E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలును తిట్టిన ప్రభావతి.. మనోజ్ మీనా షాక్.. ఇది కదా అసలైన ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలును తిట్టిన ప్రభావతి.. మనోజ్ మీనా షాక్.. ఇది కదా అసలైన ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా కిందికి రాగానే పార్వతి రావడం చూసి ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. సుశీల అందరూ బాగున్నారా అని అడుగుతుంది. ఈ అమ్మాయి కూడా పెళ్లి సంబంధం చూస్తున్నారా అని సుశీల పలకరింపులు తర్వాత అడుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పెళ్లి కావాలంటే మరొకరు ఎవరో ఒకరు పోవాలి అని ప్రభావతి టక్కున నోరు జారేస్తుంది. ఆ మాట అనగానే అందరూ ప్రభావతిని దారుణంగా తిడతారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ తెలుసా ఎవరు చావాలని అనుకుంటున్నావు అని అందరూ ప్రభావతికి క్లాస్ పీకుతారు.. ఏదో నోరు జారీ మాట్లాడను వదిలేయండి అని ప్రభావతి అంటుంది. పిల్లలు పుట్టారు కాబట్టి నేను భరిస్తున్నాను లేదంటే నిన్ను ఎప్పుడో భరించే వాడిని అని సత్యం తిడతాడు. అందరూ కూడా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..మౌనిక నిజంగానే గుడికి వెళ్లిందా అయితే ఏ గుడికి వెళ్ళింది అని అడుగుతాను అడుగుతాడు.. పూజలో ఉండి ఉంటుంది లేరా వస్తుందిలే అని ఎంత చెప్పినా సరే సంజయ్ మాత్రం ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి స్వరాజ్యం సంజయ్ ని ఏదో ఒకటి కవర్ చేసి పంపిస్తుంది. ఇక మౌనిక సంజయ్ ఫోన్ చేయడం చూసి నేను వెళ్తాను మా ఆయన నేను భోజనం పెట్టకపోతే తినడు అని అంటుంది. ఇక మౌనిక నేను వెళ్తాను అని అంటే మీనా ఆపుతుంది.. అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు కేక్ కటింగ్ చేయండి అని ప్రభావతి అంటుంది. నా ప్రతి ఒక్క పుట్టినరోజుకి బాలు ఉంటాడు ఈ పుట్టినరోజు కూడా వాడు లేకుండా నేను ఎలా చేసుకుంటానని అనుకుంటున్నారు అని సుశీల అంటుంది.

Advertisement

అయితే ప్రభావతి వాడు ఇక వచ్చినట్టే.. తాగేసి ఎక్కడ పడుకున్నాడో ఏంటో అని అంటుంది. ఆ మాట వినగానే మీనా మీకు తెలుసా ఆయన తాగేసి పడుకున్నాడని మీకు తెలుసా అని అంటుంది. మీ గురించి నేను బయట పెడితే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు అని మీనా ఆపేస్తుంది. సుశీల వాడు ఎక్కడికెళ్లాడమ్మా ఎందుకోసం వెళ్ళాడు అని అడుగుతుంది. నేను ఫోన్ చేశాను అమ్మమ్మ కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది కాసేపట్లో ఆయన వస్తాడు మీ పుట్టినరోజుని ఎప్పుడు మిస్ చెయ్యడు కదా ఇప్పుడు కూడా మిస్ చెయ్యడు అని మీనా అంటుంది..

చాలా టైం అయింది కదా ఏ కేక్ కటింగ్ చేయండి అని అందరూ అంటున్నా సరే సుశీల మాత్రం వెయిట్ చేస్తూ ఉంటుంది.. వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు వాడి కోసం ఇంతసేపు మేము వెయిట్ చేయాలా అని ప్రభావతి అంటుంది. కానీ సుశీల మాత్రం నిన్ను ఎవరు వెయిట్ చేయమన్నారు నువ్వెళ్ళు అని అంటుంది. అది కాదండి మీరు ఆ లోపల అందరూ ఇచ్చిన గిఫ్ట్ లను చూడండి అని అంటుంది. సుశీల ఇక సత్యం చెప్పిన మాట ప్రకారం అందరూ తెచ్చిన గిఫ్ట్ లను తీసుకుంటుంది. మనోజ్ ఇచ్చిన దండం చూసి నాకు చాలా ఇష్టమైన దండం ఇచ్చావు రా చిన్నప్పుడు ఇలాంటిది నా దగ్గర పోయింది అని అంటుంది సుశీల.

Advertisement

రవి కేకును తయారు చేశానని చెప్తాడు, శృతి సుశీలకు ఫోన్ గిఫ్టుగా ఇస్తుంది. ప్రభావతి నేను కూడా మీకోసం గిఫ్ట్ తెచ్చాను కదా అత్తయ్య మీకోసమే ఈ టీవీ అనేసి అంటుంది. మరి రోహిణి నువ్వు తేలేదని కామాక్షి అంటుంది.. నేను మేకప్ వేసాను కదా అదే నా గిఫ్ట్ అని రోహిణి అంటుంది. నీది సింపుల్గా ఏ ఖర్చు లేకుండా పని అయిపోయింది కదా అనేసి కామాక్షి ఎగతాళి చేస్తుంది. ఇక పార్వతి ఆమె తెచ్చిన గిఫ్ట్ ని సుమతి కి ఇవ్వమని చెప్తుంది. ఆ చీర చూడగానే ప్రభావతి ఎంత 100 అని చీప్ గా తీసిపడేస్తుంది. పార్వతిని దారుణంగా ప్రభావతి అవమానిస్తుంది.

Also Read :‘కాంత ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

బాలు ఇంకా రాలేదు కదా కేక్ కట్ చేయండి అని అంటుంది ప్రభావతి. ఇప్పుడే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి నీకు అంత సీన్ లేదు అని ఎగతాళి చేస్తాడు.. అయితే బాలు ఎక్కడికెళ్లావ్ రా నువ్వు? నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని సుశీల బాధపడుతుంది. బామ్మ నీ కోసం నేను అదిరిపోయే సర్ప్రైజ్ తీసుకొచ్చాను అందుకే లేట్ అయింది అని బాలు అంటాడు. తన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలన్న సుశీల కోరికను బాలు తీరుస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×