేయడం కష్టమని తెలిపారు.
ALSO READ: మేం ఊరుకోం.. శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్
భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి కావడంతో సిందిర్గి పట్టణ ప్రజలు ఇళ్లలో రిలాక్స్ అవుతున్నాయి. ఒక్కసారిగా భూమి వణకడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భవనాలు కూలడంతో శిథిలాల కింద ఇంతమంది ఉన్నారనేది ఇంకా తెలియాల్సివుంది.
తరచూ భూకంపాలు వస్తున్న ప్రాంతాల్లో టర్కీ కూడా ఉంది. రెండేళ్ల కిందట సరిగ్గా 2023 ఫిబ్రవరి భారీ భూకంపం సంభవించింది. అప్పుడు 53 వేల మంది బలయ్యారు. హిస్టారికల్ సిటీగా చెబుతున్న ఆంటియోక్ సర్వ నాశనం అయ్యింది.
జులై ఆరంభంలో కూడా 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో ఒకరు మరణించారు. మరో 69 మంది గాయపడ్డారు. ఈసారి వచ్చిన భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అక్కడి భూగర్భశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.
🇹🇷⚠️ 𝗧𝗘𝗠𝗕𝗟𝗢𝗥 𝗘𝗡 𝗧𝗨𝗥𝗤𝗨𝗜́𝗔: Un sismo de 6.1 sacudió Balıkesir y se sintió fuerte en Estambul e Izmir. Edificios dañados y réplicas activan alerta. Autoridades instan a no entrar en estructuras afectadas.
Fuentes: AP
Like y Comparte 🔁 #Turkey #Earthquake #BREAKING pic.twitter.com/RapveJ4rSm— Global Network News 🌎 (@iluminnatii) August 10, 2025
FIRST FOOTAGE of earthquake damage in Turkey’s Balıkesir
Streets filled with bricks and dust, right on quake’s epicenter https://t.co/yNiaUlnJmc pic.twitter.com/rBqLxAnStR
— RT (@RT_com) August 10, 2025