Betting Apps case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. వీటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. మొన్న విజయ్ దేవరకొండ హాజరయ్యారు. నేడు నటుడు రానా దగ్గుబాటి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం ఈయన గత నెలలోనే విచారణకు హాజరు కావాల్సి ఉంది. షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు. దీంతో ఆగ స్టు 11న హాజరు కావాలని ఈడీ అధికారులు సూచించారు.. అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అలాగే ఈ బెట్టింగ్ యాప్‌లతో వారికున్న సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం.. ఇటీవల విజయ్ దేవరకొండ ను అధికారులు విచారించారు. ఇప్పుడు రానా వంతు. నేడు ఆయనకు హాజరైయి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
రానాను అడిగే ప్రశ్నలు..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా రానా ఈడీ ముందు హాజరువుతున్నారు..బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ జరిపిస్తున్నారు. మొన్న విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు.
మంచు లక్ష్మీకి నోటీసులు..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఒక్కొక్కరిని అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, పలువురు నటీనటులను అధికారులు విచారించారు. ఇక ఈ నెల 13న నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఆమెకు సంబంధించిన లావాదేవీల వివరాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఈ కేసులో వరుసగా విచారణకు హాజరవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.. అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..
Also Read : ‘వార్ 2’ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..?
బెట్టింగ్ యాప్స్ కేసు..
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారిని తెలంగాణ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. ఒక్కొక్కరే వెళ్తున్నారు, తమకు తెలిసిన సమాచారం చెప్తున్నారు.. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బెట్టింగ్ యాప్స్. దీని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పూర్తిగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వారిపై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారి పాలిట యమగండం గా మారారు. ప్రస్తుతం దాదాపు చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆగిపోయిన విషయం తెలిసిందే.. పలువురు సెలెబ్రిటీలకు నోటీసులు అందాయి. ఇక ముందు ఎవరికి అధికారులు షాక్ ఇస్తారో చూడాలి.. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝలిపిస్తున్నారు. ఇప్పటికే పలు యాప్ లను బ్యాన్ చేశారు.