E-Paper
Advertisement

Kantha Twitter Review : ‘కాంత ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Kantha Twitter Review : ‘కాంత ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Kantha Twitter Review : లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆయన నటించిన తాజా చిత్రం కాంత ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇవాళ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్ ని అందుకుందో జనాల రెస్పాన్స్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూ లో ఇప్పుడు మనం చూసేద్దాం..

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఈమధ్య సినిమాల్లో హీరోగా మాత్రమే కాదు. అటు సినిమాలను కూడా నిర్మిస్తూ సక్సెస్ అయ్యాడు. ఈయన ఈమధ్య నిర్మించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. గత ఏడాది ఈయన నటించిన సినిమా లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాకు నిర్మాతగా మాత్రమే కాదు హీరోగా కూడా నటించాడు ఆ సినిమానే కాంత.. ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుందో నెటిజెన్ల రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం..

Advertisement

చాలా సినిమాలు వినోదాన్ని అందించడం కోసమే తీస్తారు. అలాంటి సినిమాలనే మనం కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడో ఒకటి మాత్రమే వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలా స్టోరీ తో థియేటర్లోకి వచ్చేస్తుంది.. అలాంటి సినిమానే ఈ కాంత.. రెండు గంటలసేపు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళింది.. దర్శకుడికి, నటులకు, నిర్మాతలకు అభిరుచి వుంటే తప్ప ఇలాంటి సినిమా తెరపైకి రాదు.. సినిమా అంతా కూడా ఉత్కంఠ గా ఉంది అంటూ ఓ నేటిజన్ ట్వీట్ చేశారు…

Advertisement

 

కాంత మూవీని ఒకసారి చూసి చెప్పండి.. జనాలకు నచ్చుతుంది.. ఇందులో ఎక్కువగా ఏమిలేదు పర్వాలేదు అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు..

ఈ మూవీ తెలుగు డబ్బింగ్ లాగే ఉంది. కానీ పెద్దగా ఆకట్టుకోకపోయిన బాగానే ఉంది. మలయాళం లో సినిమా బాగున్న తెలుగులో కొన్ని మిస్టేక్స్ చేశారంటూ ఓ నెటిజన్ ట్వీట్స్ చేశారు.

ఈ మూవీకి పెద్దగా పబ్లిక్ రెస్పాన్స్ అయితే పాజిటివ్ గా రాలేదని తెలుస్తుంది.. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త డల్ గానే ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా దుల్కర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ప్రస్తుతానికైతే యావరేజ్ టాక్ ని అందుకున్న ఈ సినిమా.. సాయంత్రం లోపు పాజిటివ్ టాక్ గా మారుతుందేమో చూడాలి.. ఇక కలెక్షన్ ఏవిధంగా ఉంటాయో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే

Related News

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

Big Stories

Advertisement
×