Intinti Ramayanam Today Episode August 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అనుకున్న ప్లాన్ ప్రకారం భరత్ బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి వాడితో నా చెల్లి పెళ్లి చెయ్యాలా అని అక్షయ్ అడుగుతాడు. అంతేకాదు ఎవరు ఎంత చెప్తున్నా సరే వినకుండా అక్షయ్ భరత్ ను చావగొడతాడు. అవని ఎంతగా అడ్డుపడుతున్న సరే ఇలాంటి వాడికి నా చెల్లిని ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ అవన్నీ కూడా తిడుతూ భరత్ ని దారుణంగా కొడతాడు అక్షయ్.. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా చేయడం మంచిది కాదు అని రాజేంద్రప్రసాద్ అనడంతో ఆగుతాడు.. ఇక అప్పుడే వచ్చిన పార్వతి.. ఛీ ఇలాంటి వాడికి నా కూతురునిచ్చి గొంతుకొయ్యాలని చూస్తున్నావా అని అవని పై సీరియస్ అవుతుంది.. ఇలాంటివాడు ఎలాంటివాడు మీకు తెలీదా.. వీడు ఒక గాలి వెధవ జూలై వాడు తిరుగుబోతు అని మీకు అర్థం అవ్వలేదా.. నా కూతురు విషయంలో నా నిర్ణయం ఫైనల్ అని అంటుంది పార్వతి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి తన కూతురికి ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేయాలని మీ నాన్న చూస్తున్నాడు. ఇప్పటికైనా మీ నాన్నకు కూతురు గురించి ఆలోచించడం అలవాటు చేసుకోమని చెప్పండి అని అక్షయ్ తో పార్వతి అంటుంది. నా తమ్ముడు ఎలాంటివాడు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తానని అవని అంటుంది..కానీ పల్లవి మాత్రం ఇలాంటి వాడికి మన ప్రణతినిస్తే తన జీవితం ఎలా మారిపోతుందో అర్థమవుతుంది కదా అత్తయ్య అని మధ్యలోకి వస్తుంది.. భరత్ నీ పల్లవి కొట్టబోతుంది. పల్లవి చేతిని పట్టుకున్న అవని నా తమ్ముని కొట్టడానికి నువ్వెవరు అని అంటుంది. ఇలాంటి పనులు చేసిన వారిని ఎలా వెనకేసుకొస్తుందో చూశారా అని పల్లవి అంటుంది.
అమ్మని కొట్టడానికి నువ్వెవరు అని పల్లవి చేయి పట్టుకొని అవని చంప పగలగొడుతుంది.. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి సమయం పడుతుంది ఏదో జరిగింది కదా.. అని నా తమ్ముడు తప్పు చేశాడంటే నేను అసలు ఊరుకోను అని అవని అంటుంది.. పల్లవి తో పాటు అందరూ షాక్ అవుతారు.. తమ్ముడు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని అవని అంటుంది..
అసలు నిజానిజాలు ఏంటో తెలియకుండా ఇలా నిందలు వేస్తే మర్యాదగా ఉండదని అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. నా తమ్ముని అన్యాయంగా ఇరిక్కించిన వాళ్ళు ఎవరో నేను కచ్చితంగా కనిపెడతాను అప్పుడు వాళ్లకి ఉంటుంది అని పల్లవి తో అవని అంటుంది. అవని మాటలు విన్న పల్లవి టెన్షన్ పడుతుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్ పల్లవి అని అడుగుతుంది అవని. టెన్షన్ ఏముంది ఇలాంటి వాడికి ప్రణతిని ఇస్తే తన జీవితం ఏమవుతుందని ఆలోచిస్తున్నాను అని అంటుంది.
భరత్ ని పిలిచి అవని నీ ఫ్రెండ్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతుంది. కానీ భరత్ మాత్రం నా ఫ్రెండ్ చాలా మంచివాడు అక్క అలాంటివాడు కాదు అని అంటాడు.. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది.. ఆ తర్వాత అవని శ్రీకర్ కి ఫోన్ చేస్తుంది.. పోలీస్ స్టేషన్ కి మనం వెళ్ళాలి ఈ విషయాన్ని పల్లవికి శ్రేయ కి తెలియనివ్వకుండా రావాలి శ్రీకర అని అవని అంటుంది. దానికి శ్రీకర్ సరే వదిన ఎవరికి తెలియకుండా నేను పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తాను అని అంటాడు..
అయితే శ్రేయ కు మాత్రం పల్లవి మీద అనుమానం ఉంటుంది.. పల్లవి దగ్గరికి వచ్చిన శ్రేయ నీది మామూలు బ్రెయిన్ కాదు నీకు తెలివితేటలు అమోహమంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. ఏంటి నీకు కావాలంటే కాయలు తీసుకో అంతేగాని ఇలా పొగుడుతున్నావు ఏంటి అని పల్లవి అంటుంది. దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు కావాలంటే నేను తీసుకుంటాను అని శ్రేయ అంటుంది.. నువ్వు చూసిన సంబంధాన్ని ప్రగతికిచ్చి చేయడానికి మరొక జీవితాన్ని బలి చేస్తావని అస్సలు ఊహించలేదు అని శ్రేయ అంటుంది.
ఆ మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది. తింగరి దానికి ఈ విషయం ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ ఏంటి వదిన అంటున్నావ్ భరత్ ను పోలీసులు అరెస్ట్ చేయడానికి పల్లవి కారణమా అని అడుగుతాడు. అదేం లేదు కమల్ మేమిద్దరం ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాము అని శ్రియ అంటుంది. నిజంగానే పల్లవి ఏం చేయలేదు కదా ఏదైనా చేస్తే తర్వాత ఉంటుంది అని కమలంటాడు. పల్లవి మాత్రం ఏ తప్పు జరిగినా నా మీద వేస్తావ్ ఏంటి అని అంటుంది..
Also Read : మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..
ఆ తర్వాత అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. మీకు ఏమైనా కావాలంటే అడగండి నేను వెళ్లి పడుకుంటాను అని అంటుంది.. కానీ అక్షయ్ మాత్రం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావ్.. నీ తమ్ముని నిర్దోషిని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నావా అని అడుగుతాడు.. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పార్వతికి ఆ పెళ్లి కొడుకు గురించి అసలు నిజం తెలుస్తుందా..? పల్లవి మోసం బయట పడుతుందా? చూడాలి…