E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  తనను తీసుకెళ్లి ఎందుకంత సేఫ్‌గా మళ్లీ పంపించావు నీ కొడుకుకి భయపడ్డావా అంటూ జ్యోత్స్న వెళ్లి మాలినిని అడుగుతుంది. అందుకు నా కొడుక్కి నేను భయపడటం ఏంటి అని మాలిని అడిగితే.. నేను కనిపించకపోతే నీ కొడుకు నన్ను మర్చిపోతాడు అనుకున్నావు.. కానీ కనిపించకపోతే మరీ ఇంత మనసులో పెట్టుకుని పిచ్చోడైపోతాడని అసలు నువ్వు ఊహించలేదు కదా అంటుంది జ్యోత్స్న. తనను లేకుండా చేయాల్సిన అవసరం నీకు తప్ప మరొకరికి లేదు కానీ నీ కొడుకు కోసం నన్ను వదిలేశావు.. కనిపించకపోతేనే పరిస్థితి ఇలా ఉంటే.. నేనే పోతో ఇంకెలా ఉంటుంది.

నీ భర్త పక్కన నీ ఫోటో నీ కొడుకే పెడతాడత్త అంటుంది. దీంతో మాలిని కోపంగా తిడుతూ నిన్ను నా కొడుకు ప్రేమిస్తున్నాడని పగటి కలలు కంటున్నావా..? అంటుంది. పగటి కలలు కాదు అత్త ఆఫ్ట్రాల్‌ ఆఫీసులో ఒక పీఏ కోసం ఇంత ఎందుకు..? రాత్రంతా కారులోనే పడుకున్నాడట..అంటూ జ్యోత్స్న చెప్తుంది. అందుకు మాలిని అరుస్తుంది. నువ్వు అరిచినా నాలో నీకు భయం కనబడదు.. ఎందుకంటే నేను మొండిదాన్ని నువ్వు నన్నేం చేయలేవు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. అప్పుడే సూరజ్‌ వచ్చి మీ ఇంటికి వెళ్దాం పద అంటాడు. జ్యోత్స్న రానంటుంది. అందుకు సూరజ్‌ బలవంతంగా చేయి పట్టుకుని తీసుకెళ్తుంటాడు. అది చూసి మాలిని షాక్‌ అవుతుంది. జ్యోత్స్న చూసి నవ్వుతుంది.

Advertisement

సూరజ్‌, జ్యోత్స్నను తీసుకుని రావడం అందరూ చూసి సంతోషంగా బయటకు వస్తారు. అందరినీ చూస్తూ సూరజ్‌ తిడతాడు. ఈ అమ్మాయి కోసమేగా మీర మమ్మల్ని అనుమానించింది ఈ అమ్మాయి కోసమేగా మీరు మా ఇంటి మీదకు పోలీసులను తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి వచ్చేసింది. ఈ అమ్మాయిని దాచాల్సిన అవసరం మాకు లేదు అంటూ సూరజ్‌ చెప్తుంటే.. ఎవరో దాచారో మాకు తెలుసు. మీరు జ్యోత్స్నను దాచకపోయి ఉంటే జ్యోత్స్న నేరుగా ఇంటికి వచ్చేది. కానీ ఆఫీసుకు వచ్చి అక్కడి నుంచి వీడియో కాల్ చేసింది అంటేనే కాదు చేయించావు అంటేనే అర్థం అవుతుంది జ్యోత్స్నను మీరే దాచారని అంటాడు కార్తీక్‌. మీ బావ అడుగుతున్నాడు కదా చెప్పు అంటే ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న.

దీంతో సూరజ్‌ గొడవ చేస్తుంటే.. నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా ఇక నువ్వు వెళ్లు అంటే లేదు అంటూ తప్పు చేసిన వాళ్లు ఎవరో.. ఇప్పుడు అర్థం అయింది. నిందలు వేసే వాళ్లు ఎవరో ఇప్పుడు అర్తం అయింది అంటూ సూరజ్‌ మాట్లాడుతుంటే.. ఎవర్రా నిందలు వేసేది అంటూ సుమిత్ర అడిగితే.. మీరే అంటూ నిందలే వేసేది మీరే జ్యోత్స్నను కూడా మీరే దాచిపెట్టారు మీ మీద మేము పగ తీర్చుకున్నాము మా మీద పగ తీర్చుకోవడం కోసం ఇదంతా చేశారు అంటూ సూరజ్‌ చెప్పగానే.. అందరూ షాకింగ్‌గా చూస్తుంటారు. జ్యోత్స్న కోపంగా సూరజ ఇక చాలు ఇక నువ్వు బయలుదేరు అంటుంది. కానీ తాను వెళ్లనని దీంతో చేయని తప్పుకు నిందలు మోస్తున్నాం.. లేదంటే మేము తప్పు చేసిన మనుషుల్లాగే ఉండిపోవాలి. నిజానికి తప్పు చేసింది మీరే అంటాడు.

Advertisement

అందుకు జ్యోత్స్న కోపంగా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. ఆ గొడవలో సూరజ్‌ ఆవేశంగా జ్యోత్స్న, కార్తీక్‌ల ప్రేమ గురించి మాట్లాడతాడు. కార్తీక్‌ కోపంగా సూరజ్‌ను తిడుతూ జ్యోత్స్న కనిపించకపోవడానికి వంద పర్సెంట్‌ మీ అమ్మే కారణం. జ్యోత్స్నకు నువ్వు దగ్గర అవుతావయని జ్యోత్స్నను మాయం చేసింది. జ్యోత్స్న దూరం అయిన నిజం తెలిస్తే నువ్వు నిలదీస్తావని తెలిసి మళ్లీ జ్యోత్స్నను వదిలేసింది అంటూ కార్తీక్‌ చెప్తాడు. సూరజ్‌ కోపంగా అరుస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×