E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: గుణ పై బాలుకు అనుమానం.. బాలు దెబ్బకు మనోజ్ అవుట్.. శోభాకు వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: గుణ పై బాలుకు అనుమానం.. బాలు దెబ్బకు మనోజ్ అవుట్.. శోభాకు వార్నింగ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 26th : శృతి ఇక ఇంకెవరున్నారు రోహిణి ఉంది కదా.. తనే నువ్వు తన బండారం బయటపెట్టావని నీ మీద కక్ష పెట్టి ఇలాంటివి చేసిందేమో అని అనగానే ఒక్కసారిగా రోహిణి కంగారు పడిపోతుంది. అసలు నాకేం పని నేను మరీ ఇంత శాడిస్ ని కాదు అబద్దాలైతే చెప్పానుగాని ఇలాంటి మాటలు నేనెప్పుడూ అనలేదు. ఇలాంటి పనులు నేనెప్పుడూ చేయలేదు మనిషి ప్రాణాలు తీయాలని నేను అస్సలు అనలేదు అనుకోలేదు అని రోహిణి అంటుంది. అసలు బాలుని చంపేస్తే నాకేం వస్తుంది.ఎందుకు నా మీద అనుమానంగా ఉంటావు. ఎప్పుడు ఏదో ఒకటి నన్నే అంటావా అని రోహిణి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మాటతో మీనా ఊరికే అనింది లే రోహిణి నువ్వు ఏమి కంగారు పడదు అని అంటుంది.

బాలుకు అనుమానం పెరిగిందా..?

ప్రభావతి దగ్గరికి వెళ్లిన బాలు అమ్మవతి నువ్వే నన్ను చంపాలని చూసావా.. నేనంటే నీకు ఇష్టం లేదు కదా అయితే నువ్వు ఆ చింతామణి లాగా ఆలోచించి ఇలా చేసావా అని అడగగానే ప్రభావతి నాకిం సంబంధం లేదు నేను మరీ అంత దుర్మార్గురాల్ని కాదు అని ప్రభావతి అంటుంది. ఏంటి ప్రభ నిజం చెప్పు నువ్వే ఇదంతా చేసావా అని సత్యం అడగ్గానే.. ఏవండీ వీడు అంటే నాకు ఇష్టం లేదు సరే వీడిని నేనే కన్నాను కదా ఎలా అండి నా కొడుకు నేను చంపుకుంటాను అని ప్రభావతి అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రభావతి వైపు చూస్తారు. అక్కడి నుంచి ప్రభావతి వెళ్ళిపోతుంది అప్పుడే రోహిణి వెళ్లి వాటర్ తాగాలని అనుకుంటుంది. రోహిణి ఎక్కడ దొరికిపోతాను అని కంగారు పడిపోతూ ఉంటుంది. మరి బాలు కి రోహిణి ఇదంతా చేసింది అని అనుకుంటాడా లేదా ఇంకేదేనా ట్విస్ట్ ఎదురవుతుందా అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాల్సిందే..

గుణ మనుషుల పై అనుమానం..

Advertisement

బాలుకి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్నదానికి ఒకసారి మళ్లీ ఆలోచిస్తాడు. అయితే అక్కడ బాలు తనకి సంబంధించిన మొత్తం స్టోరీని ఒకసారి రివైజ్ చేసుకుంటాడు. ఇదంతా బాలునే ఎవరో కావాలని చేసారు అని అనుమానంతో ఉంటాడు. మీనా వెళ్లి స్నానం చేసి రండి అని చెప్పగానే బాలుకి ఆ మనుషులు గుణ మనుషులు అని తెలిసిపోతుంది. వాళ్ల వల్లే ఇన్ని ఆక్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారు అని అనుమానం అయితే పెరుగుతుంది.. అయితే మీనా దేని గురించి ఆలోచిస్తున్నారు అది తర్వాత చూసుకుందాం ముందు మీరు వెళ్లి స్నానం చేసేస్తే మీకు నేను భోజనం వడ్డిస్తాను అని అంటుంది. ఇక బాలు సరే అని వెళ్తాడు వీరిద్దరి కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఉన్నాయి ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

బాలు కోసం గుమగుమలు..

