JVAS:అప్పట్లో యువతలో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన సినిమాలలో చిరంజీవి (Chiranjeevi ), శ్రీదేవి (Sridevi) జంటగా వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాను మే 9వ తేదీన దాదాపు రూ.8 కోట్ల ఖర్చుతో రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 4K డాల్బీ ఆడియోలో ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండడం గమనార్హం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendrarao) దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిర్మాత అశ్విని దత్ (Ashwini Dutt) కు భారీ లాభాలు అందించింది. 1990లో విడుదలైన ఈ సినిమా 35 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతుండడంతో అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్ ఎంతంటే..?
ముఖ్యంగా నాటి యువతే కాదు ఇప్పటి వారు కూడా ఈ సినిమా కోసం, ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి అప్పుడే టికెట్లు కూడా బుక్ చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం చిరంజీవి , శ్రీదేవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అని , ఈ విషయం తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అప్పట్లో చిరంజీవి రూ.25 లక్షలు, శ్రీదేవి రూ.20 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు రూ.2కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ అప్పట్లోనే రూ.15 కోట్లు కాబట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చిరంజీవి, శ్రీదేవి డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అభిమాన లోకం ఫిదా అయింది. వీరిద్దరి క్రేజ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
చిరంజీవి సినిమాలు..
ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. చివరిగా ‘భోళాశంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ఇప్పుడు వశిష్ట మల్లిడి (Vasistha mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం భారీగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇంకా దాదాపు షూటింగ్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా ముగించేసి సినిమాను జూన్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో త్రిష(Trisha) మళ్లీ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవితో జతకట్టింది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక మరొకవైపు శ్రీదేవి విషయానికి వస్తే.. అతిలోకసుందరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అనూహ్యంగా దుబాయ్ లో ఒక పెళ్లి వేడుకకు వెళ్లి బాత్ టబ్ లో పడి అనుమానాదాస్పద స్థితిలో మరణించింది. ఇక ఈమె లేని లోటును ఈమె కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తీర్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది జాన్వీకపూర్.
ALSO READ:Puri Jagannath: వారి జీవితాలు నాశనం అవడానికి కారణం వాడే – పూరీ జగన్నాథ్..!