Brahmamudi serial today Episode: కావ్య బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నావని అపర్ణ అడుగుతుంది. హాస్పిటల్‌కు వెళ్తున్నానని చెప్తుంది. ఎందుకు అని అపర్ణ అడగ్గానే..కడుపులో బిడ్డ నిజంగానే ఉందా..? లేకపోతే లేదా అని తెలుసుకోవడానికి వెళ్తున్నాను అత్తయ్య అంటుంది. నిన్ననే కదా టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది అన్నావు అని అపర్ణ అడిగితే అవును అత్తయ్య టెస్ట్ చేసుకున్నాను కానీ ఎందుకైన మంచిది అని హాస్పిటల్‌కు వెళ్తున్నాను. ఒకవేళ బిడ్డ ఉంటే డాక్టర్‌ను కంసల్ట్ అవ్వొచ్చు కదా అని చెప్తుంది కావ్య. దీంతో అపర్ణ బాధపడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చాయి కావ్య భర్త దగ్గరుండి నిన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సింది కానీ నువ్విలా ఒంటరిగా వెళ్తున్నావు అంటూ బాధపడుతుంది.
తర్వాత కావ్య హాస్పిటల్‌కు వెళ్తుంటే.. రాజ్ చూస్తాడు. కళావతి గారేంటి ఆఫీసు ఇటు సైడు ఉంటే తను అటు సైడు వెళ్తుంది. ఈ రూట్ లో ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా..?ఏదో డౌటు కొడుతుంది. ఫాలో చేద్దాం అనుకుంటూ కావ్యను ఫాలో చేస్తాడు. ఏంటీ హాస్పిటల్‌కు వెళ్తున్నారా..? అనుకుంటూ కావ్యకు కాల్ చేస్తాడు. రాజ్ కాల్ రావడం చూసి ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు..? అనుకుంటూ కాల్ లిప్ట్ చేస్తుంది. రాజ్ హలో కళావతి గారు ఎక్కడున్నారు..? అని అడగ్గానే.. ఇప్పుడు హాస్పిటల్‌కు వెళ్తున్నాను అని చెబితే హాస్పిటల్‌కు వచ్చేస్తా అంటాడు అని మనసులో అనుకుంటుంది కావ్య.. ఇంతలో రాజ్.. హలో కళావతి గారు వినిపిస్తుందా..? వినిపిస్తే ఎక్కడున్నారు అంటే చెప్పరేంటండి..? అని అడగ్గానే.. నేను కొంచెం బయటకు వచ్చానండి.. అని చెప్తుంది కావ్య.
నేను మీ కోసం మీ ఇంటికి వస్తుంటే.. మీరేంటండి బయటకు వెళ్లిపోయారు అని అడుగుతాడు. అంటే రామ్ గారు అర్జెంట్‌గా ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్నాను బాయ్.. అంటూ కాల్ కట్ చేస్తుంది. రాజ్ డౌటు లేదు.. కళావతి గారు నాతో ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ముందు కళావతి గారిని ఫాలో చేస్తే తెలుస్తుంది అనుకుంటూ కావ్యను ఫాలో చేస్తాడు రాజ్. కావ్య హాస్పిటల్ దగ్గరకు వెళ్తుంది. రాజ్ అనుమానంగా కళావతి గారు హాస్పిటల్ కి వెళ్తుందేంటి..? అంటే కావ్యకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా..? కళావతి గారు ఈరోజు మీరు దాస్తున్న నిజం ఏంటో కనుక్కుంటాను అంటూ కావ్యను ఫాలో అవుతాడు రాజ్. కావ్య రిసెప్షన్‌లో వెళ్లి డాక్టర్ ప్రియను కలవాలి అని అడగ్గానే ఇవాళ మేడం అంకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు అక్కడికి వెళ్లండి అని చెప్పగానే సరే అంటూ కావ్య వెళ్తుంది. వెనకాలే ఫాలో అయిన రాజ్ అంకాలజీ డిపార్ట్‌మెంట్ అంటే క్యాన్సర్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంట్ అన్నమాట అనుకుంటూ లోపలికి తొంగి చూస్తాడు.
ఇద్దరి మాటలు విని రాజ్ బాధగా కన్‌ఫం కావ్యకు క్యాన్సరే అన్నమాట అనుకుని బాధగా ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్లి కూర్చుంటాడు. తర్వాత కావ్య బయటకు వచ్చి రాజ్ ను చూసి ఈయనేంటి ఇక్కడు ఉన్నారు. ఇప్పుడు ఈయన కంట పడితే నానా ప్రశ్నలు వేసి చంపుతారేమో..? అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంటే రాజ్ ఆగండి కళావతి గారు నాకు కనిపించకూడదని.. నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా..? ఇంకా ఎంతకాలం అని పారిపోతారు.. ఇంకెన్నేళ్లు నాకు ఈ విషయం తెలియకుండా దాచేస్తారు కలావతి గారు సూదిని మూట కట్టినంత మాత్రానా అది దాగదు కళావతి గారు ఏదో ఒక వంక నుంచి అది బయటపడుతుంది. అలాగే మీరు నా దగ్గర దాస్తున్న నిజం కూడా ఇవాళ బయటపడింది అనగానే కావ్య షాకింగ్ గా ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు అంటుంది.
దీంతో రాజ్ ఇక చాలు నటించింది చాలు కళావతి గారు నాకు నిజం తెలిసిపోయింది. చెప్పండి కళావతి గారు ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచారో చెప్పండి.. ఎందుకు నాకీ నిజాన్ని చెప్పకుండా మోసం చేశారో చెప్పండి నిజం చెప్తే నేను అర్తం చేసుకోలేను అనుకున్నారా..? మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను అనుకున్నారా..? నాకు ఆ రోజే డౌటు వచ్చింది కళావతి గారు.. మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది అని కానీ అది ఇంత బలమైన కారణం అని ఇప్పుడే తెలిసింది కళావతి గారు.. అంటుంటే.. రామ్ గారు అది..అంటూ కావ్య ఏదో చెప్పబోతుంటే..
వద్దు కళావతి గారు ఇంకా ఈ విషయాన్ని నా దగ్గర దాచే ప్రయత్నం చేయకండి.. ఒకవేళ చేసినా.. నేను నమ్మను.. ఎందుకంటే మీరు ఆ గదిలో నుంచి వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థం అయింది. మీకు క్యాన్సర్ అని చెప్తాడు. దీంతో కావ్య ఓహో ఈయనకు ఇలా అర్థం. అయిందా..? ఇంకా నయం నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలిసిందేమో అనుకున్నాను .. అని మనసులో అనుకుని కావ్య తనకు క్యాన్సర్ లేదని చెప్తుంది. అయినా రాజ్ నమ్మడు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఇంటి దగ్గర అపర్ణ, ఇద్రాదేవి.. కావ్య కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంతలో కావ్య, రాజ్ వస్తారు. వాళ్లందరి ముందు రాజ్ బాధపడుతుంటాడు.. అందరూ నవ్వుకుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం