Kangana Ranaut:బాలీవుడ్ క్వీన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది కంగనా రనౌత్ (Kangana Ranaut)..ఒకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ఇటు బీజేపీ పార్టీ తరఫున మండి నుండి పోటీ చేసి మినిస్టర్ గా పదవీ బాధ్యతలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. అటు రాజకీయ కార్యకలాపాలతో ఇటు సామాజిక అంశాలతో నిత్యం బిజీగా మారింది. అంతేకాదు అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ తన అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా ఏదైనా సరే నిర్మొహమాటంగా మాట్లాడే వారిలో కంగనా ప్రథమ స్థానంలో ఉంటారు. అలాంటి ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్లు చేసింది. అవకాశాలు రావాలి అంటే హీరోయిన్స్ అలాంటి పనులు చేయాల్సిందే అంటూ కుండబద్దలు కొట్టేసింది . మరి కంగనా ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.
హీరోయిన్ గా కొనసాగాలంటే అలా చేయాల్సిందే – కంగనా
కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. పలు విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. “సాధారణంగా ఇండస్ట్రీలో మార్పు అనేది సహజం. ఇండస్ట్రీ అంటేనే మార్పులమయం. హీరోయిన్స్ విషయంలో పరిస్థితులకు తగ్గట్టు మార్పులు ఏర్పడడం సహజమే. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కూడా.. ముఖ్యంగా ఈ మార్పులను హీరోయిన్లు తప్పకుండా అంగీకరించాలి. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాలకు తగ్గట్టుగా మారుతూ ఉండాలి. లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం. అవసరానికి తగ్గట్టుగా నడుచుకోకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవు. వాస్తవానికి ఇండస్ట్రీలో అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు లైఫ్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలి అంటే మార్పును ముందు స్వీకరించాలి. అప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉంటారు” అంటూ తెలిపింది. మొత్తానికైతే ఇన్ డైరెక్ట్ గా క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది కంగనా రనౌత్.
కంగనా మాటలకు మద్దతుగా హీరోయిన్స్..
ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పే కంగనా రనౌత్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే విషయాలపై కూడా స్పష్టంగా తెలియజేయడంతో చాలామంది హీరోయిన్స్ ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు. నిజానికి అవకాశాలు రావాలి అంటే మార్పును స్వీకరించాల్సిందే అని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా కంగనా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
కంగనా రనౌత్ కెరియర్..
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అటు ఫ్యాషన్ రంగంలో కూడా మంచి పేరు అందుకుంది. ఇప్పటివరకు తన నటనతో మూడు నేషనల్ అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు సొంతం చేసుకుంది. 2004లో రమేష్ శర్మ, పహ్లాజ్ నిలని నిర్మాతలుగా దీపక్ శివదశని దర్శకత్వంలో ‘ఐ లవ్ యు బాస్’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె తెలుగులో ప్రభాస్ (Prabhas) సరసన ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసి ఇటు తెలుగు ఆడియన్స్ ను కూడా పలకరించింది. ఇప్పుడు ఎక్కువగా తమిళ్ , హిందీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.