బాలు కోసం మీన అనేక రకాల వంటలను చేస్తుంది.. ఎలాగైనా సరే ఆ వంటలు తినాలి అని అందరూ అనుకుంటారు అయితే రవితో పాటు శృతి వాళ్ళందరూ కూడా బాలు క్షేమంగా బయటకు వచ్చారు కదా అందుకే మీన ఆ వంటలు చేసింది అని అనుకుంటారు. అయితే మనోజ్ మాత్రం వాటిని చూసి ఇంకా అస్సలు ఆగలేను తినాలి అని అంటాడు.. వీడేమైనా గొప్ప పని చేసి వచ్చాడా అన్న మాటకి అప్పుడు అక్కడికి వచ్చిన బాలు నేను గొప్ప పని చేయకపోయినా తప్పుడు పని చేయలేదు రా అని మనోజ్ ని తిననివ్వకుండా నోరు మూసేస్తాడు.. ఇక ఫైనల్ గా అందరూ చెప్పడంతో భోజనం దగ్గర నిన్ను వదిలేస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత ప్రభావతి తినలేదు అన్న విషయం తెలుసుకుని బాలు చాలా ఫీల్ అయిపోతాడు. బాలు మాటలు విన్నా మీనా ఎలాగైనా సరే అత్తయ్య గారిని ఒప్పించాలి అని అనుకుంటుంది.

ప్రభావతిని బుజ్జగించిన బాలు..

Advertisement

ప్రభావతి అలిగింది అని చెప్పగానే బాలు ఇక నాకు తప్పదు కదా అని తనకోసం భోజనం తీసుకొని వెళ్తాడు. ప్రభావతి అక్కడ ఎందుకు నన్ను ఇలా అంటున్నావ్ నాకు నోరు ఎక్కువే కానీ ఈరోజు ఎవరిని కూడా నేను చంపాలి అని అనుకోలేదు అని అంటుంది. ఇక ప్రభావతి నీ బుజ్జగించేందుకు బాలు చేసిన ప్రయత్నాలు మొత్తానికి సక్సెస్ అవుతాయి. అందరూ కలిసి తల్లి కొడుకుల అనుబంధం అంటే ఇదే అని మురిసిపోతూ ఉంటారు. ప్రభావతి బాలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని భోజనం చేయడం చూసి అందరూ సంతోషంగా ఉంటారు. ఇకపోతే బాలు చేసిన ప్రయత్నం ఫలించడంతో బాలు నిజంగానే గ్రేట్ అని అనుకుంటారు.

శోభకు స్ట్రాంగ్ వార్నింగ్..

ప్రభావతి తిన్న తర్వాత ఇక ఉదయం లేవగానే అందరూ కలిసి ఇంట్లో బూజు దులపాలని అనుకుంటారు. అయితే అందరూ కలిసి బూతు తెలుపుతూ సంతోషంగా ఉండడం చూసి సత్యం చాలా సంతోషంగా ఉంటాడు. నా కొడుకులు కోడలు అందరూ కలిసి ఇలా పని చేసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అయితే అప్పుడే సడన్గా ఇంటికి శోభ వస్తుంది. శోభ శృతిని చూసి నువ్వు పెరిగిన వాతావరణం ఏంటి నువ్వు వచ్చిన ఇంటి పేరేంటి ఇలాంటి పనులు నువ్వు చేస్తున్నావా అని అంటుంది.. ఆ మాటతో శృతి ఇంకొకసారి ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని అంటుంది. అదేవిధంగా బాలు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : నారాయణ స్టోరీతో కన్నీళ్లు.. మాధవ్ మాటతో షాక్.. చక్రీకి అనుమానం..

Related News

Illu Illaalu Pillalu Valli : వల్లి అవుట్.. ఇదే ఫైనల్ ట్విస్ట్..

Podarillu Today Episode : నారాయణ స్టోరీతో కన్నీళ్లు.. మాధవ్ మాటతో షాక్.. చక్రీకి అనుమానం..

Karthika Deepam 2 Serial Today Episode October 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: భోజనం చేస్తుటే వెళ్లి గొడవ చేసిన దక్షిణమూర్తి – కోపంతో ఊగిపోయిన శివనారాయణ  

Illu Illalu Pillalu Today Episodes: అమూల్యకు షాక్.. రామరాజు మాటతో సాగర్ ఫైర్.. భద్రకు కన్నీళ్లు..

Brahmamudi Serial Today Episode October 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీ కేసులో మేనేజర్‌ నుంచి రాజు నిజం రాబడతాడా..?  

Intinti Ramayanam Today Episode: పల్లవి రచ్చ.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. అవనికి షాక్..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×