Mohammad Yousuf Cooked Indian Cricket Team : టీమిండియా ఫీల్డర్లపై పాకిస్తాన్ మాజీ లెజెండరీ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫీల్డింగ్ చేయమంటే టీమిండియా క్రికెటర్లు చేపలు పడుతున్నారని ఆగ్రహించారు. టీమిండియా అంటే ఎంతో బలమైన జట్టు అని బయట అందరూ అనుకుంటున్నారు… కానీ ఆ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ఆ దేశ ఆటగాళ్లు సరిగ్గా ఫీల్డింగ్ చేయడం లేదని సెటైర్లు పేల్చారు. ఒక్క క్యాచ్ అంటే ఒక్క క్యాచ్ కూడా సరిగ్గా పట్టడం లేదని మండిపడ్డారు. కాస్త మంచు ప్రభావం ఉంటే… చేతుల్లోకి వచ్చిన క్యాచ్ లను కూడా వదిలేస్తున్నారని ఆగ్రహించారు. వీళ్ళకంటే తమ పాకిస్తాన్ క్రికెటర్లే బెటర్ అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాగే టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిస్తే చాలా మ్యాచులు ఓడిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
టీమిండియా ఫీల్డింగ్ తీరుపై మహమ్మద్ యూసఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ఫీల్డర్లు ప్రతి మ్యాచ్ లోను కనీసం రెండు నుంచి మూడు సాధారణ క్యాచ్ లు వదిలేస్తున్నారని ఫైర్ అయ్యారు. మొన్న పాకిస్తాన్ తో జరిగిన ఏషియన్ గేమ్స్ ఫైనల్స్ 2026 సందర్భంగా కూడా టీమిండియా ఆటగాళ్లు క్యాచులు వదిలివేయడం అందరూ చూశారని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్ సందర్భంగా అవే వైఫల్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పేలవమైన ఫీల్డింగ్ కారణంగా రెండో టి20 తో పాటు నాలుగవ టి20లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓడిపోయిందని మహమ్మద్ యూసఫ్ గుర్తు చేశారు.
ప్రపంచంలో అత్యంత అధ్వానమైన ఫీల్డింగ్ లో నెంబర్ వన్ స్థానంలో టీమిండియానే ఉంటుందని వ్యాఖ్యానించారు. తమ పాకిస్తాన్ క్రికెటర్ల ఫీల్డింగ్ చూసి ట్రోలింగ్ చేసే ఇండియన్స్… ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని హేళన చేశారు. తన అంచనా ప్రకారం, టీమ్ ఇండియా కంటే పాకిస్తాన్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉందని… ఇంకా మెరుగుపడుతోందని తెలిపారు. వారి ఫీలింగ్ మాత్రం రోజు రోజుకు దిగజారి పోతుంది తప్ప… ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కనబడడం లేదని పరువు తీశారు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నామన్న బలుపుతో విర్రవీగుతున్నారు… కానీ ఒదిగి ఉంటేనే ఎవరికైనా మంచిదని మహమ్మద్ యూసఫ్ హెచ్చరించారు. విండీస్ తో జరిగే చివరి టీ20 సందర్భంగా ఫీల్డింగ్ మెరుగు కాకపోతే టీమిండియాకు మరోసారి ఓటమి ఎదురవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ తరుణంలోనే టీమిండియా ఫీల్డింగ్ తీరుపై మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.