E-Paper
Advertisement

Mohsin Naqvi: పాకిస్తాన్ నుంచి పారిపోతామని బెదిరింపులు.. శ్రీలంక ప్లేయర్ల కాళ్ళు పట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi: పాకిస్తాన్ నుంచి పారిపోతామని బెదిరింపులు.. శ్రీలంక ప్లేయర్ల కాళ్ళు పట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ
Advertisement

Mohsin Naqvi: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో మంగళవారం రోజు ఓ కోర్టు బయట బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. మరో 27 మంది గాయపడ్డారు. అయితే ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లు రావల్ పిండిలో జరుగుతున్నాయి. అయితే బాంబు పేలుడు ఘటనతో శ్రీలంక ప్లేయర్లు భయాందోళన చెందుతున్నారు. దాదాపు 9 మంది ఆటగాళ్లు పాకిస్తాన్ పర్యటనని మధ్యలోనే వదిలి తిరిగి శ్రీలంక వెళ్లాలని భావించారు. కానీ శ్రీలంక క్రికెటర్లకు ఆ దేశ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లైందా..? ఆమె భ‌ర్త ఇత‌నేనా..సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్

శ్రీలంక క్రికెటర్లు పాకిస్తాన్ ని వీడొద్దు:

Advertisement

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు ఆ దేశాన్ని వీడొద్దని.. షెడ్యూల్ ముగిసేంతవరకు అక్కడే ఉండాలని శ్రీలంక క్రికెట్ బోర్డు {SLC} ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. 9 మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్ళిపోతామని జట్టు మేనేజ్మెంట్ ని కోరినప్పటికీ.. అందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించలేదు. వన్డే సిరీస్ తో పాటు ముక్కోనపు సిరీస్ ని ముగించుకున్న తర్వాతే స్వదేశానికి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తమ మాటను దిక్కరించి పాకిస్తాన్ ని వీడితే.. వారు కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఒకవేళ వాళ్ళు వచ్చినా బెంచ్ లో ఉన్న ఆటగాళ్లతో పాకిస్తాన్ తో సిరీస్ ని కొనసాగిస్తామని తెలిపింది.

అయితే శ్రీలంక ఆటగాళ్లు పాకిస్తాన్ ని వీడి వెళ్లిపోతామని చెప్పడంతో భయపడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. శ్రీలంకతో చర్చలు జరిపింది. శ్రీలంక క్రికెటర్లకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటామని లంక క్రికెట్ బోర్డుకు హామీ ఇచ్చింది. దీంతో శ్రీలంక ప్లేయర్లు పాకిస్తాన్ లో ఉండి సిరీస్ పూర్తయిన తర్వాత వెలతామని భరోసా ఇచ్చారు. ఇక గురువారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ నేడు జరగబోతోంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక తమ మాటను గౌరవించి పాకిస్తాన్ లో మ్యాచ్ ఆడతామని ఒప్పుకున్న శ్రీలంక క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తరపున మొహ్సిన్ నఖ్వి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీలంక జట్టుకు ఇది మొదటిసారి కాదు:

Advertisement

పాకిస్తాన్ లో శ్రీలంక జట్టు భద్రత ముప్పును ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత చాలా సంవత్సరాలు పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ జరగలేదు. మార్చి 2009 లాహోర్ లోని గడాఫీ స్టేడియంకి వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే తో పాటు అనేకమంది ఆటగాళ్లు గాయపడ్డారు. అలాగే పలువురు పాకిస్తాన్ భద్రత సిబ్బంది అమరులయ్యారు.

Also Read: Smriti Mandhana wedding: స్మృతి మందాన వెడ్డింగ్ కార్డు వైరల్.. పెళ్లి ఎప్పుడంటే?

ఈ దాడి తరువాత 10 ఏళ్ల వరకు ఏ విదేశీ జట్టు కూడా పాకిస్తాన్ లో పర్యటించలేదు. 2019 డిసెంబర్ లో శ్రీలంక జట్టు తిరిగి పాకిస్తాన్ పర్యటనకు రావడం ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు దారితీసింది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ – శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లోని మొదటి వన్డేలో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×