NTR:ఎన్టీఆర్ (NTR ) తొలిసారి బాలీవుడ్ రంగా ప్రవేశం చేస్తున్న సినిమా వార్ 2(War 2). ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాదులోని యూసఫ్ గూడా వేదికగా నిన్న చాలా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు చాలామంది అభిమానులు హాజరయ్యారు. ఇకపోతే ఈ వేడుకలో కొన్ని విషయాలు పంచుకున్న ఎన్టీఆర్.. తన తొలి అభిమానిని పరిచయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతుందని, తన తొలి అభిమాని ఇతడే అంటూ ఒక వ్యక్తిని అందరికీ పరిచయం చేశారు కూడా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తన మొదటి అభిమానిని పరిచయం చేసిన ఎన్టీఆర్..
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నిన్ను చూడాలని సినిమాతో హీరోగా నా కెరియర్ ప్రారంభమైంది. రామోజీరావు తన బ్యానర్ లోనే నన్ను పరిచయం చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన చల్లని చూపు ఎప్పుడూ మన పైన ఉంటుంది. సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి ఆరోజు నా పక్కన నాన్న, అమ్మ తప్ప ఎవరూ లేరు. మొదటిసారి నన్ను కలిసిన అభిమాని ఆధోనికి చెందిన ముజీబ్ అహ్మద్. అద్దె కార్యాలయంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు నన్ను ముజీబ్ కలిశారు. ఎవరండీ మీరు అని నేనడిగితే.. నేను మీ ఫ్యాన్ అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు.. ఏంటి నాకు అభిమానా అని నేను ఆశ్చర్యపోయాను. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అప్పుడే నాకు అభిమాని ఏంటి అనుకున్నాను. ఇకనుంచి మీ వెంటే ఉంటాను అన్నారు. అలా మొదలైంది మా జర్నీ.. 25 ఏళ్లుగా ఎనలేని ప్రేమను ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నాకు చాలా సంతోషంగా మారింది. ముఖ్యంగా చాలామంది నా మీద ప్రేమను పెంచుకున్నారు” అంటూ ఎన్టీఆర్ తెలిపారు. ఇకపోతే ముజీబ్ అహ్మద్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనియర్ గా సేవలు అందిస్తున్నారు. తనకు మొదటి అభిమాని అని చెప్పి ముజీబ్ అహ్మద్ అరుదైన ప్రశంసను అందుకున్నారు.
వార్ 2 సినిమా విషయాలు..
ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్న చిత్రం వార్ 2. కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ సినిమా కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya chopra) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొన్నటి వరకు అటు కూలీ సినిమాపై అంచనాలు ఉండగా.. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ నిన్న ఒక్క ఈవెంట్తో ఊహించని అంచనాలు , బజ్ ఏర్పడ్డాయని చెప్పవచ్చు.
ALSO READ:Kangana Ranaut: క్యాస్టింగ్ కౌచ్ పై కంగనా కామెంట్స్.. అలా చేస్తేనే అవకాశం!
తన దగ్గరికి వచ్చిన మొట్టమొదటి అభిమాని ని ఇప్పటికీ చెయ్యి వదలని హీరో, ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఆ హీరో చెయ్యి వదలని ఆ అభిమాని కథ ❤️@tarak9999 @MujeebAhmed9999 pic.twitter.com/786AlBHn9W
— Shiva… (@Shiva4Ntr) August 10, 2025