E-Paper
Advertisement

Jubilee Hills bypoll counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ షురూ.. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ లీడ్

Jubilee Hills bypoll counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ షురూ.. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ లీడ్
Advertisement

Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభంజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం కౌంటింగ్ కేంద్రం వద్ద ఈ ప్రక్రియ మొదలైంది. కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ ప్రారంభంలో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను అధికారులు లెక్కించారు. పోస్టల్ ఓట్ల ఫలితాలు స్వల్ప ఆధిక్యతను సూచించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 15 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12 ఓట్లు దక్కాయి. ఇక, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 9 ఓట్లు వచ్చాయి. పోస్టల్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

నవీన్ యాదవ్: 15

మాగంటి సునీత: 12

Advertisement

లంకల దీపక్ రెడ్డి: 9

పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు పూర్తైన వెంటనే, అధికారులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) లెక్కింపునకు సిద్ధమవుతున్నారు. ఈవీఎంల సీల్స్‌ను తెరచి, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ప్రధాన అభ్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో.. ఈవీఎంల లెక్కింపు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. గుండెపోటుతో అభ్యర్థి మృతి

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×