Gundeninda GudiGantalu Today episode October 21st : బాలు మీనా ఇద్దరు బయలుదేరుతుండగా మే నాకు ఫోన్ రావడంతో బాలు నేను అటు వెళ్తాను నువ్వు ఇటు వెళ్ళు అని వెళ్ళిపోతారు. అయితే గుణ పంపించిన రౌడీలు బాలుని రెచ్చగొట్టి ఇంకాస్త స్పీడ్ గా కారుని తీసుకెళ్లి ఎలా చేస్తారు. అయితే వాళ్ల వల్ల బాలు ఇంకాస్త స్పీడ్ పెంచి ఒక తల్లి బిడ్డను తప్పించబోయి అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ బైక్ ని గుద్దేసి ఆగిపోతాడు. అది చూసిన అరుణ్ నువ్వు ఎందుకురా ఇప్పుడు నన్నే టార్గెట్ చేస్తూ ఉంటావు అని ఆ కారు చేసి పోలీస్ స్టేషన్ కి బాలుని తీసుకొని వెళ్తాడు. అయితే బాలు మాత్రం ఆ కారుకి బ్రేకులు లేవని ఎంత చెప్తున్నా సరే అరుణ్ మాత్రం అస్సలు వినకుండా బాలుని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళిపోతారు.
ఈయన చింటూ నీ కలిసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతానని వెళ్ళాడు కదా అక్కడికి వెళ్లడో లేదో అని మీనా బాలుకు ఫోన్ చేస్తుంది. కానీ పోలీస్ కానిస్టేబుల్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్లో మీ ఆయన ఉన్నాడని చెప్పగానే మీనా కంగారు పడిపోతూ పోలీస్ స్టేషన్కు వస్తుంది. అయితే బాలు జరిగిన విషయం అంత చెప్పినా కూడా మీనా మాత్రం కానిస్టేబుల్ తో ఎంతగా మాట్లాడిన సరే కారుని సీజ్ చేసాం వెళ్లిపోండి అని పంపిస్తారు బాలు చాలా ఫీల్ అయిపోతాడు. అయితే బయట వచ్చిన మేన మన కారుకి ఏం కాదులేండి మీరు ఏమి కంగారు పడకండి అని అంటుంది. కానీ బాలు మాత్రం కారుని చీజ్ చేశారు అనే చాలా బాధపడిపోతూ ఉంటాడు. బాలుని చూసి బాధ పడిపోతుంది మీనా..
అయితే బాలు మీనా బయటికి వెళ్లారు కదా ఇంకా రాలేదేంటి అని ప్రభావతి అడుగుతుంది అయితే మేము కూడా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు అని అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళు బయటికి వెళ్లారు అని ప్రభావతి అడుగుతుంది వస్తారు కదా తెలుస్తుంది అని అంటుంది శృతి. అయితే నువ్వు తిన్న ఉప్మా తిన్నారు అందులో ఏం కలిపావో ఏంటో దాని వల్ల బాధపడుతున్నారేమో అని రవి మొదలు పెడతారు ఇక రవిని అడ్డుపెట్టుకొని మనోజ్ ని కూడా తిట్టేస్తుంది. అయితే శృతి అన్నమాటలకి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇన్ని రోజులు అనలేదు కానీ ఇప్పుడు నీ మనసులో ఇంత ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది అని శృతి తో రోహిణి అంటుంది.
బాలు మీనా చాలా బాధపడిపోతూ రావడంతో ఏమైంది ఎందుకు మీరు అంతగా బాధపడిపోతున్నారు ఏం జరిగింది? ఎవరినైనా గుద్దాడ లేకపోతే ఎవరైనా విని గుద్ధ రా ఏం చేసి వచ్చాడు అని ప్రభావతి అడుగుతుంది. ప్రభావతి మాట విన్న మీనా ఈయన కారు అదుపు తప్పింది పోలీస్ బండి గుద్దేసింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్అయ్యి అందరూ లేసి చూస్తారు.. అయితే బాలు కి మాత్రం అవమానంగా అనిపిస్తుంది. మనూజు ఎప్పుడు నేను కార్ డ్రైవింగ్ తోపు అని అంటాడు కదా అలాంటివాడు ఎందుకు ఇప్పుడు గుద్దేశాడు అని అనగానే రోహిణి కూడా తందానా అంటుంది. కారులో బ్రేక్ ఫెయిల్ అయ్యి అతని గుద్దాడు అంతేతప్ప వేరే ఉద్దేశంతో లేదు అని మీనా ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం ఏదోకటిని బాధ పెడుతుంది. కానీ సత్యం నా కొడుకుకి ఏం కాలేదు అదే నాకు పదివేలు అంటూ సంతోషంగా ఉంటాడు.
అరుణ్ ఆ కారుని తీసుకురమ్మని కానిస్టేబుల్ కి చెప్తాడు. అయితే ఆ కానిస్టేబుల్ కారుని తీసుకొచ్చేందుకు వెళ్తాడు. అయితే అరుణ్ ఫోన్ మాట్లాడుతూ బయటికి రావడంతో ఆ కారులో నుంచి కానిస్టేబుల్ గాయాలతో బయటకు రావడంతో అది చూసిన అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటయ్యా ఈ గాయాలంటే అని అడుగుతాడు. ఆ గాయాలు ఆ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే నాకు అయ్యాయి. సార్ అని అతను జరిగిన విషయాన్ని చెప్తాడు. అయితే ఇది బయటికి వస్తే పరువు పోతుంది అని అరుణ్ దీన్ని బయటికి చెప్పొద్దు అని చెప్తాడు కానీ అతను మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు.. ఆ తర్వాత అరుణ్ అతని కారు చీజ్ చేసి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేద్దాం ఆ తర్వాత అతని మన దారికి వస్తాడు అని అంటాడు.
రాత్రి అవ్వగానే ఏంటండి కారు లేదని బాధ పడిపోతున్నారా అని నేను అడుగుతుంది.. నాకు మనూస్ లాగా బిజినెస్ లేదు రవి లాగా వంటలు రావు నాకు వచ్చింది ఒక డ్రైవింగ్ అదే ఇప్పుడు లేదు అంటే నాకు చాలా బాధగా ఉంది మీ నాని బాలు బాధపడిపోతూ ఉంటాడు. అయితే బాలు అలా బాధ పడిపోవడం చూసిన మేన మీరు ఎంత చెప్పినా వినరు. అది దేవుడు ఇలా చేశాడు అని మీనా అంటుంది. అయితే మీనా మాటలు విన్న బాలు ఫీల్ అవుతాడు కానీ మీనా మాత్రం దేవుడి కంకణం కట్టాలి అని కడుతుంది. అటు రోహిణి గుణ కి ఫోన్ చేసి బాలుని చంపాలని చూస్తావా నువ్వు ఇలా చేస్తే నా కాపురం నిలబడతది అనుకోలేదు ఒక ప్రాణం పోతుంది అని రోహిణి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..